iDreamPost
android-app
ios-app

100 వాట్ ఫాస్ట్ ఛార్జ్.. అదిరే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ ఫోన్.. ధర ఎంతంటే?

Oneplus Nord 4 Specifications, Features And Price Details: వన్ ప్లస్ కంపెనీ భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో.. ఏఐ ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తుంది. దీని ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేయండి.

Oneplus Nord 4 Specifications, Features And Price Details: వన్ ప్లస్ కంపెనీ భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో.. ఏఐ ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తుంది. దీని ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేయండి.

100 వాట్ ఫాస్ట్ ఛార్జ్.. అదిరే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ ఫోన్.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వన్ ప్లస్.. నార్డ్ సిరీస్ లో 4వ సిరీస్ ని పరిచయం చేసింది. వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ ని ఈ నెలలో లాంఛ్ చేయనుంది. గత ఏడాది వచ్చిన నార్డ్ 3కి కొనసాగింపుగా ఈ నార్డ్ 4 సిరీస్ ఫోన్ వస్తుంది. ఇది 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో, 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. కేవలం 28 నిమిషాల్లో 1 శాతం నుంచి 100 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఇందులో 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 సెన్సార్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ తో పాటు వన్ ప్లస్ ప్యాడ్ 2, వన్ ప్లస్ వాచ్ 2ఆర్, నార్డ్ బడ్స్ 3 ప్రో ఉత్పత్తులను కూడా లాంఛ్ చేయనుంది. 

ఇది స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్ తో, ఆండ్రాయిడ్ 14తో ఆక్సిజన్ 14.1 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. నాలుగేళ్ల పాటు సాఫ్ట్ వేర్, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ వెల్లడించింది. 6.74 అంగుళాల డిస్ప్లేతో, 1.5కే అమోలెడ్, 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 50 మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వస్తుంది. ఇది ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో సోనీ ఎల్వైటీఐఏ సెన్సార్ తో వస్తుంది. అలానే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ రేర్ కెమెరాతో వస్తుంది. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాతో 4కే వీడియోలు కూడా రికార్డు చేసుకోవచ్చు. ఏఐ టెక్స్ట్ ట్రాన్స్ లేట్,  ఏఐ ట్రాన్స్ స్క్రైబ్, ఏఐ నోట్, ఏఐ లింక్ బూస్ట్ వంటి ఏఐ ఫీచర్స్ తో ఈ వన్ ప్లస్ నార్డ్ 4 ఫోన్ ని రూపొందించారు.

వన్ ప్లస్ నార్డ్ 4 ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మొత్తం మూడు వేరియంట్లలో వస్తుంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. ఇక 8 జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ. 32,999గా ఉంది. 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ. 35,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్ తో బేస్ వేరియంట్ ని 27,999తో సొంతం చేసుకోవచ్చు. ఇది మొత్తం మూడు రంగుల్లో వస్తుంది. గ్రీన్, సిల్వర్, మిడ్ నైట్ షేడ్స్ కలర్స్ లో వస్తుంది. జూలై 20 నుంచి ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కణాలున్నాయి. వన్ ప్లస్ తో ఇతర రిటైల్ స్టోర్లలో అలానే అమెజాన్ లో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆగస్టు 2 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి. 

వన్ ప్లస్ ప్యాడ్ 2:

వన్ ప్లస్ ప్యాడ్ 2 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొదటి వేరియంట్ ధర రూ. 39,999 ఉండగా.. రెండవ వేరియంట్ ధర రూ. 42,999గా ఉంది. ఆగస్టు 1 నుంచి దీని సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే దీంతో పాటు వన్ ప్లస్ స్టైలో, వన్ ప్లస్ కీబోర్డు కావాలంటే సెపరేట్ గా కొనాల్సి ఉంటుంది. స్టైలో ధర రూ. 5,499 కాగా.. కీబోర్డు ధర రూ. 8,499గా ఉంది. ఇది 12.1 అంగుళాల 3కే రిజల్యూషన్ తో ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో.. 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వస్తుంది. 9510 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ తో వస్తుంది.

వన్ ప్లస్ వాచ్ 2ఆర్, నార్డ్ బడ్స్ 3 ప్రో:

వన్ ప్లస్ నార్డ్ 4, ప్యాడ్ 2తో పాటు వన్ ప్లస్ వాచ్ 2ఆర్, నార్డ్ బడ్స్ 3 ప్రో ఉత్పత్తులను కూడా లాంఛ్ చేయనుంది కంపెనీ. వన్ ప్లస్ వాచ్ 2 ఆర్ ధర రూ. 17,999 కాగా.. నార్డ్ బడ్స్ 3 ప్రో ధర రూ. 2,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది 49 డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. ఈ ఉత్పత్తులను జూలై 20 నుంచి వన్ ప్లస్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు.    

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి