ఫ్లాగ్ షిప్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్.. మళ్లీ మళ్లీ రాదు!

Huge Discounts On Google Pixel 8: మీరు కొత్త ఫోన్ కొనాలి అనుకుంటున్నారు. అయితే ఒక ఫ్లాగ్ షిప్ ఫోన్ మీద క్రేజీ డీల్స్ అయితే ఉన్నాయి. ఐఫోన్ తరహా పర్ఫార్మెన్స్.. కానీ, ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి అంటే మాత్రం మీరు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.

Huge Discounts On Google Pixel 8: మీరు కొత్త ఫోన్ కొనాలి అనుకుంటున్నారు. అయితే ఒక ఫ్లాగ్ షిప్ ఫోన్ మీద క్రేజీ డీల్స్ అయితే ఉన్నాయి. ఐఫోన్ తరహా పర్ఫార్మెన్స్.. కానీ, ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి అంటే మాత్రం మీరు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.

గూగుల్ నుండి అనేక సర్వీసెస్ మనకి రోజు వారి జీవితంలో వస్తూనే ఉంటాయి. అలాగే గూగుల్ నుండిఫోన్స్ కూడా మంచి బూమ్ తీసుకుని వచ్చాయి, కాకపోతే ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అనేవి ఫీచర్స్ అన్ని బాగున్నపటికీ రేటు కొంచం ఎక్కువ ఉంటుంది అని అందరు అనుకుంటారు. ఇప్పుడు ఆ రేటు ని కొట్టి పడేస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 వేల రూపాయలు డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి రెడీ గా ఉంది గూగుల్ పిక్సెల్ 8 ఫోన్. దీనిపై ఉన్న భారీ డిస్కౌంట్ వివరాలు చూద్దాం.

ఈ పిక్సెల్ 8 అనేది గూగుల్ బ్రాండ్ లో ఫ్లాగ్షిప్ మొబైల్. ఇలాంటి ఫోన్ పై ఇంత భారీ ఆఫర్ అనేది గతంలో కూడా ఎప్పుడు లేదు. ఇక ముందు కూడా వస్తుందా అనేది చెప్పలేము. మాములుగా ఈ ప్రీమియం డివైజ్ స్టార్టింగ్ ధర రూ.75,999 నుంచి ఉంది. దానిని ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఇచ్చి రూ.63,999కి అమ్ముతున్నారు. ఇదే పెద్ద డిస్కౌంట్ అంటే ఇందులో మళ్ళీ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి అంటే మీలో ఎవరికైనా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇంకో రూ.8వేలు ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ ఫోన్ ఏకంగా రూ.55,999కి వచ్చేస్తుంది.

పిక్సెల్ 8 స్పెషిఫికేషన్స్:

గూగుల్ పిక్సెల్ 8 కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ని ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఫోన్. ఆపిల్ ఐఫోన్ 15ప్రో కాంపాక్ట్ పవర్‌ హౌస్ ఫోన్ కు ఈ ఫోన్ ఏ మాత్రం తీసిపోదు. కానీ, ఐఓఎస్ కన్నా ఆండ్రాయిడ్ ఇష్టపడే యూజర్లకు కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కింద ఈ ఫోన్ అద్భుతంగా సరిపోతుంది. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 2,000 నిట్స్ బ్రైట్నెస్, 6.2-అంగుళాల OLED స్క్రీన్, ప్రీమియం మెటల్, గ్లాస్ బిల్డ్, ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ ఉంది. టెన్సర్ జీ3 చిప్ వంటి రాకింగ్ టాప్-ఆఫ్-ది-లైన్ హార్డ్‌వేర్ కెమెరా సిస్టమ్ ని కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం టాప్ 3 బెస్ట్ కెమెరా ఫోన్‌లలో ఈ ఫోన్ కూడా ఉంది. అలాగే ఈ పిక్సెల్ 8 ఫోన్ కొనుగోలు చేయగల ఫోన్స్ లిస్టు లో టాప్ లో ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8 ఏఐ ఫీచర్ల గ్రూపుతో లోడ్ అవుతుంది.

అన్ని ఫోన్ల మాదిరిగానే నార్మల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కాకపోతే గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఫోన్ కొంచెం హీట్ అవుతుంది. అయినప్పటికీ, స్పీడ్, పర్ఫార్మెన్స్ విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యదు. ఆల్ ఇన్ ఆల్, స్టాక్ ఆండ్రాయిడ్ ప్రియులకు ఇది బెస్ట్ ఫోన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆండ్రాయిడ్లో ఇదొక తోపు ఫోన్ అని చెప్పొచ్చు. అయితే.. శాంసంగ్, ఆపిల్ మాదిరిగా గూగుల్ స్మార్ట్‌ ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను ఇవ్వడం లేదు. అవసరమైతే పాత ఛార్జర్‌ని కూడా వాడుకోవచ్చు, లేదంటే చార్జర్ ని కొనుక్కోవచ్చు. మరో విషయం ఏమిటంటే.. కేవలం 27డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే ఈ ఫోన్ సపోర్ట్ ఇస్తుంది. బహుశా ఇదొక రకమైన బిజినెస్ స్ట్రాటజీ కావొచ్చు. కాకపోతే వేరే బ్రాండెడ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ తో పోలిస్తే తక్కువ ధరకే వచ్చేస్తుంది. మరి ఈ ఆఫర్ అయిపోయేలోపే మీకు ఈ ఫోన్ అవసరం అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. అంతే కాని ఆఫర్ ఉంది కదా అని అవసరం లేకపోయినా కొనుక్కునే ప్రయత్నం చెయ్యకండి.

Show comments