Dharani
యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి ఎన్పీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆ పని చేయకపోతే ఈ ఏడాది చివరి నాటికి అనగా డిసెంబర్ 31, 2023 నాటికి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఏం పని చేయవని తెలిపింది. ఆ వివరాలు..
యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి ఎన్పీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆ పని చేయకపోతే ఈ ఏడాది చివరి నాటికి అనగా డిసెంబర్ 31, 2023 నాటికి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఏం పని చేయవని తెలిపింది. ఆ వివరాలు..
Dharani
కరోనా తర్వాత చిన్నా చితకా మొదల లక్షల రూపాయల పేమెంట్స్ వరకు యూపీఐ యాప్ ల వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం చేతిలో డబ్బులు కారీ చేసే వాళ్ల సంఖ్య చాలా వరకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులను ప్రొత్సాహించడం కోసం అనేక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం రోడ్డు సైడ్ కొబ్బరి బొండాల బండి మొదలు బడా బడా మాల్స్ వరకు ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి వినియోగాన్ని పెంచడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లను సైతం ప్రకటిస్తున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ పెరిగిన తర్వాత ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉంచితే తాజాగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఆ పని చేయకపోతే డిసెంబర్ నుంచి అవి పని చేయవని తెలిపింది. ఈ మేరకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఏంలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
యూపీఐ చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి అనగా డిసెంబర్ 31, 2023 నాటికి వినియోగించని యూపీఐ ఐడీలను క్లోజ్ చేయాలంటూ ఎన్పీసీఐ.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఏం కంపెనీలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అనగా యాక్టీవ్ గా లేని యూపీఐ ఐడీలను క్లోజ్ చేయాలని సూచించింది.
కనుక మీరు మీ యూపీఐ ఐడీలను యాక్టీవ్ గా ఉంచాలంటే.. పేమెంట్ యాప్ ద్వారా కనీసం ఒక్క ట్రాన్సాక్షన్ అయినా చేసి.. మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ యాప్స్ ని తరచుగా వినియోగించే యూపీఐ యూజర్లు ఈ కొత్త నిబంధనలకు సంబంధించి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వారి యూపీఐ ఐడీలు క్లోజ్ చేయరు. ఇక ఇదే కాక పేమెంట్స్ కి సంబంధించి కూడా కొత్త నిబంధనలు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
కొత్త యూపీఐ యూజర్లు మొదటి సారి చేసే పేమెంట్స్ లిమిట్స్ కి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఫోన్ పే వినియోగదారుల సంఖ్య 500 మిలియన్లను దాటినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ప్రారంభించిన 7 ఏళ్లలోనే ఈ మైలురాయిని అధిగమించడం విశేషం అన్నది.