iDreamPost
android-app
ios-app

Rajmargyatra: మీరు ఎక్కువగా జర్నీలు చేస్తుంటారా? అయితే మీ ఫోన్లో ఖచ్చితంగా ఈ యాప్ ఉండాల్సిందే!

  • Published Oct 15, 2024 | 3:19 PM Updated Updated Oct 15, 2024 | 3:19 PM

Rajmargyatra: ప్రభుత్వం కొత్త హైవే సూపర్ యాప్ ని ప్రవేశపెట్టింది. దాని పేరు రాజ్‌మార్గ్ యాత్ర (Rajmargyatra). దీన్ని National Highways Authority of India (NHAI) డిజైన్ చేసింది.

Rajmargyatra: ప్రభుత్వం కొత్త హైవే సూపర్ యాప్ ని ప్రవేశపెట్టింది. దాని పేరు రాజ్‌మార్గ్ యాత్ర (Rajmargyatra). దీన్ని National Highways Authority of India (NHAI) డిజైన్ చేసింది.

Rajmargyatra: మీరు ఎక్కువగా జర్నీలు చేస్తుంటారా? అయితే మీ ఫోన్లో ఖచ్చితంగా ఈ యాప్ ఉండాల్సిందే!

మనలో చాలా మంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ఉద్యోగ అవసరాలకు, తీర్ధ యాత్రలకు, నేషనల్ టూర్లకు ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు. అయితే జర్నీ చేసే సమయాల్లో ప్రయాణికులకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనకు తెలియని విషయాల గురించి దారిన పోయే వాళ్ళని అడుగుకుంటూ వెళ్ళే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక గూగుల్ మ్యాప్స్ లో అయితే అన్ని ఇన్ఫర్మేషన్స్ మనం తెలుసుకోలేము. సొ వీటి వల్ల కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. అయితే మన ప్రయాణాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభం చేసేందుకు ప్రభుత్వం కొత్త హైవే సూపర్ యాప్ ని ప్రవేశపెట్టింది. ఆ యాప్ పేరు రాజ్‌మార్గ్ యాత్ర (Rajmargyatra). ఈ యాప్‌ను స్వయంగా National Highways Authority of India (NHAI) డిజైన్ చేసింది. ఇంతకీ ఈ యాప్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ యాప్ ద్వారా మీరు హైవేకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు మరే ఇతర యాప్ లేదా ఏ సైట్‌ ఓపెన్ చేయాల్సిన పని లేదు. మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మీ జర్నీ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. పైగా ఈ యాప్ చాలా సేఫ్ కూడా. దీని వల్ల థర్డ్ పార్టీ యాప్ లు డౌన్లోడ్ చేసుకునే అవసరం కూడా ఉండదు. ఈ యాప్‌లో దగ్గరలోని టోల్ ప్లాజా, దారిలో ఉన్న టోల్ ప్లాజా, మనకు తెలియని నేషనల్ హైవేలు, పెట్రోల్ పంప్స్, హాస్పిటల్స్, హోటల్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ సూపర్ యాప్ సామాన్య ప్రయాణికుడికి ఉన్న అన్నీ అవసరాలను సులాభంగా తీర్చగలదు. హైవేపై ప్రయాణించేటప్పుడు ఈ యాప్ ఇలా ఎన్నో రకాల సౌకర్యాలను మనకు అందిస్తుంది.

ఇక ఈ యాప్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో మీరు హైవే మ్యాప్‌ని చూడవచ్చు, ఇందులో టోల్ ప్లాజా, సర్వీస్ స్టేషన్, హాస్పిటల్, హైవేపై ఉన్న పోలీస్ స్టేషన్.. ఇలా వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో మీరు ట్రాఫిక్ అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవచ్చు. ఈ సర్వీస్ హైవేపై ట్రాఫిక్ సిట్యుయేషన్ ఎలా ఉందో చూపిస్తుంది. దీనితో మీరు ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగానే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో వెధర్ అప్‌డేట్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎక్కడైనా జర్నీ చేసే ముందు వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దీంతో మీరు వాతావరణానికి అనుగుణంగా సేఫ్ గా జర్నీ చేయవచ్చు. అలాగే ఈ యాప్ లో హాట్ స్పాట్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా మీరు హైవేపై ఉన్న హాట్‌స్పాట్‌ల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంటే ఇందులో ఫేమస్ రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ మొదలైన వాటి గురించి ఫుల్ డీటైల్స్ ఉంటాయి. ఈ యాప్‌ని వాడటం వల్ల మీరు చాలా టైమ్ ని సేవ్ చేసుకోవచ్చు. మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశాలకు చాలా త్వరగా కంఫర్ట్ గా వెళ్ళవచ్చు. మీరు ఈ యాప్ ని Google Play Store, Apple App Store ప్లాట్‌ఫారమ్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి మన ప్రయాణాలకు ఇంతలా ఉపయోగపడే ఈ రాజ్ మార్గ్ యాత్ర యాప్ గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.