iDreamPost

మెటా, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ.. వీటిలో ఏది బెస్ట్? ఎవరికి ఏది సూటవుతుంది

Meta, ChatGPT, Google Gemini AI: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. చాట్ జీపీటీ, మెటా ఏఐ, గూగుల్ జెమినీ ఏఐ చాట్ బాట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఏది బెస్ట్ ఏఐ యాప్? ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఎవరికి ఏ యాప్ ఎక్కువగా ఉపయోగపడుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Meta, ChatGPT, Google Gemini AI: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. చాట్ జీపీటీ, మెటా ఏఐ, గూగుల్ జెమినీ ఏఐ చాట్ బాట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఏది బెస్ట్ ఏఐ యాప్? ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఎవరికి ఏ యాప్ ఎక్కువగా ఉపయోగపడుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మెటా, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ.. వీటిలో ఏది బెస్ట్? ఎవరికి ఏది సూటవుతుంది

ఏఐ అంటే ఒక సెర్చ్ ఇంజిన్ లా పని చేస్తుంది. వికీపీడియాలా పని చేస్తుంది. ఒక వ్యక్తి గురించి లేదా చరిత్ర గురించి లేదా ప్రాడెక్ట్ గురించి ఇలా దేని గురించైనా సమాచారం ఇస్తుంది. అలానే మన ఇన్పుట్స్ కి తగ్గట్టు కొన్ని ఇమేజెస్ ని కూడా ఇస్తుంది. ఇంకా ఇమేజ్ లో ఉన్న కంటెంట్ ని ట్రాన్స్ లేట్ చేయడం, ఇమేజెస్ ని ఎడిట్ చేయడం, యానిమేట్ చేయడం, వివిధ టాస్కుల్లో మనకి హెల్ప్ చేయడం, ఆఫీస్ వర్క్, బిజినెస్ ఇలా అనేక చోట్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిలో ఏది బెస్ట్? ఏది ఎవరికి సూట్ అవుతుంది? ఏ యాప్ వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం.  

చాట్ జీపీటీ:

24/7 అందుబాటులో ఉంటుంది. ఏ సమయంలో అయినా చాట్ జీపీటీ సేవలను వాడుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ ప్రశ్నలను తీసుకుని సమాధానం ఇవ్వగలదు. కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్, సమాచారాన్ని రాబట్టడం వంటి విషయాల్లో ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. వేగంగా ఫలితాలను ఇస్తుంది. చదువుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో, లెక్కలు, సైన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కి ఇది సొల్యూషన్స్ ఇస్తుంది. అలానే భాషను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. వాక్యాలను వేరే భాషలోకి అనువదించడంలో సహాయపడుతుంది. క్రియేటివ్ గా కంటెంట్ రాయాలి లేదా కంటెంట్ జనరేట్ చేయాలి అనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కంటెంట్ క్రియేట్ చేయడంలో ఐడియాస్ ఇస్తుంది. బిజినెస్ లో కస్టమర్ సర్వీస్, సపోర్ట్ గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా పలు సూచనలు చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి సపోర్ట్ చేయడం, హెల్త్ కి సంబంధించిన సమాచారం ఇవ్వడం వంటివి చేస్తుంది. డైలీ జిమ్ చేయాలనుకుంటే ఎలా చేయాలి, ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలి అని అడిగితే కొన్ని సలహాలు ఇస్తుంది. ఏదైనా విషయాన్ని డీప్ గా రీసెర్చ్ చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇది అనేక భాషల్లో అందుబాటులో ఉంది. 

