iDreamPost
android-app
ios-app

Realme Narzo 70 Turbo వచ్చేసింది.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు!

  • Published Sep 10, 2024 | 1:30 AM Updated Updated Sep 10, 2024 | 1:30 AM

Realme Narzo 70 Turbo: రియల్ మీ నుంచి నార్జో 70 టర్బో వచ్చేసింది. చవక ధరలో గేమింగ్ చిప్ సెట్ తో ఈ సరికొత్త ఫోన్ లాంచ్ అయ్యింది.

Realme Narzo 70 Turbo: రియల్ మీ నుంచి నార్జో 70 టర్బో వచ్చేసింది. చవక ధరలో గేమింగ్ చిప్ సెట్ తో ఈ సరికొత్త ఫోన్ లాంచ్ అయ్యింది.

Realme Narzo 70 Turbo వచ్చేసింది.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు!

ఎట్టకేలకు రియల్ మీ నుంచి నార్జో 70 టర్బో వచ్చేసింది. చాలా చవక ధరలో గేమింగ్ చిప్ సెట్ తో ఈ సరికొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. గతంలో ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి వచ్చిన ఫోటోలు మొబైల్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఊహించిన విధంగానే ఈ రియల్ మీ నార్జో 70 టర్బో అదిరిపోయే కొత్త కలర్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ ఫోన్ అందుబాటు ధరలోనే లాంచ్ అయ్యింది. ఇక రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ ఇంకా అలాగే ఫీచర్ల గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచెస్ ఓఎల్ఈడీ ఈ స్పోర్ట్స్ స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ వేగవంతమైన ప్రోసెసర్ డైమెన్సిటీ 7300 ఎనర్జీతో లాంచ్ అయ్యింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ 12GB ఫిజికల్ ర్యామ్ తో పాటు 14GB డైనమిక్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 256GB దాకా ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP AI మెయిన్ సెన్సార్ + 2MP పోర్ట్రైట్ సెన్సార్ తో కూడిన కెమెరా ఉంది. దీని ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 30 fps వద్ద 4K వీడియోలని మనం షూట్ చేయవచ్చు. ఫోటోలు చాలా క్లారిటీగా తీసుకోవచ్చని రియల్ మీ కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి వీలుగా పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టం ఫీచర్ కూడా ఉంది. ఇందులో GT మోడ్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్లో 90fps వద్ద గేమింగ్ ను ఎంజాయ్ చేయొచ్చు.

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. 6GB + 256GB వేరియంట్ రూ. 16,999 ధరతో లాంచ్ అయ్యింది. 8GB + 128GB వేరియంట్ రూ. 17,999 ధరతో, 12GB + 256GB వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంచ్ అయ్యింది. సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ కానుంది.ఈ ఫోన్ పై దివాళీ కూపన్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్ అన్ని వేరియంట్స్ పైన యూజర్లకు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో ఈ ఫోన్ ను ఇంకా తక్కువ ధరకే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ దీపావళీ పండుగ లోపు మాత్రమే ఉంటుంది.