iDreamPost

వాట్సాప్‌లోకి వచ్చేసిన AI.. ఇక మీరు మ్యాజిక్‌లు చేయచ్చు! ఎలా వాడాలంటే?

Meta AI In WhatsApp: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ డామినెన్స్ నడుస్తోంది. దీంతో పలు కంపెనీలు ఏఐ చాట్ బాట్స్ ని పరిచయం చేస్తున్నాయి. ఇటీవల యాపిల్ తన ఐఓఎస్ 18లో ఏఐ చాట్ బాట్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాట్సాప్ కూడా ఏఐ ఫీచర్ ని పరిచయం చేసింది. దీన్ని ఎలా వాడాలంటే?

Meta AI In WhatsApp: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ డామినెన్స్ నడుస్తోంది. దీంతో పలు కంపెనీలు ఏఐ చాట్ బాట్స్ ని పరిచయం చేస్తున్నాయి. ఇటీవల యాపిల్ తన ఐఓఎస్ 18లో ఏఐ చాట్ బాట్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాట్సాప్ కూడా ఏఐ ఫీచర్ ని పరిచయం చేసింది. దీన్ని ఎలా వాడాలంటే?

వాట్సాప్‌లోకి వచ్చేసిన AI.. ఇక మీరు మ్యాజిక్‌లు చేయచ్చు! ఎలా వాడాలంటే?

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఫ్యూచర్ అంతా ఏఐ మీద ఆధారపడి నడవనుండడంతో ప్రముఖ కంపెనీలన్నీ ఏఐ మీద ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే యాపిల్ ఐఓఎస్ 18లో ఏఐ ఫీచర్ ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. పలు స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు కూడా తమ ఫోన్లలో ఏఐ ఫీచర్ ని ఇన్ బిల్ట్ చేశాయి. యాపిల్ ఐఓఎస్ 18లో జెన్మోజీ అనే ఫీచర్ ని పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో యూజర్స్.. టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. తాజాగా వాట్సాప్ కూడా ఇలాంటి ఫీచర్ నే తీసుకొచ్చింది. వాట్సాప్ లో ఏఐ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది మెటా. యూజర్స్ అభిరుచికి తగ్గట్టు అనేక మార్పులు చేస్తూ సరికొత్త ఫీచర్స్ ని అందిస్తున్న మెటా తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం ఏఐ చాట్ బాట్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ చాట్ బాట్ ని యూజ్ చేసి ఏ సమాచారాన్ని అయినా పొందవచ్చు. మీరు ఏదైనా సమాచారం కోసం వెతకాలి అనుకుంటే గూగుల్ తల్లిని అడగాల్సిన పనిలేదు. జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి అడిగితే చాలు. ఉదాహరణకు ఇప్పటి వరకూ కల్కి కలెక్షన్స్ ఎంత వరకూ వచ్చాయి అని అడిగితే సమాచారం ఇస్తుంది. అలానే ఆ కలెక్షన్స్ కి సంబంధించిన వెబ్ సైట్ లింక్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ లానే పని చేస్తుంది. అయితే సినిమా పోస్టర్లు, హీరోయిన్ల పిక్స్ ని అడిగితే.. సారీ అలా అడగడం తప్పు కదా అని అంటుంది. ప్రస్తుతం అయితే ఇంగ్లిష్ లో అడిగితే కరెక్ట్ సమాచారాన్ని ఇస్తుంది. తెలుగులో అడిగితే తడబడుతుంది. ఇంకా ఇది డెవలపింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి పూర్తిగా సెట్ కాలేదు. 

వాట్సాప్ వెబ్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ మెటా ఏఐ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ కనిపించకపోతే కనుక మీ వాట్సాప్ యాప్ ని అప్డేట్ చేసుకోవాలి. వాట్సాప్ వెబ్ లో పై భాగంలో చాట్స్ కి కుడివైపున నీలం, పింక్ రంగుల్లో చిన్న సైజు గుండ్రని వృత్తం కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్రత్యేకంగా ఒక చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏ సమాచారాన్ని అయినా అడగవచ్చు. టెక్స్ట్ కంటెంట్ కి సంబంధించిన ఇన్పుట్స్ ఇస్తే టెక్స్ట్ అవుట్ పుట్స్ ఇస్తుంది. అలానే ఏదైనా మ్యాజికల్ ఇమేజ్ లు కావాలన్నా ఇస్తుంది. ఉదాహరణకు మీకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్సు వెళ్తున్న ఫోటో కావాలి అని ఇంగ్లిష్ లో అడిగితే ఆ ఇమేజ్ ని ఇస్తుంది. మీ ఊహల్లో ఏది ఉంటే దానికి తగ్గట్టు కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే మీకు కావాల్సిన ఇమేజ్ ని ఇస్తుంది. అయితే మెటా ఏఐకి సాధ్యమయ్యే చిత్రాలను మాత్రమే జనరేట్ చేస్తుంది. 

ఎక్కడ ఉంటుంది? ఎలా వాడాలంటే?:

  • వాట్సాప్ ఓపెన్ చేసి చాట్ లోకి వెళ్ళాలి. 
  • చాట్ ట్యాబ్ లో ఏఐ ఐకాన్ కనిపిస్తుంది. 
  • సర్వీస్ టర్మ్స్ ని చదివి యాక్సెప్ట్ చేయాలి. 
  • ప్రాంప్టుని సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ టైప్ చేయాలి. 
  • ఆ టెక్స్ట్ ని మీరు పంపుకోవచ్చ్. 
  • గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కి అందరికీ కనిపించేలా మెటా ఏఐ రెస్పాన్స్ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి