nagidream
BGMI With TeluguVoice Pack: బీజీఎంఐ గేమ్ లవర్స్ కి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్. ఇప్పుడు గేమ్ లో తెలుగు వాయిస్ ప్యాక్ అందుబాటులోకి వచ్చింది. అంటే మీరు ఇప్పుడు తెలుగులోనే గేమ్ ని వింటారు.. ఆడతారన్నమాట. నిజంగా తెలుగు డైలాగ్స్ తో గేమ్ ఆడుతుంటే మస్తు ఫీల్ వస్తుంది మామ అని అంటారు.
BGMI With TeluguVoice Pack: బీజీఎంఐ గేమ్ లవర్స్ కి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్. ఇప్పుడు గేమ్ లో తెలుగు వాయిస్ ప్యాక్ అందుబాటులోకి వచ్చింది. అంటే మీరు ఇప్పుడు తెలుగులోనే గేమ్ ని వింటారు.. ఆడతారన్నమాట. నిజంగా తెలుగు డైలాగ్స్ తో గేమ్ ఆడుతుంటే మస్తు ఫీల్ వస్తుంది మామ అని అంటారు.
nagidream
వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ లో ఉండే మాటలు స్థానిక భాషలో ఉంటే ఆ కిక్కే వేరు అని ప్రతి భాష వాళ్ళు అనుకుంటారు. ముఖ్యంగా తెలుగు మాట్లాడే మనకి అనిపిస్తుంది.. వీడియో గేమ్స్ లో సంభాషణలు తెలుగు భాషలో ఉంటే బాగుణ్ణు అని. అయితే ఇన్నాళ్లకు మన తెలుగోళ్ల కల నెరవేరింది. ఇన్నాళ్ల తర్వాత తెలుగు భాషకు గుర్తింపు అనేది వచ్చింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్ లో ఇప్పుడు తెలుగు వాయిస్ తో మాటలు వినిపిస్తాయి. అవును ఇప్పుడు బీజీఎంఐ తెలుగు వాయిస్ ప్యాక్ ని అప్ డేట్ చేసింది. ఇప్పటి వరకూ ఇంగ్లిష్, హిందీలో ఉన్న గేమ్ ఇప్పుడు దేశంలోని స్థానిక భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. బీజీఎంఐ ఇండియన్ బ్రాండ్ కాబట్టి.. దేశంలో అన్ని భాషలపై ఫోకస్ పెట్టారు.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సహా పలు భాషల్లో వాయిస్ ప్యాక్ లను అందుబాటులోకి తెచ్చారు. పేరున్న మూవీ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించి ఏ భాషకు ఆ భాషలో సంభాషణలను అప్ డేట్ చేశారు. డబ్బింగ్ సినిమాకి వాయిస్ చెప్పినట్టు ఉంటుంది ఈ గేమ్ లో వాయిస్. ఒక సినిమా చూస్తున్న కలుగుతుంది. సినిమాలో లీనమైన ఫీలింగ్ కలుగుతుంది. నేను లోపలకి వెళ్తున్నా, నేను నిన్ను కవర్ చేస్తాను, వెళ్దాం పదా, నేను వెనక చూసుకుంటాను, దూరంగా వెళ్ళు, నా దగ్గరకు రా, నన్ను కవర్ చెయ్, వంగో.. ఇలా గేమ్ లో క్యారెక్టర్ పలికే మాటలన్నీ ఇకపై తెలుగులోనే వస్తాయి.
నిజంగా బీజీఎంఐ గేమ్ ఆడుతూ తెలుగు మాటలు వింటుంటే నిజంగా మస్తు ఫీల్ ఉంది మావ అని అనిపిస్తుంది. పిచ్చ కిక్ వస్తుంది. మీరు కూడా బీజీఎంఐ లవర్స్ అయితే ఆ ఇంగ్లిష్ వాయిస్ ప్యాక్ ని పక్కన పడేసి వెంటనే తెలుగు వాయిస్ ప్యాక్ ని ఎంచుకోండి. థ్రిల్ ఫీలవుతారు. స్థానిక భాషలో గేమ్ ఆడితే ఆ మజానే వేరు కదా. మీరు లాంగ్వేజ్ ప్యాక్ ని తెలుగులోకి మార్చుకోవాలంటే తెలుగు వాయిస్ ప్యాక్ ని బీపీ కాయిన్స్ తో కొనుక్కోవచ్చు. లేదంటే క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది.