iDreamPost
android-app
ios-app

Realme P2 Pro 5G: రియల్ మీ నుంచి మరో కొత్త ఫోన్! సూపర్ ఫీచర్లు, ధరపై అదిరిపోయే డిస్కౌంట్!

  • Published Sep 15, 2024 | 5:00 AM Updated Updated Sep 15, 2024 | 5:00 AM

Realme P2 Pro 5G: రియల్ మీ తాజాగా వినియోగదారుల కోసం మరో కొత్త ఫోన్‌ P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బాగా ఆకట్టుకుంటుంది.

Realme P2 Pro 5G: రియల్ మీ తాజాగా వినియోగదారుల కోసం మరో కొత్త ఫోన్‌ P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బాగా ఆకట్టుకుంటుంది.

Realme P2 Pro 5G: రియల్ మీ నుంచి మరో కొత్త ఫోన్! సూపర్ ఫీచర్లు, ధరపై అదిరిపోయే డిస్కౌంట్!

రియల్ మీ తాజాగా వినియోగదారుల కోసం  మరో కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యూత్‌ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల FHD + ఫాస్టెస్ట్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. .ఇంకా  అలాగే 2412×1080 పిక్సెల్ రిజల్యూషన్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, ప్రో-XDR, AI ప్రొటెక్షన్ వం ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.  120 nits బ్రైట్‌నెస్ ని ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 7S Gen 2 చిప్‌సెట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో  గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU వంటి అదిరే ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ AI Eye ప్రొటక్షన్ ఫీచర్ ని కూడా కలిగి వుంది. కంపెనీ ఈ స్మార్ట్  ఫోన్‌లో మూడు వేరియంట్లని అందిస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్లో 8GB+128GB, 12GB+256GB, 12GB+512GB వంటి వేరియంట్లు ఉన్నాయి.

 ఈ స్మార్ట్ ఫోన్ ని  ఆకర్షణీయమైన బయో విజన్ డిజైన్ తో రియల్ మీ కంపెనీ లాంచ్ చేసింది. రియల్ మీ పి2 ప్రో 5జి ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక సూపర్ OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 సెన్సార్ కలిగిన సూపర్ కెమెరా వుంది. ఇంకా అలాగే 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. ఇంకా  అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ కెమెరా  అందుబాటులో ఉంది. ఇక ఈ కెమెరాలో AI హైపర్ RAW అల్గారిథం, AI రిమూవల్ వంటి చాలా AI ఫీచర్లు  ఉన్నాయి. ఇంకా అంతేగాక ఈ స్మార్ట్ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5200mAh బ్యాటరీ వుంది. ఈ స్మార్ట్ ఫోన్లో గేమింగ్ కోసం GT మోడ్ ని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అందు కోసం ఈ స్మార్ట్ ఫోన్ IP65 రేటింగ్‌ను కలిగి ఉంది.

ఇక ఈ రియల్ మీ పి 2 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 21,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దీనిపై రూ.2000 తగ్గింపు ఉంటుంది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ ని రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక  12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999 ధరతో లాంచ్ అయింది. దీనిని రూ.3000 తగ్గింపుతో రూ 21,999 కే పొందవచ్చు. ఇక 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999 ఉంది. దీనిపై కూడా  రూ.3000 తగ్గింపు ఉంటుంది. దాంతో ఈ ఫోన్  రూ. 24,999 కే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను దీపావళి ముందు కొనుగోలు చేసే యూజర్స్ కు ఈ తగ్గింపు  లభిస్తుంది. సెప్టెంబర్ 17 వ తేదీ ఈ స్మార్ట్ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్, రియల్ మీకీ సంబంధించిన వెబ్ సైట్, యాప్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.