తప్పిపోయిన వారు తిరిగిరావడంలో సహాయపడే లాకెట్..

మనిషి జీవితంలో టెక్నాలజీ పోషిస్తున్న పాత్ర అంతా ఇంతా కాదు. టెక్నాలజీ మనిషి జీవితాన్ని నాశనం చేసింది అని అంటారు కానీ ఈ సృష్టిలో ఏదైనా మితంగా వాడితే అమృతంగానూ.. బానిసగా మారితే విషంగానూ మారుతుంది. లోపం మనిషి వాడకంలో ఉంది కానీ ఆయా వస్తువులు, సాంకేతికత వంటి వాటిలో లేదు. అయితే ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే మనిషి అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. టెక్నాలజీ సాయంతో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. అయితే ఇదే టెక్నాలజీతో మీ పిల్లలు, కుటుంబ సభ్యులు తప్పిపోకుండా చేయవచ్చునని మీకు తెలుసా? అవును ప్రాజెక్ట్ మీరు విన్నది నిజమే. టెక్నాలజీ మనిషి జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరిస్తోంది.

ముంబైకి చెందిన ప్రాజెక్ట్ చేతన పేరుతో ఓ వినూత్న టెక్నాలజీని రూపొందించారు. క్యూఆర్ కోడ్ కలిగిన లాకెట్ ని డిజైన్ చేశారు. క్యూఆర్ కోడ్ గురించి మనకి తెలిసిందే. చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అన్ని చోట్లా క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉంటున్నాయి. డిజిటల్ పేమెంట్స్ అన్నీ క్యూఆర్ కోడ్ ద్వారానే స్కాన్ చేసి చెల్లిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని.. ఒక లాకెట్ ని డిజైన్ చేశారు. ఈ లాకెట్ లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ లాకెట్ వేసుకున్న వారు ఎవరైనా పొరపాటున తప్పిపోతే కనుక.. లాకెట్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే వారి కుటుంబ సభ్యులకు చెందిన కాంటాక్ట్ వివరాలు వస్తాయి. దీంతో తప్పిపోయిన వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉంటుంది.

జ్ఞాపకశక్తి కోల్పోయిన దివ్యాంగులకు, పెద్ద వయసున్న వారికి, సీనియర్ సిటిజన్స్ కి కూడా ఈ క్యూఆర్ కోడ్ లాకెట్ బాగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు బయట వాకింగ్ వెళ్ళినప్పుడో లేదా ఇంకేదో కారణంగా బయటకు వెళ్ళినప్పుడో ఇంటి అడ్రస్ మర్చిపోతారు. అల్జీమర్స్, డీమెన్షియా, స్కిజోఫ్రీనియా వంటి మానసిక రోగాలతో బాధపడుతున్న వారికి, ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి వారికి ఈ క్యూఆర్ కోడ్ కలిగిన లాకెట్ వేస్తే.. వారిని చూసిన ఎవరైనా సరే దాన్ని స్కాన్ చేసి ఇంటికి తీసుకొస్తారు. మతిమరుపుతో బాధపడుతున్న వారికి, ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధులకు మందులు అత్యవసరమైన సందర్భంలో మెడలో ఉన్న లాకెట్ ద్వారా సులువుగా తమ కుటుంబ సభ్యులను కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది. ఫోన్ లో కాంటాక్ట్ నంబర్ తీసుకుని చేయడం గుర్తులేని వారికి ఈ క్యూఆర్ కోడ్ లాకెట్ బాగా ఉపయోగపడుతుంది. లాకెట్ ని స్కాన్ చేయడం ద్వారా వారి కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి.

ఎవరైనా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే.. లాకెట్ ధరించిన వారి పేరు, ఇంటి అడ్రస్, బ్లడ్ గ్రూప్, కాంటాక్ట్ డీటెయిల్స్ వంటివి ప్రాథమిక ఆధారాలను చూపిస్తుంది. ఆ ఆధారాలతో వారిని వారి ఇంటికి చేర్చడం లేదా వారి కుటుంబ సభ్యులకు కాల్ చేసి రమ్మని చెప్పడం చేయవచ్చు. చాలా మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ఈ క్యూఆర్ కోడ్ కలిగిన లాకెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్దవారికే కాదు.. చిన్న పిల్లలకు కూడా ఈ క్యూఆర్ కోడ్ కలిగిన లాకెట్ ని వేయవచ్చు. పిల్లలకు ఈ లాకెట్ గురించి వివరిస్తే.. వారికి ఉపయోగంగా ఉంటుంది.

ఎప్పుడైనా దారి తప్పితే.. ఎవరికైనా తమ మెడలో ఉన్న లాకెట్ చూపించి స్కాన్ చేయమని పిల్లలు చెప్తే.. తల్లిదండ్రుల వివరాలు తెలుస్తాయి. దీంతో వారు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించవచ్చు. స్కూల్ కి ఒంటరిగా వెళ్లే పిల్లలకు కూడా ఈ లాకెట్ బాగా ఉపయోగపడుతుంది. స్కూల్ పిల్లల భద్రత కోసం ఈ లాకెట్ ని వారి మెడలో వేయవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ లాకెట్లు దేశవ్యాప్తంగా ప్రతీ చోటా దొరుకుతున్నాయి. ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ లాకెట్లు కస్టమర్ ఛాయిస్ ని బట్టి డిజైన్ చేస్తారు. కస్టమర్ వివరాల ఆధారంగా లాకెట్ ని తయారు చేస్తారు. ఈ క్యూఆర్ కోడ్ లాకెట్ ని అక్షయ్ రిడ్లాన్ అనే 24 ఏళ్ల డేటా ఇంజనీర్ డెవలప్ చేశారు. ఈ లాకెట్లు.. కుటుంబ సభ్యుల ఇబ్బందులను, సమస్యలను తొలగించాలన్న ఉద్దేశంతో తయారు చేశారు. మరి క్యూఆర్ కోడ్ లాకెట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments