iDreamPost
android-app
ios-app

వన్ ప్లస్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ఇంక లైఫ్ టైమ్ ఫ్రీ!

  • Published Aug 02, 2024 | 2:00 AM Updated Updated Aug 02, 2024 | 2:00 AM

Oneplus Announces Free Screen Upgrade For Selective Models: వన్ ప్లస్ తమ యూజర్లకు ఒక భారీ శుభవార్తను అందించింది. ఫ్రీగా మీరు వన్ ప్లస్ మోడల్ లో స్క్రీన్ ని అప్ గ్రేడ్ చేయించుకోవచ్చు. అలాగే క్లీనింగ్, మెయిన్టినెన్స్ కూడా ఫ్రీగానే పొందచ్చు.

Oneplus Announces Free Screen Upgrade For Selective Models: వన్ ప్లస్ తమ యూజర్లకు ఒక భారీ శుభవార్తను అందించింది. ఫ్రీగా మీరు వన్ ప్లస్ మోడల్ లో స్క్రీన్ ని అప్ గ్రేడ్ చేయించుకోవచ్చు. అలాగే క్లీనింగ్, మెయిన్టినెన్స్ కూడా ఫ్రీగానే పొందచ్చు.

  • Published Aug 02, 2024 | 2:00 AMUpdated Aug 02, 2024 | 2:00 AM
వన్ ప్లస్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ఇంక లైఫ్ టైమ్ ఫ్రీ!

వన్ ప్లస్.. ఇండియాలో ఈ బ్రాండ్ కు చాలానే గుర్తింపు, ఆదరణ ఉంది. ఈ ఫోన్ ని యాపిల్ ఐఫోన్ కు రీప్లేస్మెంట్ అంటూ కూడా చాలామంది భావించారు. దానికి తగిన విధంగానే వన్ ప్లస్ అమ్మకాలు కూడా బాగానే పెరిగాయి. కానీ, ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ గొడవ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచే వన్ ప్లస్ విషయంలో యూజర్స్ కాస్త విముఖత స్టార్ట్ చేశారు. కానీ, వన్ ప్లస్ వారిని బుజ్జగించేందుకు ఫ్రీగానే సర్వీస్ చేసి ఇస్తోంది. ఇప్పుడు ఆ సర్వీస్ ను లైఫ్ టైమ్ ఫ్రీ అంటూ ప్రకటించింది. అంటే మీరు వన్ ప్లస్ స్క్రీన్ ని మీరు ఫ్రీగానే మార్పించుకోవచ్చు. అయితే అది అందరూ యూజర్లకు కాదులెండి. కొన్ని మోడల్స్ కు మాత్రమే ఆ ఆఫర్ ను పరిమితం చేసింది.

వారికి మాత్రమే:

ఈ స్క్రీన్ అప్ గ్రేడ్ ఆఫర్ ను కొన్ని మోడల్స్ కు మాత్రమే పరిమితం చేసింది. అందరూ వన్ ప్లస్ యూజర్స్ అలా లైఫ్ టైమ్ ఫ్రీగా స్క్రీన్ అప్ గ్రేడ్ చేయించుకోలేరు. వన్ ప్లస్ 8 ప్రో, వన్ ప్లస్ 8టీ, వన్ ప్లస్ 9ఆర్, వన్ ప్లస్ 9 మోడల్స్ కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. స్క్రీన్ అప్ గ్రేడ్ మాత్రమే కాకుండా.. క్లీనింగ్, మెయింట్ నెన్స్ వంటి సేవలను కూడా పొందవచ్చు అని ప్రకటించారు. అప్ డేట్ చేసిన తర్వాత ఈ మోడల్స్ లో ఎలాంటి గ్రీన్, బ్లూ లైన్ వచ్చినా కూడా ఫ్రీగానే మీరు స్క్రీన్ ని అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ మోడల్స్ లో మాత్రమే ఈ లైన్స్ వస్తున్నట్లు చెబుతున్నారు. మరో మోడల్స్ లో గనుక ఇలాంటి సమస్య వస్తే ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ తీసుకొస్తారేమో చూడాలి.

ఎలా క్లయిమ్ చేసుకోవాలి?:

వన్ ప్లస్ ప్రకటించిన ఈ ఆఫర్ ని క్లయిమ్ చేసుకునేందుకు ఒక ప్రాసెస్ ఉంది. మీరు వన్ ప్లస్ యాప్ లోకి వెళ్లి.. రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్ షిప్ క్లబ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత బెనిఫిట్స్ లోకి వెళ్లి.. లైఫ్ టైమ్ ఫ్రీ స్క్రీన్ అప్ గ్రేడ్ అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత ఆఫర్ ని క్లయిమ్ చేసుకోండి. మీరు ఆఫర్ ని క్లయిమ్ చేసుకున్న తర్వాత దగ్గర్లోని వన్ ప్లస్ స్టోర్ లో స్క్రీన్ అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు క్లీనింగ్, మెయింటినెన్స్ కూడా చేయించుకోవచ్చు. మీరు వన్ ప్లస్ చెప్పిన మోడల్స్ వాడుతుంటే మాత్ర ఈ లైఫ్ టైమ్ ఫ్రీ ఆఫర్ ను క్లయిమ్ చేసుకోండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet