iDreamPost
android-app
ios-app

బడ్జెట్ ధరకే Infinix Hot 50 స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

  • Published Sep 03, 2024 | 6:30 AM Updated Updated Sep 03, 2024 | 7:17 AM

Infinix Hot 50: ఇన్ఫీనిక్స్ తాజా స్మార్ట్ ఫోన్ ఇన్ఫీనిక్స్ హాట్ 50 లాంచ్ డేట్ ని కన్ఫామ్ చేసింది. ఇది అతి సన్నని ఫోన్ అని కంపెనీ వెల్లడించింది.

Infinix Hot 50: ఇన్ఫీనిక్స్ తాజా స్మార్ట్ ఫోన్ ఇన్ఫీనిక్స్ హాట్ 50 లాంచ్ డేట్ ని కన్ఫామ్ చేసింది. ఇది అతి సన్నని ఫోన్ అని కంపెనీ వెల్లడించింది.

బడ్జెట్ ధరకే Infinix Hot 50 స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

ఇన్ఫీనిక్స్ తన తాజా స్మార్ట్ ఫోన్ ఇన్ఫీనిక్స్ హాట్ 50 లాంచ్ డేట్ ని కన్ఫామ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 5న రానున్నట్లు తెలిపింది కంపెనీ. ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే.. కంపెనీ ఈ ఫోన్ ని చాలా స్లిమ్ గా డిజైన్ చేసింది. ఇది ఇండియాలోనే అతి సన్నని ఫోన్ అని కంపెనీ వెల్లడించింది. ఇటీవల కంపెనీ ఈ ఫోన్ టీజర్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ ఫోన్ ప్రేక్షకాదరణ పొందుతుందని కంపెనీ భావిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇన్ఫీనిక్స్ హాట్ 50 స్మార్ట్ ఫోన్ బాడీ 7.8 మీ.మీ. థిక్నెస్ తో డిజైన్ చేయబడింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ కెమెరా మోడ్యూల్ ను రెగ్యులర్ గా కాకుండా డిఫెరెంట్ స్క్వేర్ షేప్ లో కంపెనీ డిజైన్ చేసింది. ఇది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా అంతేకాదు, ఈ ఫోన్ కెమెరాకి డ్యూయల్ ఫ్లాష్ ను కూడా సపోర్ట్ గా అందించింది కంపెనీ. ఈ ఫోన్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లే తో రాబోతుంది. అది 1600X720 రిజొల్యూషన్ తో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ఇంకా 4 జీబీ ర్యామ్ లతో రానుంది. MT6835V మీడియా టెక్ చిప్ సెట్ 6100+ SoC డైమెన్సిటీతో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానుంది.

ఇంకా ఈ ఫోన్ విషయానికి వస్తే.. ఇందులో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని తెలుస్తుంది. ఇది నీరు మరియు దుమ్ము, ధూళిని తట్టుకునేలా చేయడానికి IP54 సర్టిఫికేషన్‌తో రానుంది. ఈ ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫోన్ ధర బడ్జెట్ లోనే ఉంటుందని తెలుస్తుంది. దీని ధర 10 వేల లోపే ఉంటుందని సమాచారం. కానీ దీని అధికారిక ధర ఇంకా పూర్తి వివరాలు మాత్రం లాంచ్ అయ్యాకే వెల్లడి కానున్నాయి. మరి చూడాలి ఈ స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో.. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.