iDreamPost

మార్కెట్లోకి రియల్‌మి సరికొత్త ఇయర్ బడ్స్.. ధర, ఫీచర్స్ ఇవే!

realme Buds Air6 Pro: మార్కెట్లో అనేక రకాల ఇయర్ బడ్స్ వస్తున్నాయి. ఆయా కంపెనీలు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు సరికొత్త ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు ఇయర్ బడ్స్ ని లాంఛ్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా రియల్ మి కంపెనీ సరికొత్త ఇయర్ బడ్స్ ని లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది.

realme Buds Air6 Pro: మార్కెట్లో అనేక రకాల ఇయర్ బడ్స్ వస్తున్నాయి. ఆయా కంపెనీలు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు సరికొత్త ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు ఇయర్ బడ్స్ ని లాంఛ్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా రియల్ మి కంపెనీ సరికొత్త ఇయర్ బడ్స్ ని లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది.

మార్కెట్లోకి రియల్‌మి సరికొత్త ఇయర్ బడ్స్.. ధర, ఫీచర్స్ ఇవే!

రియల్ మి బ్రాండ్ కి దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. రియల్ మి నుంచి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయంటే చాలు ఆ క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది. తాజాగా రియల్ మి సరికొత్త ఇయర్ బడ్స్ ని తీసుకొస్తుండడంతో రియల్ మి లవర్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రియల్ మి కంపెనీ సరికొత్త ఇయర్ బడ్స్ ని భారతీయ మార్కెట్లో రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. రియల్ మి బడ్స్ ఎయిర్ 6 ప్రో పేరుతో సరికొత్త ఇయర్ బడ్స్ ని లాంఛ్ చేయనుంది. ఈ విషయాన్ని రియల్ మి కంపెనీ ఒక వీడియోని రిలీజ్ చేయడం ద్వారా వెల్లడించింది. రియల్ మి ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.  

స్పెసిఫికేషన్స్:

50 డీబీ స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అదనంగా 4000 హెడ్జెస్ అల్ట్రా వైడ్ బ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తుంది. 360 డిగ్రీస్ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ తో వస్తుంది. 55 ఎంఎస్ సూపర్ లో లెటెన్సీ టెక్నాలజీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వరకూ ప్లే బ్యాక్ వచ్చేలా దీని బ్యాటరీని రూపొందించారు. ఇది ఐపీ 55 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఎల్డ్యాక్ హైఫై ఆడియో కోడెక్ ఫీచర్ తో వస్తుంది. హై రిజల్యూషన్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ని కూడా పొందింది ఈ ఇయర్ బడ్స్ ప్రాడెక్ట్. రియల్ మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇంజనీర్డ్ ఫర్ ప్యూర్ సౌండ్ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనిలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది డ్యూయల్ డివైజ్ కనెక్షన్ ఫీచర్ తో వస్తుంది. అంటే ఒకేసారి రెండు ఇయర్ బడ్స్ ని రెండు డివైజ్ లకి కనెక్ట్ చేసుకోవచ్చు.

6 మైక్ ఈఎన్సీ, బ్లూటూత్ 5.3 ఫీచర్స్ తో వస్తుంది. రియల్ మి లింక్ యాప్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఇయర్ బడ్స్ ని యాప్ తో లింక్ చేసుకోవచ్చు. ఇది టైటానియం ట్విలైట్, సిల్వర్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. టైటానియం మెటల్ స్టైల్ సర్ఫేస్ తో వస్తుంది. హైఫై క్వాలిటీ డ్యూయల్ డ్రైవర్స్ తో వస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. 4,999 రూపాయలుగా దీని ధరను నిర్ణయించారు. అయితే ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద 300 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ద్వారా, అదనంగా మరో 500 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింది కంపెనీ. దీంతో 800 రూపాయల తగ్గింపుతో ఈ ఇయర్ బడ్స్ ని రూ. 4,199కే సొంతం చేసుకోవచ్చు. జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదటి సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ ని కొనుగోలు చేస్తే రెండు ఇయర్ బడ్స్, ఛార్జింగ్ కేస్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ కేబుల్, 4 ఇయర్ టిప్స్, యూజర్ గైడ్ వస్తాయి. 

  • ఈ ఇయర్ బడ్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి