iDreamPost
android-app
ios-app

Space Station: అంతరిక్షంలో ప్రత్యేక స్పేస్ స్టేషన్.. వెల్లడించిన ఇస్రో ఛైర్మన్!

Space Station: అంతరిక్షంలో ప్రత్యేక స్పేస్ స్టేషన్.. వెల్లడించిన ఇస్రో ఛైర్మన్!

ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధించి చూపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ను దించి ఆ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు సక్సెస్ అయ్యాక ఇస్రో సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పినట్లు అయింది. ఇక్కడితో సంతృప్తి పడితే ఎలా? ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అదే విషయాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు, ఇస్రో చేపట్టనున్న మిషన్లకు సంబంధించి ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రయాన్ 3 సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇస్రో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. గగన్ యాన్ మొదలు అంతరిక్షంలో భారత్ కు సొంతంగా స్పేస్ స్టేషన్ వరకు ఇస్రో చేపట్టనున్న మిషన్ల గురించి ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్ విజయం తర్వాత ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. ప్రత్యేక స్పేస్ స్టేషన్ అనేది దేశ అంరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. సైన్స్ తో ఎలాంటి ప్రయోగాలు చేయగలమో అధ్యయనం చేస్తున్నాం. చంద్రయాన్ తర్వాత ఇస్రో గగన్ యాన్ మీద దృష్టి పెట్టాం. అలాగే దీర్ఘకాలం ప్రయాణించే సామర్థ్యం కలిగిన స్పేస్ ఫ్లైట్ ను రూపొందించే ప్రణాళిక కూడా అజెండాలో ఉంది.

స్పేస్ ఫ్లైట్ ని రూపొందించగలిగితే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఆ ఘనత సాధించిన దేశంగా భారత్ నిలుస్తుంది” అంటూ సోమనాథ్ వ్యాఖ్యానించారు. గగన్ యాన్ ద్వారా ఆస్ట్రోనాట్స్ ని అంతరిక్షానికి పంపి అక్కడ స్పేస్ స్టేషన్ నిర్మించే యోచనలో ఇస్రో ఉంది. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక రచిస్తున్నారు. రోబోటిక్ ఆపరేషన్ ద్వారా ఆ ప్రక్రియను ప్రారంభిస్తారు. అంతంకంటే ముందు మనకు మానవసహిత నౌక సామర్థ్యం భారత్ కు లేదు. ఆ విషయంపై ముందుగా దృష్టి సారించినట్లు వివరించారు. అందుకు గగన్ యాన్ మిషన్ ఎంతో తోడ్పడుతుంది. అదే సాధ్యమైతే ఒక 25 ఏళ్లలో అంతరిక్షంలో భారత్ కంటూ ఒక ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఉంటుంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో ప్రపంచం మొత్తం మరోసారి భారత్ వైపు చూసింది.

అంత తక్కువ ఖర్చుతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపడంపై ఇస్రో సత్తా చూసి యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. జులై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3.. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపింది. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ విజయంవంతంగా పరిశోధనలు చేశాయి. రెండు వారాలపాటు విజయవంతంగా పరిశోధనలు చేసి ప్రస్తుతం స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. చంద్రయాన్ 3 విజయం.. ఇస్రో చేపట్టనున్న భవిష్యత్ ప్రణాళికలపై కూడా అంచనాలను పెంచేసింది. సమీప భవిష్యత్ లో ఇస్రో తప్పకుండా భారత్ కంటూ ఒక ప్రత్యేక స్పేస్ స్టేషన్ ను నిర్మించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో భవిష్యత్ ప్రణాళికలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.