రూ.10 వేలలోపే.. 256జీబీ స్టోరేజ్- 50MP కెమెరా!

Best Budget SmartPhone: స్మార్ట్ ఫోన్ అంటే వేలకి వేలు పెట్టాల్సి వస్తోంది. కానీ, ఈ ఫోన్ మాత్రం అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ధర మాత్రం రూ.10 వేలలోపే ఉంది.

Best Budget SmartPhone: స్మార్ట్ ఫోన్ అంటే వేలకి వేలు పెట్టాల్సి వస్తోంది. కానీ, ఈ ఫోన్ మాత్రం అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ధర మాత్రం రూ.10 వేలలోపే ఉంది.

స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయాయి. అయితే ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ అనగానే కచ్చితంగా వేలల్లో ధరలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫీచర్లు కలిగిన ఫోన్ కొనాలి అంటే కనీసం రూ.15 వేలు వరకు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ, ఇప్పుడు మార్కెట్ లోకి ఒక అదిరిపోయే స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అది కూడా కేవలం రూ.10 వేలలోపు ధరలోనే అంటే నమ్ముతారా? ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి సూపర్ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వింటే షాకవ్వాల్సిందే. పైగా లుక్స్ కూడా చాలా కూల్ గా ఉన్నాయి.

ఈ ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి ఇప్పటికే మార్కెట్ లో చాలానే మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ కంపెనీ ఒక అదిరిపోయే ఫీచర్స్ తో ఒక స్మార్ట్ ఫోన్ ని తీసుకొస్తోంది. కాకపోతే ఇది 5జీ ఫోన్ కాదండోయ్.. 4జీ స్మార్ట్ ఫోనే. బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకునే వారికి మాత్రం ఇది సూపర్ సెలక్షన్ అనే చెప్పాలి. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒకటి 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఉంది. దీని ధర రూ.8,999గా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 6.5 ఇంచెస్ హచ్ డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేతో వస్తోంది. 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ పీక్ బ్రైట్ నెస్ 480 నిట్స్ గా ఉంటుంది. అంటే ఎండలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం లేకపోలేదు. ఇది ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై రన్ అవుతుంది. దీనిలో మీకు వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు 8 జీబీ ర్యామ్ వస్తుంది. దానిని మీరు 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. అయితే ఈ ఫోన్ అనే కాదు.. ఏ ఫోన్ అయినా వర్చువల్ ర్యామ్ వల్ల పెద్దగా ఉపయోగాలు ఉండవని టెక్ నిపుణులు చెబుతూ ఉంటారు. దీనిలో ఉన్న కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో 50 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉంటుంది. రింగ్ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఫ్రంట్ చూస్తే 32 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్ బ్యాక్ సైడ్ రెండు రౌండ్ కెమెరాలు ఉన్నాయి. దానికి పక్కనే రౌండ్ ఫ్లాష్ లైట్ ఉంటుంది. దూరం నుంచి చూస్తే లుక్స్ అచ్చం ఐఫోన్ తరహాలోనే ఉన్నాయి. అన్ని వేలు పెట్టి ఐఫోన్ కొనలేని వాళ్లకి ఇది బడ్జెట్ ఐఫోన్ అని చెప్పచ్చు. పైగా ఇందులో కూడా ఐఫోన్ డైనమిక్ ఐల్యాండ్ తరహా ఫీచర్ కూడా ఉంది. అలాగే హారిజన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్ ఫాల్ గ్రీన్, స్టార్ లైట్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 21 నుంచి సేల్ కి రాబోతోంది. ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. మరి.. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments