iDreamPost
android-app
ios-app

Lawa Agni 3: మతిపోయే ఫీచర్లతో లావా నుంచి సరికొత్త 5జి ఫోన్ లాంచ్!

  • Published Oct 04, 2024 | 6:16 PM Updated Updated Oct 04, 2024 | 6:16 PM

Lawa Agni 3: తాజాగా లావా తన Agni 3 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లో సూపర్ ఫీచర్లు ఉన్నాయి.

Lawa Agni 3: తాజాగా లావా తన Agni 3 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లో సూపర్ ఫీచర్లు ఉన్నాయి.

Lawa Agni 3: మతిపోయే ఫీచర్లతో లావా నుంచి సరికొత్త 5జి ఫోన్ లాంచ్!

ఫీచర్ ఫోన్స్ లో లావా అంటే ఓ బ్రాండ్.. ఒకప్పుడు హాట్ కేకుల్లా ఈ ఫోన్స్ అమ్ముడుపోయేవి. దాంతో కంపెనీ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. కానీ మార్కెట్లో కొత్త కంపెనీల పోటీలు తట్టుకోలేక కాస్త వెనుకపడింది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కాబోతోంది. గత ఏడాది Agni 2 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి మంచి అమ్మకాలు జరుపుకుంది. ఇక లేటెస్ట్ గా ఆ ఫోన్‌కి అప్డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. తాజాగా లావా తన Agni 3 5G ఫోన్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లో ఎన్నో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. అది కూడా అందుబాటు ధరలోనే ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించి స్పెసిఫికేషన్స్, ధర ఇంకా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.

లావా అగ్ని 3 5జీ స్మార్ట్‌ఫోన్ లో అదిరిపోయే ఫీచర్ ఏంటంటే దీని డిస్ ప్లే. దీనికి 6.78 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ ప్యానెల్‌ ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ 120Hz ఉంటుంది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ కి డ్యూయల్ AMOLED డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇండియాలో ఇలాంటి డిస్ ప్లేలు ఉన్న ఫోన్ ఇప్పటిదాకా రాలేదు. ఇలాంటి స్పెసిఫికేషన్ ఉన్న ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్‌గా ఈ లావా అగ్ని 3 లాంచ్ అయ్యింది. దీంతో యూజర్లు ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. దీని బ్యాక్ సైడ్ అమోల్డ్ డిస్ ప్లే 1.74 ఇంచెస్ ఉంటుంది.ఇందులో యానిమేటెడ్ విడ్జెట్స్ ఫీచర్ ని చూడవచ్చు. ఈ ఫోన్ కి ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300x ప్రాసెసర్‌ను ఉంటుంది. ఇది ముందు, వెనుక ఉన్న రెండు డిస్ప్లే లకు సపోర్ట్ చేయడం హైలైట్ ఫీచర్ గా చెప్పవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో రన్ అవుతుంది. ఈ ఫోన్లో ఇంకో హైలైట్ ఏంటంటే.. దీని సేఫ్టీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీంతో ఈ ఫోన్ చాలా త్వరగా చార్జ్ అవ్వాడమే కాకుండా ఎక్కువ టైమ్ ఉంటుంది. సో అంతా త్వరగా మీ బ్యాటరీ లో అవ్వదు. ఇంకా దీని కెమెరా విషయానికొస్తే..బ్యాక్ సైడ్ OIS సపోర్ట్ తో 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ ఫోన్. ఇది ఐపీ64 రేటింగ్‌తో వచ్చింది.

ఇక దీని ప్రైజ్ విషయానికొస్తే.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైజ్ రూ. 20,999 ఉంటుంది. కాకుంటే దీనికి ఛార్జింగ్ అడాప్టర్ ఉండదు. అడాప్టర్ తో వచ్చే వేరియంట్ రూ. 22,999 ఉంటుంది. ఇక 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రైజ్ వచ్చేసి రూ.24,999 ఉంటుంది. ఈ ఫోన్ ప్రిస్టైన్ గ్లాస్, హీథర్ గ్లాస్ కలర్స్ లో వచ్చింది. దీని సేల్ అక్టోబర్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. దీనిపై భారీ ఆఫర్లు కూడా ఉన్నాయి. సేల్ ఆఫర్ కింద ప్రతి మోడల్‌పై ఏకంగా రూ.2000 డిస్కౌంట్ ఉంటుంది. ఛార్జింగ్ అడాప్టర్ లేకుండా రూ.1000 డిస్కౌంట్ ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ 18 వేల బడ్జెట్ లోనే వస్తుంది.