iDreamPost
android-app
ios-app

క్రేజీ డీల్: కేవలం రూ.5,669కే iPhoneలాంటి ఫోన్!

  • Published Dec 12, 2023 | 6:02 PM Updated Updated Dec 12, 2023 | 6:02 PM

iPhone Like Smart Phone Only For Rs.6,2229: స్మార్ట్ ఫోన్లకు ఇప్పుడు మార్కెట్లో ఉ్నన డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, ఈ అదిరిపోయే స్మార్ట్ ఫోన్ మాత్రం కేవలం రూ.6 వేలలోపే లభిస్తోంది.

iPhone Like Smart Phone Only For Rs.6,2229: స్మార్ట్ ఫోన్లకు ఇప్పుడు మార్కెట్లో ఉ్నన డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, ఈ అదిరిపోయే స్మార్ట్ ఫోన్ మాత్రం కేవలం రూ.6 వేలలోపే లభిస్తోంది.

  • Published Dec 12, 2023 | 6:02 PMUpdated Dec 12, 2023 | 6:02 PM
క్రేజీ డీల్: కేవలం రూ.5,669కే iPhoneలాంటి ఫోన్!

ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. ఫోన్ అంటే స్మార్ట్ అనే పరిస్థితికి వచ్చేశారు. ముఖ్యంగా భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే ఎన్నో కొత్త కొత్త కంపెనీలు భారత మార్కెట్ లో ఉన్న డిమాండ్ ని అందిపుచ్చుకుంటున్నాయి. మంచి మంచి స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కాస్త కష్టంగానే మారిపోయింది. కానీ, ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ అదిరిపోయే బడ్జెట్ రేంజ్ లో వచ్చేసింది. అది కూడా ఐఫోన్ లుక్స్ తో రావడం మరింత ఆసక్తి రేకిస్తోంది.

ఇన్ఫినిక్స్ కంపెనీ ఈ క్రేజీ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ మోడల్ బ్యాక్ డిజైన్ చూస్తే అచ్చం ఐఫోన్ ని తలపిస్తోంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్ డీ ఫోన్ గురించే మనం మాట్లాడుకుంటుంన్నాం. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో సంచలనంగా మారింది. అటు లుక్స్ తో మాత్రమే కాకుండా.. ఇటు ఫీచర్స్ తో కూడా ఔరా అనిపిస్తోంది. మరోవైపు ధర చూస్తే కేవలం రూ.6,229 మాత్రమే చెబుతున్నారు. ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే అన్ని రకాల సెన్సార్స్ ని అందుబాటులో ఉంచారు. పైగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఓఎస్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 13 గోతో ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్ డీ ఫోన్ వస్తోంది. 1.6 హెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ దీనిలో ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంది. 6.6 ఇంచెస్ హెచ్ డీ+ డిస్ ప్లేతో వస్తోంది. 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెట్జ్ టచ్ శాంపిలింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్ నెస్ తో ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్ డీ ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్లో డెడికేటెడ్ మెమొరీ స్లాట్ ఉండటం కూడా ఆకర్షించే అంశం. అంటే మీరు ఒకేసారి రెండు సిమ్స్, మెమొరీ కార్డుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఐఫోన్ తరహాలో ఉండటమే కాదు.. ఐఫోన్ మాదిరి మ్యాజిక్ రింగ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఏదైనా నోటిఫికేషన్, ఫోన్ అన్ లాక్ చేసినప్పుడు ఫ్రంట్ కెమెరా పక్కన ఐఫోన్ తరహాలో యానిమేషన్ వస్తుంది. ఇంక కెమెరా విషయానికి వస్తే.. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా+ ఏఐ లెన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 2జీ, 3జీ, 4జీ నెట్ వర్క్స్ ని సపోర్ట్ చేస్తుంది. కెమెరాలో ఫొటోలు తీసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ ధర కలిగిన ఫోన్లలో లాగా క్వాలిటీ కోరుకుంటే కష్టం.

ఛార్జింగ్ విషయంలో కాస్త నిరాశ చెందకుండా ఉండలేరు. ఎందుకంటే ఇది 10 వాట్స్ ఛార్జర్ తో వస్తోంది. అంటే మీకు ఫోన్ ఫుల్ ఛార్జ్ కావాలి అంటే కనీసం 3 గంటల సమయం పడుతుంది. కానీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి కనీసం రోజున్నర వరకు వాడుకోవచ్చు. ఫోన్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.6,229 కాగా బ్యాంకు ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ.5,669కే వస్తోంది. అయితే ఫోన్ ని బాగా యూజ్ చేసేవాళ్లు, ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్లకి ఈ స్మార్ట్ ఫోన్ అంత సెట్ కాదు. ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు ఏదైనా ఫోన్ కొనివ్వాలి అనుకుంటే ఇది మాత్రం బడ్జెట్ లో బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. మరి.. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్ డీ 8 స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే ఇది త్వరలోనే మార్కెట్ లోకి అందుబాటులోకి రాబోతోంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibombetcio girişiptv satın alCasibom