Realme News Budget Phone: మరో బడ్జెట్ ఫోన్‌ని లాంఛ్ చేసిన రియల్‌మీ..రేపటి నుంచే సేల్స్..

మరో బడ్జెట్ ఫోన్‌ని లాంఛ్ చేసిన రియల్‌మీ..రేపటి నుంచే సేల్స్..

Realme News Budget Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ కంపెనీ రియల్ మీ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. ఈ ధరను మీరు అస్సలు ఊహించలేరు. చాలా తక్కువ రేటుకే బెస్ట్ ఫీచర్స్ ని అందజేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ సపోర్ట్ అయితే మిగతా ఫోన్లతో పోలిస్తే ఇది చాలా బెటర్.

Realme News Budget Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ కంపెనీ రియల్ మీ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. ఈ ధరను మీరు అస్సలు ఊహించలేరు. చాలా తక్కువ రేటుకే బెస్ట్ ఫీచర్స్ ని అందజేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ సపోర్ట్ అయితే మిగతా ఫోన్లతో పోలిస్తే ఇది చాలా బెటర్.

దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారు సంస్థలు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లనే ఎక్కువగా తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉన్న కారణంగా కంపెనీలు కూడా వాటినే దింపుతున్నాయి. 10 వేల లోపు బడ్జెట్ లో ఎక్కువగా ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా రియల్ మీ కంపెనీ కూడా భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది. మన దేశంలో రియల్ మీ స్మార్ట్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బడ్జెట్ లో అధునాతన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను దించుతుంటుంది. తాజాగా రియల్ మీ సీ63 పేరుతో సరికొత్త ఫోన్ ని లాంఛ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ తో ఈ ఫోన్ ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది రియల్ మీ కంపెనీ. మరి ఈ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ధర ఎంత అనే వివరాలు మీ కోసం. 

స్పెసిఫికేషన్స్:

ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఇది 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆక్టాకోర్ యూనిసోక్ టీ 613 ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ని ఉంచారు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సెగ్మెంట్ లోనే ఫస్ట్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేసే ఫోన్ గా రియల్ మీ సీ 63 ఫోన్ నిలిచింది. రియల్ మీ ఫోన్ కి పోటీగా ఉన్న ఫోన్లు 18 వాట్, 15 వాట్ ఛార్జ్ సపోర్ట్ తోనే వస్తున్నాయి. ఇక ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒక నిమిషం ఛార్జింగ్ తో ఒక గంట పాటు కాల్ లో మాట్లాడుకోవచ్చు. 90 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అలానే దీని బ్యాక్ ప్యానెల్ ప్రీమియం లెదర్ తో వస్తుంది. దీని మీద కోకాకోలా, కాఫీ, పాలు వంటివి పడినా అంటుకోదు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇది 6.74 ఇంచెస్ హెచ్డీ+ స్క్రీన్ సైజులో వస్తుంది. మరకలకు రెసిస్టెన్స్ గా ఈ లెదర్ బ్యాక్ ప్యానెల్ ని డిజైన్ చేశారు. ఈ ఫోన్ జేడ్ గ్రీన్, లెదర్ బ్లూ కలర్స్ లో వస్తుంది. 

ఫస్ట్ సేల్ జూలై 3 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. ఈ ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ ని రూ. 8,999లకే విక్రయిస్తున్నారు. మొబిక్విక్ వాలెట్ ద్వారా వెయ్యి రూపాయల వరకూ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఆర్డర్ చేసిన 24 గంటల్లో షిప్పింగ్ చేస్తారు. యాడ్ ఆన్ ఆఫర్ కింద 899 రూపాయలకు వైర్ లెస్ 2 నియో రియల్ మీ బడ్స్ ని, అలానే 999 రూపాయలకు రియల్ మీ టీ 100 బడ్స్ ని దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ ని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈకామర్స్ వెబ్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. లేదా రియల్ మీ అధికారిక వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు. 

  • రియల్ మీ అధికారిక వెబ్ సైట్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Show comments