మెటా ఏఐ:

ఆర్టికల్స్, స్టోరీలు, ఈమెయిల్స్ వంటివి రాయడంలో సహాయపడుతుంది. జంతువులు, ముఖాలు, వస్తువుల ఇమేజ్ లను జనరేట్ చేస్తుంది. పలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల కోడ్ ని ఇది జనరేట్ చేస్తుంది. ఏ ప్రశ్నకైనా సమాధానం చెబుతుంది. ఒక భాష నుంచి వేరే భాషలోకి టెక్స్ట్ ని అనువాదం చేస్తుంది. ఎక్కువ కంటెంట్ ని క్రిస్పీగా చేస్తుంది. అలానే ఆర్టికల్స్, కథలు రాయడంలో ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్స్ లో ఐడియాస్ రావడంలో ఉపయోగపడుతుంది. కంటెంట్ ఆప్టిమైజేషన్ లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్ సహా అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. 

జెమినీ ఏఐ:

ఈ జెమినీ ఏఐ అనేది వికీపీడియాలా పని చేస్తుంది. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నా, చరిత్ర గురించిన సమాచారం ఇస్తుంది. గూగుల్ లో సెర్చ్ చేసినట్టే. కంటెంట్ రైటర్స్ కి అసిస్టెంట్ గా పని చేస్తుంది. పద్యాలు, స్క్రిప్ట్ వంటివి రాయడంలో ఇది సహాయపడుతుంది. ఇతర భాషల్లో ఉన్న కంటెంట్ ని అనువాదం చేస్తుంది. ఈమెయిల్స్ రాసేటప్పుడు పదబంధాలు, వివిధ స్వరాలను ఇది సూచిస్తుంది.

ఏది బెస్ట్? 

చాట్ జీపీటీలో కంటెంట్ రిలేటెడ్ అన్ని సమాధానాలు ఇస్తుంది. కానీ ఇమేజ్ లు జనరేట్ చేయడంలో మాత్రం సపోర్ట్ చేయదు. ఇమేజ్ అప్లోడ్ చేసి అందులో ఉన్న పర్సన్ గురించి అడిగినా సమాధానం చెప్పలేదు. 

మెటా ఏఐ, గూగుల్ జెమినీ ఏఐ మాత్రం ఇమేజెస్ ని జనరేట్ చేయడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ కింది చిత్రాలను చూస్తే మీకే తెలుస్తుంది. మెటా ఏఐలో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇందులో ఇమేజెస్ కి ఆటోమేటిక్ గా యానిమేషన్ ఇస్తుంది. ఇక ఒక లెక్కల ప్రాబ్లమ్ కి మెటా షార్ట్ ఆన్సర్ ఇవ్వగా.. గూగుల్ జెమినీ, చాట్ జీపీటీలు లెంతీ ఆన్సర్స్ ఇచ్చాయి.

ఎవరికి ఏది సూట్ అవుతుంది? 

ఈ మూడూ అందరికీ సూట్ అవుతాయి. అయితే చదువుకునేవారికి, హెల్త్ కాన్షియస్ కోరుకునేవారికి, బిజినెస్ డెవలప్మెంట్ వంటి వాటికి చాట్ జీపీటీ బెస్ట్. మెటా ఏఐ, గూగుల్ జెమినీ ఏఐలు చదువు, హెల్త్, బిజినెస్ వంటి వాటిలో మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. కానీ చాట్ జీపీటీతో పోలిస్తే వీటిలో ఫీచర్స్ తక్కువ. ప్రోగ్రామింగ్ కోడింగ్ విషయాల్లో చాట్ జీపీటీ బాగా సపోర్ట్ చేస్తుంది. అయితే ఇది ఎక్కువ సమాధానాలను చెప్పదు.  

వీడియో క్రియేటర్స్ కి ఇమేజ్ మీద కంటెంట్ క్రియేట్ చేసే వారికి లేదా వీడియోలో అక్కడక్కడా ఇమేజ్ లు వాడేవారికి మెటా ఏఐ, గూగుల్ జెమినీ ఏఐ రెండూ ఉత్తమమే. హెచ్డీ క్వాలిటీ పిక్స్ వస్తాయి. యూనిక్ గా ఉంటాయి. 

  • గూగుల్ జెమినీ ఏఐ వెబ్ యాప్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • మెటా ఏఐ వెబ్ యాప్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • చాట్ జీపీటీ వెబ్ యాప్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి