iDreamPost
android-app
ios-app

Cow Dung: ఆవు పేడతో రాకెట్ ప్రయోగం! సరికొత్త ఆవిష్కరణ

  • Published Dec 19, 2023 | 9:45 PM Updated Updated Dec 19, 2023 | 9:45 PM

ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో ఓ విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. ఆవుపేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతగా ప్రయోగించారు సైంటిస్టులు.

ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో ఓ విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. ఆవుపేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతగా ప్రయోగించారు సైంటిస్టులు.

Cow Dung: ఆవు పేడతో రాకెట్ ప్రయోగం! సరికొత్త ఆవిష్కరణ

సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. మానవాళిని అబ్బురపరిచే ఎన్నో నూతన ఆవిష్కరణలను ప్రపంచ దేశాల సైంటిస్టులు సృష్టిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ ఆవిష్కరణ ప్రపంచం మెుత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతరిక్షయానంలో దేశాలు పోటీపడి మరి ప్రయోగాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జపాన్ దేశ ఇంజనీర్లు ఆవు పేడతో అద్భుతం సృష్టించారు. ఆవుపేడతో నడిచే స్పేస్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో ఓ విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. ఆవుపేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతగా ప్రయోగించారు జపాన్ ఇంజినీర్లు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటుగా, ఉద్గారాలను తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జపాన్ కు చెందిన స్పేస్ స్టార్టప్ ఇంటర్ స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ అయిన హక్కైడో స్పేస్ పోర్ట్ ద్వారా ఆవుపేడతో నడిచే స్పేస్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు. ఆవుపేడ నుంచి ఉత్పత్తి అయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ కు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఈ రాకెట్ ప్రయోగం స్పేస్ పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది. సాధారణంగా పరిశోధించే రాకెట్లతో పోల్చితే.. ఇలాంటి ప్రయోగానికి ఖర్చు తక్కువ, పైగా పొల్యుషన్ కూడా ఉండదు. మరి ఆవుపేడతో జపాన్ ఇంజినీర్లు సృష్టించిన ఈ అద్భుత ప్రయోగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.