iDreamPost
android-app
ios-app

దేశ వ్యాప్తంగా Jio సేవలకు అంతరాయం..యూజర్ల ఆగ్రహం!

  • Published Sep 17, 2024 | 3:08 PM Updated Updated Sep 17, 2024 | 3:08 PM

Jio faces Network Outage: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవల 5 జీ సేవలను దేశమంతటా విస్తరించే పనిలో ముందుకు సాగుతుంది. ఇటీవల జియో సేవలు అకస్మాత్తుగా నిలిచిపోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

Jio faces Network Outage: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవల 5 జీ సేవలను దేశమంతటా విస్తరించే పనిలో ముందుకు సాగుతుంది. ఇటీవల జియో సేవలు అకస్మాత్తుగా నిలిచిపోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా Jio సేవలకు అంతరాయం..యూజర్ల ఆగ్రహం!

ప్రపంచంలోని అత్యుత్తమ డిజిటల్ సాంకేతికతలతో ప్రారంభించబడిన జియో సేవలు దేశమంతటా శరవేగంగా విస్తురిస్తున్నాయి. ఒక రకంగా జియో భారతదేశం అంతటా డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. జియో దేశంలో అతి పెద్ద ఆపరేటర్, ప్రపంచంలోనే 2వ అతి పెద్ద సింగిల్ – కంట్రీ ఆపరేటర్, ఫైబర, మొబైల్, యాప్స్, వ్యాపార పరిష్కారాల వంటి సేవలు అందిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో కస్టమర్లు నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో జియో సేవలు మళ్లీ ఆగిపోయాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా మంగళవారం రిలయన్స్ జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జియో యూజర్లు సోషల్ మీడియా వేదికగా సర్వీస్ పనిచేయడం లేదని పోస్టులు చేయడం మొదలు పెట్టారు. చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. దీంతో #jiodown హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండ్ అవుతుంది. జియో కొన్ని గంటల పాటు నెట్ వర్క్ ఇష్యూని ఎదుర్కొంటుందని,ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్, స్నాప్ చాట్, యూట్యూబ్, గుగుల్ తో పాటు ఇతర అప్లికేషన్ లను యాక్సెస్ చేయలేకపోయామని యూజర్లు వాపోయారు. ట్రాకింగ్ వెబ్ సైట్స్ ‘డౌన్ డిటెక్టర్’ సైదం మధ్యాహ్నం జియో సేవలు పనిచేయడం లేదని గుర్తించింది.

డౌన్ డిటెక్టర్ ప్రకారం.. మంగళవారం (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం 12:18 గంటల నాటికి జియో వినియోదారుల నుంచి 10,367 నెట్ వర్క్ ఇబ్బందులకు సంబంధించిన నివేదికలు ఉన్నాయని.. ఉదయం 11:13 గంటలతో పోల్చితే ఇవి ఎక్కువే అని తెలిపింది. అయితే వీటిలో 68 శాతం నివేదికలు ‘నో సిగ్నల్’ కు సంబంధించినవి కాగా.. 18 శాతం మొబైల్ ఇంటర్నెట్ కి సంబంధించినవి, 14 శాతం జియో ఫైబర్ కి సంబంధించినవి ఉన్నాయని తెలిపింది. కాకపోతే ఇతర నెట్ వర్క్ సంస్థలు ఎయిర్ టేల్, వొడా ఫోన్ (ఐడియా), బీఎస్ఎన్ఎల్ యథావిధిగా పనిచేస్తున్నట్లు డౌన్ డిటెక్టర్ డేటా తెలియజేసింది.ఈ సమస్య దేశ రాజధాని ఢిల్లీ, లక్నో, ముంబై వంటి నగరాల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపించినట్లు సమాచారం.