iDreamPost
android-app
ios-app

Infinix Hot 50: కేవలం 10 వేలలో సూపర్ ఫోన్ ని లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్!

  • Published Sep 06, 2024 | 12:30 AM Updated Updated Sep 06, 2024 | 12:30 AM

Infinix Hot 50 5G: ఇన్ఫినిక్స్ తన తాజా స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 50 ని సెప్టెంబర్ 5న లాంచ్ చేసింది. కేవలం 10 వేలలోపే లాంచ్ చేసింది.

Infinix Hot 50 5G: ఇన్ఫినిక్స్ తన తాజా స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 50 ని సెప్టెంబర్ 5న లాంచ్ చేసింది. కేవలం 10 వేలలోపే లాంచ్ చేసింది.

Infinix Hot 50: కేవలం 10 వేలలో సూపర్ ఫోన్ ని లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్!

ఇన్ఫినిక్స్ కంపెనీ తన తాజా స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 50 ని సెప్టెంబర్ 5న లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే.. కంపెనీ ఈ ఫోన్ ని చాలా స్లిమ్ గా డిజైన్ చేసింది. ఇది ఇండియాలోనే అతి సన్నని ఫోన్ అని కంపెనీ వెల్లడించింది. ఇటీవల కంపెనీ ఈ ఫోన్ టీజర్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కచ్చితంగా ఈ ఫోన్ ప్రేక్షకాదరణ పొందుతుందని కంపెనీ భావిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ ఇంకా పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇన్ఫీనిక్స్ హాట్ 50 స్మార్ట్ ఫోన్ బాడీ 7.8 మీ.మీ. థిక్నెస్ తో డిజైన్ చేయబడింది. ఈ ఫోన్ లో వెనుక AI డ్యూయెల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 48MP (Sony IMX582) బ్యాక్ కెమెరా ఇంకా డెప్త్ సెన్సార్ ఉంటాయి. ఇక ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ కెమెరా మోడ్యూల్ ను రెగ్యులర్ గా కాకుండా డిఫెరెంట్ స్క్వేర్ షేప్ లో కంపెనీ డిజైన్ చేసింది. ఇది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా అంతేకాదు, ఈ ఫోన్ కెమెరాకి డ్యూయల్ ఫ్లాష్ ను కూడా సపోర్ట్ గా అందించింది కంపెనీ. ఈ ఫోన్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచెస్ HD+ స్క్రీన్ తో ఈ ఫోన్ వస్తుంది. స్క్రీన్ 1600X720 రిజొల్యూషన్ తో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ ఫాస్ట్ చిప్ సెట్ డైమెన్సిటీ 6300 తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ + 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇంకా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS పై XOS 14.5 సాఫ్ట్ వేర్ తో వర్క్ చేస్తుంది.ఈ సరి కొత్త ఫోన్ కు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ ఐయింది. ఇది Infinix AI ఫీచర్ తో కూడా వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (4GB + 128GB) ను కేవలం రూ. 9,999 ధరతో లాంచ్ చేసింది కంపెనీ. హై ఎండ్ వేరియంట్ (8GB + 128GB) ను కేవలం రూ. 10,999 ధరతో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఫ్లిప్కార్ట్ నుంచి మొదలవుతుంది. ఈ ఫోన్ పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఇక ఈ తాజా స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.