iDreamPost
android-app
ios-app

Infinix: అదిరే కెమెరాతో ఇన్ఫినిక్స్ నుంచి లాంచ్ కాబోతోన్న మరో స్మార్ట్ ఫోన్!

  • Published Sep 14, 2024 | 3:00 AM Updated Updated Sep 14, 2024 | 3:00 AM

Infinix: ఇన్ఫినిక్స్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ Infinix Zero 40 5G మార్కెట్లో అడుగుపెడుతోంది.

Infinix: ఇన్ఫినిక్స్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ Infinix Zero 40 5G మార్కెట్లో అడుగుపెడుతోంది.

Infinix: అదిరే కెమెరాతో ఇన్ఫినిక్స్ నుంచి లాంచ్ కాబోతోన్న మరో స్మార్ట్ ఫోన్!

ఇన్ఫినిక్స్ నుండి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. రీసెంట్ గా 10 వేల బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తో కూడిన హాట్ 50 5జి స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ విడుదల చేసింది. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అడుగుపెడుతోంది. దాని పేరు Infinix Zero 40 5G స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ను కూడా బడ్జెట్ ధరలోనే లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సూపర్ డిజైన్ ఇంకా కర్వుడ్ స్క్రీన్ తో కంపెనీ లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ 7.9 mm మందం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. కేవలం 196 గ్రాముల బరువుతో ఈ ఫోన్ చాలా లైట్ గా ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో అందించిన కెమెరా సిస్టం చాల బాగుంటుందని ఇన్ఫినిక్స్ కంపెనీ తెలుపుతుంది. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 108MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ మరియు బొకే సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉంటాయట. చీకట్లో కూడా చాలా క్లారిటీగా ఫోటోలు, వీడియోలను షూట్ చేయడానికి వీలుగా ఫ్లాష్ లైట్, జూమ్ ఫ్లాష్ లైట్ లు ఉనాయి. ఈ ఫోన్ కెమెరాతో 60FPS తో 4K వీడియోలని కూడా చాలా క్లారిటీగా షూట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ కెమెరా AI సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో AI ఎరేజర్, AI సెర్చ్, AI కట్ అవుట్ వంటి మరిన్ని AI ఫీచర్స్ కూడా ఉనాయి.

ఈ స్మార్ట్ ఫోన్ 4K Ultra HD GoPro తో కూడా పని చేస్తుందని ఇన్ఫినిక్స్ కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 6.74 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ అమోల్డ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ దాకా ర్యాం, 512 జీబీ దాకా ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ కెపాసిటీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కాబోతుంది. ఈ ఫోన్ ధరకి సంబంధించిన పూర్తి వివరాలు సెప్టెంబర్ 18న తెలియనున్నాయి.

jojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet güncel giriş