Dharani
ఒకప్పుడు ఫోన్ అంటే నోకియా గుర్తుకు వచ్చేది. స్మార్ట్ ఫోన్‌ల రాకతో నోకియా మార్కెట్ నుంచి దూరమయ్యింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా నోకియా 4జీ ఫీచర్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. దాని ధర, ఫీచర్ల వివరాలు మీ కోసం..
ఒకప్పుడు ఫోన్ అంటే నోకియా గుర్తుకు వచ్చేది. స్మార్ట్ ఫోన్‌ల రాకతో నోకియా మార్కెట్ నుంచి దూరమయ్యింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా నోకియా 4జీ ఫీచర్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. దాని ధర, ఫీచర్ల వివరాలు మీ కోసం..
Dharani
ఇప్పుడంటే అనేక రకాల స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ.. ఒకప్పుడు అది కూడా కీప్యాడ్ ఫోన్‌లు అందుబాటులో ఉన్న సమయంలో ఫోన్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది నోకియా. కనెక్టింగ్ ద పిపుల్ అంటూ వచ్చిన నోకియా ఫోన్‌లు అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయి. ఎవరి చేతిలో చూసినా ఇదే ఫోన్ కనిపించేది. అయితే స్మార్ట్ ఫోన్‌ల రాకతో.. క్రమంగా నోకియా ఫోన్ మార్కెట్ నుంచి కనుమరుగయ్యింది. కొత్త సాంకేతికతకు మారకపోవడం వల్లే నోకియాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని టెలికాం మార్కెట్ నిపుణులు చెబుతారు. అదలా ఉంచితే కొన్నాళ్ల క్రితమే నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాయి. స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఫీచర్ ఫోన్‌ను తిరిగి తీసుకురానుంది. తక్కువ ధరలోనే.. అద్భుతమైన ఫీచర్లతో నోకియా 4జీ ఫీచర్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఆ వివరాలు..
నోకియా కొత్త 4జీ ఫీచర్ ఫోన్ లాంఛ్ చేసింది. నోకియా 3210 4జీ పేరుతో ఈ డివైజ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇక దీని ధర 3,999 రూపాయలుగా ప్రకటించింది. ఇండియాలో ఇప్పటికే ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఫోన్ గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ, వై2కే గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. వీటిని నోకియా అధికారిక వెబ్‌సైట్, ఈకామర్స్ సైట్ అయిన అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ నోకియా 3210 4జీ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.3,999 గా నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఫోన్ అమ్మకాలు మొదలయ్యాయి. ఈ డివైజ్ గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ మరియు వై2కే గోల్డ్ కలర్‌లలో లభిస్తుంది. దీన్ని నోకియా అధికార వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
నోకియా 3210 4జీ ఫోన్‌లో యూట్యూబ్ సపోర్ట్ ఉంది. అలాగే ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి. ఇంకా క్లాసిక్ స్నేక్ గేమ్ కూడా ఉంది. నోకియా 3210 4జీ ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు.