iDreamPost
android-app
ios-app

iQOO: మార్కెట్లోకి వచ్చేసిన iQOO Z9s, Z9s ప్రో స్మార్ట్ ఫోన్స్! ఫీచర్స్ అదుర్స్!

  • Published Aug 22, 2024 | 3:15 AM Updated Updated Aug 22, 2024 | 7:10 AM

iQOO: iQOO తన iQOO Z9s సిరీస్ లో స్మార్ట్ ఫోన్లని నేడు రిలీజ్ చేసింది. iQOO Z9s, Z9s ప్రో మంచి ఫీచర్లతో నేడు విడుదల అయ్యాయి.

iQOO: iQOO తన iQOO Z9s సిరీస్ లో స్మార్ట్ ఫోన్లని నేడు రిలీజ్ చేసింది. iQOO Z9s, Z9s ప్రో మంచి ఫీచర్లతో నేడు విడుదల అయ్యాయి.

iQOO: మార్కెట్లోకి వచ్చేసిన iQOO Z9s, Z9s ప్రో స్మార్ట్ ఫోన్స్! ఫీచర్స్ అదుర్స్!

iQOO తన iQOO Z9s సిరీస్ లో స్మార్ట్ ఫోన్లని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఒకటి iQOO Z9s కాగా ఇంకోటి iQOO Z9s Pro. ఈ స్మార్ట్ ఫోన్లలో కస్టమర్లని ఆకట్టుకునే విధంగా సూపర్ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తుంది. మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి ఈ స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పవచ్చు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 120Hz 3D Curved AMOLED స్క్రీన్ తో వస్తాయి. అలాగే ఇవి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటాయి. అలాగే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా వెనుక ఆరా రింగ్ లైట్ తో వస్తాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ డిజైన్ విషయంలో మాత్రం కొంత తేడా ఉంటుంది. Z9s ప్రో వెర్షన్ ప్రీమియం వేగాన్ లెథర్ డిజైన్ కలిగి ఉంటుంది. దీని వెనుక కెమెరా కూడా సరికొత్త డిజైన్ తో ఉంటుంది. Z9s కి మాత్రం ఈ డిజైన్ ఉండదు.

ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కి ఉన్న చిప్ సెట్ విషయానికి వస్తే, Z9s ప్రో స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 తో పని చేస్తుంది.ఇక Z9s స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ విషయానికి వస్తే.. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్లు చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫోన్ లను చాలా తిన్ గా డిజైన్ చేశారు. కేవలం 7.49mm మందంతో చాలా నాజూకైన డిజైన్ తో ఎంతో స్టైలిష్ గా ఈ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా 5500 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటాయి. అలాగే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.

ఈ ఫోన్ల కెమెరా విషయానికి వస్తే.. ఇవి 50MP Sony IMX882 కెమెరాలని కలిగి ఉంటాయి. Z9s ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. Z9s ప్రో ఫోన్ అయితే ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇది 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ లను కలిగి ఉంటుంది. దీంతో ఫొటోస్, వీడియోలని చాలా క్లారిటీగా తీసుకోవచ్చు. ఇక Z9s 2MP డెప్త్ సెన్సార్‌ కలిగి ఉంటుంది. దీంతో 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు. ఈ ఫోన్ లలో AI కెమెరా ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14తో ఫన్ టచ్ OS 14లో రన్ అవుతాయి. iQoo Z9s 8GB+128GB, 8GB+256GB మరియు 12GB+256GB వేరియంట్లలో వస్తుంది. దీని ధరలు వేరియంట్ల వారీగా వరుసగా రూ.19,999, రూ.21,999 మరియు రూ.23,999 ఉన్నాయి. iQoo Z9s ప్రో కూడా మూడు వెర్షన్లలో వస్తుంది. 8GB+128GB ధర రూ. 24,999 అయితే 8GB+256GB ధర రూ.26,999 మరియు 12GB+256GB ధర రూ.28,999 ఉంటుంది.