లుక్స్, ఫీచర్లేమో iPhone తరహాలో.. ధర మాత్రం రూ.15 వేలలోపే..

Budget 5G SmartPhone: భారత మార్కెట్ లోకి మరో కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోనే లాంఛ్ అయ్యింది. లుక్స్, ఫీచర్లు మాత్రం ఐఫోన్ తరహాలో ఉన్నాయి. కానీ, ధర మాత్రం కేవలం రూ.15 వేలలోపే ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Budget 5G SmartPhone: భారత మార్కెట్ లోకి మరో కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోనే లాంఛ్ అయ్యింది. లుక్స్, ఫీచర్లు మాత్రం ఐఫోన్ తరహాలో ఉన్నాయి. కానీ, ధర మాత్రం కేవలం రూ.15 వేలలోపే ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

స్మార్ట్ ఫోన్ కొనాలి అని ఎవరకి ఉండదు చెప్పండి. కానీ, ఎంత బడ్జెట్ కి? అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమే. బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ కొనాలి.. అందులోనూ 5జీ ఫోన్ కావాలి అని ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే అదిరిపోయే ఫీచర్లు, ఐఫోన్ తరహా లుక్స్ లో ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. అందులోనూ ఆ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.15 వేలలోపు కావడం వినియోగదారులను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఆ ఫోన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న అదిరిపోయే బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ అందిస్తోంది మోటరోలా కంపెనీ. గతంలో మోటరోలా నుంచి విడుదలైన జీ62కి కొనసాగింపుగా జీ64 మోడల్ ని మోటో కంపెనీ భారత్ మార్కెట్ లో విడుదల చేస్తోంది. ధర మాత్రం బడ్జెట్ రేంజ్ లోనే ఉంది. అంతేకాకుండా ఫీచర్స్ మాత్రం అదిరిపోతున్నాయి. ఇది ఆండ్రాయిడ్ 14తో వస్తోంది. పైగా ఇందులో ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. పైగా కలర్ ఆప్షన్స్ కూడా ఎంతో కూల్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ లుక్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది చూడటానికి అచ్చం ఐఫోన్ తరహాలోనే ఉంది.

మోటో జీ64 ధర విషయానికి వస్తే.. ఇందులో మొత్తం రెండు వేరియంట్లు ఉన్నాయి. 8జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. ప్రస్తుతానికి వీటిని ఇంట్రడక్షనరీ ప్రైసెస్ గా చెప్తున్నారు. అంటే విడుదల తర్వాత కొన్ని రోజులకు ఈ ధరలను మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.1000 డిస్కౌంట్ ని అందిస్తున్నారు. ఈ మోడల్ ఫోన్లు ఏప్రిల్ 23 నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వస్తాయి. మోటరోలా అధికారిక వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.

మోటో జీ64 ఫీచర్స్:

  • 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే విత్ ఐపీఎస్ ఎల్ సీడీ స్క్రీన్
  • 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియా టెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్
  • 50ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • ఐస్ లైలాక్, మింట్ గ్రీన్, పెర్ల్ బ్లూ కలర్ ఆప్షన్స్
Show comments