iDreamPost
android-app
ios-app

క్రేజీ ఫీచర్లతో రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. క్రేజీ ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర ఎంతంటే?

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. క్రేజీ ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర ఎంతంటే?

క్రేజీ ఫీచర్లతో రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

స్మార్ట్ ఫోన్ లవర్స్ లేటెస్ట్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుంటాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఫోన్ కాస్త పాతబడినా, పర్ఫామెన్స్ స్లో అయినా కూడా వెంటనే మరో కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ తప్పినిసరి అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. మార్కెట్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చెందిన మొబైల్స్ తమ హవా కొనసాగిస్తున్నాయి. మరి కొత్త స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. త్వరలోనే భారత మార్కెట్ లోకి విడుదల కానుంది.

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ ఫోన్లకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. రియల్ మీ నుంచి వచ్చే మొబైల్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. ఈ క్రమంలో రియల్ మీ నుంచి రియల్‌మి జీటీ 6 టీ మార్కెట్ లోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5కె (1,264×2,780 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 6,000 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ ఈ ఫోన్‌ సొంతం. 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీ, 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో కూడా వస్తుంది.

Realmegt6t

ఈ స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 120 వాట్స్‌కు సపోర్ట్ చేసే ఫాస్ట్‌ ఛార్జర్‌ను అందించారు. 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ వెల్లడించింది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. రియల్‌మీ జీటీ 6టీ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 30,999కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 32,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 35,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 33,999గా ఉంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis