Vinay Kola
Realme Narzo 70 Turbo: రియల్ మీ తాజాగా నార్జో 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. రియల్ మీ నార్జో 70 టర్బో ఫోన్ సూపర్ ఫీచర్లతో రాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.
Realme Narzo 70 Turbo: రియల్ మీ తాజాగా నార్జో 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. రియల్ మీ నార్జో 70 టర్బో ఫోన్ సూపర్ ఫీచర్లతో రాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.
Vinay Kola
రియల్ మీ తన ఫోన్లతో మంచి ప్రజాదరణ పొందింది. తాజాగా ఈ కంపెనీ నార్జో 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో అందరి చూపు దీనిపై మళ్లింది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి వచ్చిన ఫోటోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫొటోల్లో ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ చూస్తే ఇదో సూపర్ స్టైలిష్ ఫోన్ అని అర్ధం అవుతుంది. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది కంపెనీ. ఈ సరికొత్త రియల్ మీ నార్జో 70 టర్బో ఫోన్ సూపర్ ఫీచర్లతో రాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే.. ఇది మీడియాటెక్ లేటెస్ట్ మిడ్ రేంజ్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టా కోర్ చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ యొక్క డైమెన్సిటీ చిప్ సెట్ 750K AnTuTu స్కోర్ ను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందని రియల్ మీ కంపెనీ తెలిపింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ 4nm ఫ్యాబ్రికేషన్ పై రన్ అవుతుంది. ఇది ఎఫిషియంట్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 7.6mm మందం మాత్రమే ఉంటుంది. కేవలం 185 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందట.
ఈ స్మార్ట్ ఫోన్ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇది 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB ఇంకా 12GB + 256GB వర్షన్ లో రానున్నట్లు తెలుస్తుంది. ర్యామ్ ని బట్టి ఈ స్మార్ట్ ఫోన్ ధరలు ఉంటాయట. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే..బ్యాక్ కెమెరా 50 మెగా పిక్సల్ ఉంటుంది. దీని ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సల్ లేదా 16 మెగా పిక్సల్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు రియల్ మీ కంపెనీ ప్రకటించింది. ఇక దీని ధరకి సంబంధించిన పూర్తి వివరాలని కంపెనీ అప్పుడు వెల్లడించనుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.