iDreamPost

నథింగ్ నుంచి మరో అద్భుత ఫోన్.. ఈ ఫీచర్స్‌ని మీరు అస్సలు గెస్ చేయలేరు!

Nothing CMF Phone 1: నథింగ్ ఫోన్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్రాండ్ నుంచి ఫోన్ వస్తుందంటే చాలు జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ రాబోతుంది. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ ని ప్రకటించింది కంపెనీ.

Nothing CMF Phone 1: నథింగ్ ఫోన్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్రాండ్ నుంచి ఫోన్ వస్తుందంటే చాలు జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ రాబోతుంది. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ ని ప్రకటించింది కంపెనీ.

నథింగ్ నుంచి మరో అద్భుత ఫోన్.. ఈ ఫీచర్స్‌ని మీరు అస్సలు గెస్ చేయలేరు!

నథింగ్ కంపెనీ నుంచి వస్తున్న సీఎంఎఫ్ ఫోన్ 1 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వారికి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సీఎంఎఫ్ ఫోన్ (1) ని జూలై 8న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ గా ఉన్న నథింగ్ ఫోన్ 2ఏతో పోలిస్తే మరింత చౌక ధరకు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. రిలీజ్ డేట్ ని అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది కంపెనీ. సీఎంఎఫ్ బై నథింగ్ ఖాతాలో దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఒక చిన్న వీడియోను షేర్ చేసింది. ‘సంఘటనల అద్భుతమైన మలుపు. బడ్స్ ప్రో 2, వాచ్ ప్రో 2.. ఈ రెండూ కొత్త సీఎంఎఫ్ ఫోన్ లో చేరాయి. జూలై 8న ఉదయం 10 గంటలకు (బ్రిటిష్ సమ్మర్ టైం) తర్వాత కమ్యూనిటీ అప్డేట్ వద్ద దీని గురించి ప్రతీది తెలుసుకుంటారు’ అంటూ ట్వీట్ చేసింది. ఇండియాలో జూలై 8న మధ్యాహ్నం 2.30 గంటలకు రిలీజ్ కానుంది.        

అలానే ఒక ఇమేజ్ కూడా బయటకు వచ్చింది. అందులో ఒక మినీ క్యాప్సూల్ ఉంది. అది అచ్చం నథింగ్ ఇయర్ స్టిక్ లానే ఉంది. ఇక ఆ ఇమేజ్ లో ఒక పేపర్ ముక్క ఉంది. దాని మీద ఫోన్ రిలీజ్ డేట్ ప్రింట్ చేసి ఉంది. బ్రాండ్ యొక్క ఆరెంజ్ థీమ్డ్ లెటరింగ్ తో ప్రింట్ చేసి ఉంది. ఇక ఆ క్యాప్సూల్ లో సీఎంఎఫ్ ఫోన్ 1 సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. అయితే ఈ ఎజెక్టర్ టూల్ 2 ఇన్ 1 టూల్ గా వస్తుంది. మినీ స్క్రూడ్రైవర్ గా ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారంటే ఓకే కానీ స్క్రూడ్రైవర్ ఎందుకు ఇచ్చినట్టు? అనే డౌట్ మీకు వస్తుంది కదూ.

స్క్రూడ్రైవర్ తో మీరు ఫోన్ బ్యాక్ ప్యానెల్ ని ఓపెన్ చేసుకునే ఆప్షన్ ని కంపెనీ ఇచ్చింది. ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాక్ ప్యానెల్ ఓపెన్ చేసుకునే ఫీచర్ ఉందంటే.. బ్యాటరీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బ్యాక్ ప్యానెల్ ఓపెన్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయన్నది ఫోన్ లాంఛ్ అయితేనే గానీ తెలియదు. ఇక ఈ ఫోన్ లో మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. సీఎంఎఫ్ బడ్స్ లా మ్యూజిక్ ని కంట్రోల్ చేయడానికి ఫోన్ అడుగు భాగంలో ఒక రొటేటింగ్ వీల్ కూడా ఇచ్చారు. చూస్తుంటే ఈ ఫోన్ ఒక గేమ్ ఛేంజర్ అయ్యేలా కనిపిస్తుంది.

అంచనా స్పెసిఫికేషన్స్:

ఇది 6.67 అంగుళాల సైజులో 120 హెట్జ్ ఓఎల్ఈడీ డిస్ల్పేతో వస్తుంది. డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది. అది కూడా 50 మెగా పిక్సెల్ కెమెరా అంట. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందట. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుందట. 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తున్నట్లు టెక్ నిపుణుల అంచనా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి