iDreamPost
android-app
ios-app

సోడా మేకర్ తో ఇంట్లోనే సోడా, డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

Mr. Butler Italia Soda Maker: సోడా కోసం షాపుల వద్దకు వెళ్తున్నారా? ఇక ఈ ఒక్క పరికరం ఉంటే చాలు మీ ఇంటి వద్దనే ఆరోగ్యకరమైన సోడా, జ్యూస్ ను తయారు చేసుకోవచ్చు. ధర ఎంతంటే?

Mr. Butler Italia Soda Maker: సోడా కోసం షాపుల వద్దకు వెళ్తున్నారా? ఇక ఈ ఒక్క పరికరం ఉంటే చాలు మీ ఇంటి వద్దనే ఆరోగ్యకరమైన సోడా, జ్యూస్ ను తయారు చేసుకోవచ్చు. ధర ఎంతంటే?

సోడా మేకర్ తో ఇంట్లోనే సోడా, డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

ప్రస్తుత రోజుల్లో కాలంతో సంబంధం లేకుండా జ్యూస్, సోడాలు తీసుకుంటున్నారు. కస్టమర్లకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే షాపుల్లో సోడాలు, జ్యూస్ ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు వాళ్లు వాడే వాటర్, ఫ్రూట్స్, ఇతర పదార్థాలు నాసిరకంగా ఉండొచ్చు. దీంతో ఆ జ్యూస్ లను తాగినప్పుడు అనారోగ్యాలకు గురవుతుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు ఇన్ స్టంట్ సోడా మేకర్ అందుబాటులో ఉంది. దీని సాయంతో ఇంట్లోనే మీకు కావాల్సిన జ్యూస్, సోడాలను రుచికరంగా, క్వాలిటీతో తయారు చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో సోడామేకర్ అందుబాటులో ఉంది.

ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు, లేదా ఇంటి వద్ద ఉన్నప్పుడు, ఆహారం జీర్ణం కానప్పుడు సోడాలను తాగుతుంటారు. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన సోడాలు ఉన్నప్పటికీ క్వాలిటీ ఉంటుందనే గ్యారంటీ ఇవ్వలేము. ఇలాంటి సమయాల్లో మనకు నచ్చిన సోడాను తయారు చేసుకుని తాగితే ఆ తృప్తి వేరేలా ఉంటుంది. ఇప్పటికే జ్యూస్ మేకర్స్, కాఫీ మేకర్స్ ఉండగా ఇన్ స్టంట్ సోడా మేకర్ కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో మిస్టర్ బట్లర్ కంపెనీకి చెందిన సోడామేకర్ పై 19 శాతం డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 5910గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 4770కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో 2000 తగ్గింపుతో దక్కించుకోవచ్చు.

మిస్టర్ బట్లర్ సోడమేకర్స్ ఒక బటన్‌ను నొక్కడం ద్వారా సోడా తయారు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫిజీ డ్రింక్స్‌ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్ పరికరం. తాజా పండ్లతో జ్యూస్ లను కూడా రెడీ చేసుకోవచ్చు. జ్యూస్, సోడాలను అధికంగా ఇష్టపడే వారికి ఈ పరికరం బెస్ట్ అంటున్నారు నిపుణులు. కార్జోనేటెడ్ పానియాలపై డబ్బు ఆదా చేసుకోవచ్చు. పర్యావరణ హితంగా ఉంటుంది. ఒక ప్యాక్ లో ఒక సోడామేకర్ యూనిట్, రెండు CO2 సిలిండర్‌లు ఉంటాయి. ఒక్కో సిలిండర్‌లో 25 లీటర్లు లేదా 125 గ్లాసుల సోడాను తయారు చేయగలవు. CO2 సిలిండర్ ఖాళీ అయిన తర్వాత మళ్లీ రిఫిల్ చేసుకోవచ్చు. ఈ సోడా మేకర్ తో ఆరోగ్యకరమైన శీతల పానియాలను తయారు చేసుకోవచ్చు. మరి మీరు మిస్టర్ బట్లర్ సోడా మేకర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి