వాట్సాప్‌లో మీ లుక్ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు! హీరోలా, వీరుడిలా మార్చేసే ఫీచర్

Meta AI Introduced New Personalized Feature Imagine Yourself, Mark Zuckerberg Announced Through Video: ప్రతి ఒక్కరికీ హీరోలా కనిపించాలని ఉంటుంది. రాజుల కాలంలో రాజులా ఉండాలని ఉంటుంది. అయితే మిమ్మల్ని మీరు ఎలా కావాలంటే అలా ఊహించుకుని ఆ ప్రపంచంలో మీరు ఎలా ఉన్నారో మీ ముందు ఒక చిత్రాన్ని ఉంచే ఫీచర్ ని మార్క్ జుకర్ బర్గ్ పరిచయం చేశారు. వాట్సాప్ లోనే మీకు నచ్చిన చిత్రాన్ని జనరేట్ చేసుకోవచ్చు.

Meta AI Introduced New Personalized Feature Imagine Yourself, Mark Zuckerberg Announced Through Video: ప్రతి ఒక్కరికీ హీరోలా కనిపించాలని ఉంటుంది. రాజుల కాలంలో రాజులా ఉండాలని ఉంటుంది. అయితే మిమ్మల్ని మీరు ఎలా కావాలంటే అలా ఊహించుకుని ఆ ప్రపంచంలో మీరు ఎలా ఉన్నారో మీ ముందు ఒక చిత్రాన్ని ఉంచే ఫీచర్ ని మార్క్ జుకర్ బర్గ్ పరిచయం చేశారు. వాట్సాప్ లోనే మీకు నచ్చిన చిత్రాన్ని జనరేట్ చేసుకోవచ్చు.

చాలా మందికి హీరోల్లా స్టిల్స్ దిగాలని, హీరోల్లా ఫోటోలు తీసుకోవాలని అనుకుంటారు. హాలీవుడ్ సినిమాల్లో స్పైడర్ మ్యాన్ లా, సూపర్ మ్యాన్ లా, గ్లాడియేటర్ గెటప్స్ లో కనిపించాలని చాలా మందికి ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్ లా, కేజీఎఫ్ లో రాకీలా మారిపోవాలని అనుకుంటారు. వారు వేసుకున్న కాస్ట్యూమ్స్ ని కొనాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఆ వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ కూడా మిడిల్ క్లాస్ బడ్జెట్ లో సెట్ అవ్వదు. సరదాగా తమని తాము హీరోలుగా చూసుకోవాలని ఎంతోమందికి ఉంటుంది. ఫోటోషాప్ లో హీరోల బాడీకి తల యాడ్ చేసి పెట్టుకోవచ్చు. కానీ దాని కోసం సిస్టమ్ ఉండాలి. పైగా అంత పర్ఫెక్ట్ గా రాదు. శ్రమించాలి. సమయాన్ని కేటాయించాలి. అంత సమయం లేదు మిత్రమా? మెటా ఏఐనా? స్వీయ కష్టమా? అని మార్క్ జుకర్ బర్గ్ అంటున్నారు. కాబట్టి ఆయన చెప్పినట్టు చేస్తే ఆయనలా మీరు కూడా హీరోలా, వీరుడిలా ఎలా కావాలంటే అలా మారిపోవచ్చు. మీరు కాదు.. మీ ఫోటోలు. సరదాగా షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి.

ఇటీవలే మార్క్ మెటా ఏఐ సరికొత్త అప్డేట్ ని ప్రకటించారు. పలు ప్రదేశాల్లో, వేరే యుగాల్లో ఉన్నట్టు, వివిధ స్టైల్స్ లో ఫోటోలను పర్సనలైజ్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మీరు రాజుల కాలంలో ఉంటే మీరు ఎలా ఉంటారో అనేది ఈ మెటా ఏఐ ఫీచర్ ద్వారా ఒక చిత్రాన్ని పొందవచ్చు. ఇది మిమ్మల్ని చరిత్ర కాలంలోకి తీసుకెళ్తుంది. అంటే మీరు ఆ సమయంలో ఎలా ఉన్నారో ఒక ఇమేజ్ లో చూపిస్తుంది. ఇదే విషయాన్ని మార్క్ జుకర్ బర్గ్ ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఈ ఫీచర్ తో యూజర్లు తమని తాము ఊహించుకున్న విధంగా ఇమేజెస్ ని క్రియేట్ చేస్తుంది. గ్లాడియేటర్, బాయ్ బ్యాండ్ మీమర్ ఇలా. ఈ ఫీచర్ ని ఎలా వాడాలో మార్క్ జుకర్ బర్గ్ వీడియోలో వెల్లడించారు.

ముందు ఒక ఫోటో దిగారు. కెమెరా ఆన్ చేసి ముందు ముఖం చూపించి.. ఆ తర్వాత తలను అటూ, ఇటూ తిప్పి చూపించారు. తనను తాను గ్లాడియేటర్ గా ఊహించు అని వాట్సాప్ లో మెటా ఏఐని టెక్స్ట్ టైప్ చేసి అడిగారు. గ్లాడియేటర్ లుక్ లో మార్క్ ఫోటో వచ్చింది. ఆ తర్వాత బ్యాండ్ బాయ్ మీమర్ గా, పెద్ద గోల్డ్ చెయిన్ ధరించిన వ్యక్తిగా చూపించమని అడిగితే చూపించింది. అయితే ఈ ఏఐ చిత్రాలు చాలా స్పష్టంగా ఉండడం విశేషం. ఫోటోషాప్ లో డిజైన్ చేసుకున్నా ఇంత పర్ఫెక్ట్ గా రావేమో. ప్రొఫెషనల్స్ కి వస్తుంది. అది కూడా టైం పడుతుంది. కానీ ఈ మెటా ఏఐ ఫీచర్ తో నిమిషంలోనే ఊహించుకున్న విధంగా ఫోటోలు వస్తున్నాయి.  

ఈ మెటా ఏఐ ఫీచర్ ని వాడడం ఎలా?:

  • వాట్సాప్ లోకి వెళ్లి మెటా ఏఐ చాట్ విండోలోకి వెళ్ళాలి. 
  • ఇమేజిన్ మీ యాజ్ ఏ_________ (ఈ డ్యాష్ లో మీరు ఎలా కనబడాలనుకుంటున్నారో ఆ పదం టైప్ చేయాలి)       
  • ఆ తర్వాత మెటా ఏఐ మిమ్మల్ని మీ ఫోటోలను యాడ్ చేయమని అడుగుతుంది. 
  • ‘ఇమేజిన్ యువర్ సెల్ఫ్’.. ‘గెట్ స్టార్టెడ్’ అని ఒక మెసేజ్ పంపుతుంది. 
  • దాని మీద క్లిక్ చేసి ఫోటోలు దిగితే ఆ తర్వాత మీరు ఊహించుకున్నట్టు ఫోటోలు వస్తాయి. 
Show comments