Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ మొబైల్ బ్రాండ్ వన్ ప్లస్ కస్టమర్లు డిస్ ప్లే గ్రీన్ లైన్స్ సమస్యను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత సదరు ఫోన్ల డిస్‌ప్లేలపై గ్రీన్ లైన్స్ దర్శనం ఇస్తున్నాయి. భారత్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన చాలా మంది ఫోన్లలో ఈ సమస్య తలెత్తుతూ ఉంది. దీంతో కస్టమర్లు వన్‌ప్లస్ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వన్ ప్లస్ సంస్థ డిస్‌ప్లే గ్రీన్ లైన్స్ సమస్యపై తాజాగా స్పందించింది. తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయటం ద్వారా గ్రీన్ లైన్స్ వచ్చిన డిస్‌ప్లేలను మార్చి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు! ఎలాంటి కాల పరిమితి లేకుండా జీవిత కాలంలో ఎప్పుడైనా గ్రీన్ లైన్స్ వచ్చిన డిస్‌ప్లేలను మార్చి ఇస్తామని తెలిపింది. డిస్‌ప్లే మార్పునకు సంబంధించి కొన్ని షరతులు కూడా విధించింది. ఆ షరతులకు లోబడి డిస్‌ప్లేలు గ్రీన్‌గా మారిన వాటికే ఆ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. డిస్‌ప్లేలు గ్రీన్‌గా మారిన వారు తమ ఫోన్‌ను దగ్గరిలోని వన్ ప్లస్ మొబైల్ షోరూంకు తీసుకెళ్లి స్క్రీన్ రీ ప్లేస్‌మెంట్ చేయించుకోవచ్చని వెల్లడించింది.
అయితే, కొన్ని వన్ ప్లస్ సిరీస్‌లలోని ఫోన్ మోడళ్ల డిస్‌ప్లేలు అందుబాటులో లేని కారణంగా కొత్త మొబైల్ కొనుగోలుకు సంబంధించి వారికి డిస్కౌంట్స్ ప్రకటించింది. వన్ ప్లస్ 8టీ నుంచి వన్ ప్లస్ 9 ఆర్ సిరీస్ మోడళ్లకు సంబంధించి డిస్‌ప్లేలు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ల డిస్‌ప్లేలు అందుబాటులో లేని కారణంగా కస్టమర్లకు ఓచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎక్సేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. ఈ ఎక్సేంజ్ బోనస్ ద్వారా కొత్త మొబైల్ కొనుగోలులో భారీ మొత్తంలో డిస్కౌంట్ ఇవ్వనుంది.
వన్ ప్లస్ 8టీకి 20వేల రూపాయల నుంచి వన్ ప్లస్ 8 ప్రో 25 వేల రూపాయల ఓచర్లు ఇస్తోంది. ఈ ఓచర్లు వాడుకుని కొత్త వన్ ప్లస్ ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ఈ ఓచర్లు కేవలం వన్ ప్లస్ ఫోన్లు కొనడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకాదు! ఓచర్లతో పాటు 10 ఆర్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఓచర్ వాల్యూతో పాటు 10ఆర్ బోనస్‌తో కలిపి పెద్ద మొత్తంలో డిస్కౌంట్ రానుంది. మరి, వన్ ప్లస్ సంస్థ తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.