Vinay Kola
Necro Trojan: నెక్రో ట్రోజన్ వైరస్ మొబైల్‌లోకి వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకరమైన వైరస్ తో మీ డేటా, బ్యాంకు వివరాలు అన్ని హ్యాక్ చేసేస్తారు. మీ బ్యాంకు అకౌంట్‌లోని డబ్బులన్నీ మాయం అయిపోతాయి.
Necro Trojan: నెక్రో ట్రోజన్ వైరస్ మొబైల్‌లోకి వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకరమైన వైరస్ తో మీ డేటా, బ్యాంకు వివరాలు అన్ని హ్యాక్ చేసేస్తారు. మీ బ్యాంకు అకౌంట్‌లోని డబ్బులన్నీ మాయం అయిపోతాయి.
Vinay Kola
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌ట్యాప్‌ల వాడకం పెరిగిపోయింది. ఎంతలా అంటే అవి లేకుంటే పనులే జరగవు అనేంతల పెరిగింది. ఇక ఫోన్లు అయితే ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చేశాయి. అయితే టెక్నాలజీ పెరిగాక హ్యాకర్లు కూడా పెరిగిపోతున్నారు. ఈక్రమంలో కొన్ని లింక్స్ వస్తాయి. వాటిని తెలీకుండా చాలా మంది క్లిక్ చేస్తారు. దాంతో అంతా మాయం. ఇలా చేయడం వల్ల మన డేటా హ్యాక్ అవుతుంది. ప్రస్తుతం నెక్రో ట్రోజన్ అనే వైరస్ వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. అన్‌అఫీషియల్‌గా ఉన్న యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేస్తే ఈ వైరస్ ఫోన్‌లోకి వస్తుంది. కొంతమంది ఫీచర్లు బాగున్నాయని గూగుల్ ప్లే స్టోర్ లేదా గూగుల్ నుంచి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఈ యాప్స్ చాలా డేంజర్. మన డేటాని యాక్సెస్ చేస్తాయి. ఇలాంటి యాప్ ల నుంచే ఈ నెక్రో ట్రోజన్ వైరస్ మొబైల్‌లోకి వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకరమైన వైరస్ తో మీకు తెలియకుండానే మీ డేటా, బ్యాంకు వివరాలు అన్ని హ్యాక్ చేసేస్తారు. దీంతో మీ బ్యాంకు అకౌంట్‌లోని డబ్బులన్నీ మాయం అయిపోతాయి. ఇక ఈ వైరస్ ని గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.
ఈ వైరస్ మీ ఫోన్‌లో కొన్ని అన్‌వాంటెడ్ యాడ్స్ ని చూపిస్తుంది. ముఖ్యంగా రెండు యాప్స్ ద్వారా ఈ వైరస్ ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్లలోకి వ్యాపిస్తుంది. అవే ‘వూటా కెమెరా’ (Vuta Camera), ‘మ్యాక్స్ బ్రౌజర్’ (Max Browser). ఒకవేళ మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే, కచ్చితంగా అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఎందుకంటే ఈ రెండు యాప్స్ నెక్రో ట్రోజన్ వైరస్‌ను చాలా ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నాయి. వూటా కెమెరా యాప్ ని చాలా మంది వాడుతున్నారు. దీన్ని ఇప్పటికే కోటి మందికి పైగా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ ఈ యాప్‌లోనే ప్రమాదకరమైన నెక్రో వైరస్ ఉంది. అలాగే మ్యాక్స్ బ్రౌజర్‌ను కూడా లక్ష మందికి పైగా వాడుతున్నారు. కాబట్టి ఈ యాప్స్ ఉంటే కచ్చితంగా డిలేట్ చెయ్యండి. అయితే ఈ వైరస్ ని గుర్తించి, వీటిని గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది.
ఇలాంటి యాప్స్ గూగుల్ ప్లేలో ఎన్నో వుంటాయి. వాటిని డౌన్ లోడ్ చేసే ముందు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలాంటి యాప్స్ ఎక్కువ యాడ్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని గుర్తించి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా తెలియని వ్యక్తులు పంపే యాప్స్ డౌన్‌లోడ్ చేయకూడదు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఫోన్‌లో ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. స్పాటిఫై ప్లస్, వాట్సాప్, మైన్‌క్రాఫ్ట్ లాంటి యాప్‌ల అన్అఫీషియల్ వెర్షన్లలో కూడా ఈ వైరస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ లో తప్ప వేరే ఏ ప్లాట్ ఫామ్ లలో డౌన్లోడ్ చేసుకోకూడదు. కాబట్టి మీ ఫోన్లో కూడా ఇలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలేట్ చెయ్యండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.