Dharani
ఈ ఏడాది అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ కంపెనీ సగం ధరకే ఏసీ అంటూ బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
ఈ ఏడాది అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ కంపెనీ సగం ధరకే ఏసీ అంటూ బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
Dharani
ఇంకా ఫిబ్రవరి నెల అయిపోలేదు.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలం అంటే.. మార్చి ఆఖరులో అన్నట్లుగా ఉండేది. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా.. కాలాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితం వర్షాభావం, కరువు, ముందే ఎండాకాలం ప్రారంభం కావడం మాత్రమే కాక.. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దానిలో భాగంగా.. ఈ ఏడాది ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. ఈ వేడి నుంచి కాపాడుకోవాలంటే కూలర్లు, ఫ్యాన్లు సరిపోవు.. ఏసీ కొనుక్కుంటే బెటర్. ఈ క్రమంలో ఓ ఏసీ కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. సగం ధరకే ఏసీ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..
ఏసీలు, వాటర్ ప్యూరిఫైయర్లు విక్రయించే ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ బ్లూస్టార్ తమ కంపెనీ ఏసీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. బ్లూస్టార్ 1.5టన్ 3 స్టార్ వై-ఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీపై ఈ బంపరాఫర్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ తర్వాత చాలా తక్కువ ధరకే ఈ ఏసీ లభిస్తుంది.
అంతేకాక తగ్గింపు ధరతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్ కింద, బ్లూస్టార్.. 1.5టన్ ఏసీ ఎంఆర్పీ ధరపై 42 శాతం తగ్గింపును ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులు ఈ ఏసీని రూ.64,250కి బదులుగా రూ. 36,990కి కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు అదనంగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 2,000వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.4,900వరకు మరో డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది త్రీస్టార్ రేటెడ్ మోడల్ ఏసీ. దీనికి ఇన్వర్టర్ కంప్రెసర్ కూడా ఉంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగదు. కరెంట్ కూడా ఆదా అవుతుంది. అలాగే బ్లూస్టార్ 1.5 టన్ త్రిస్టార్ ఏసీలో వైఫై సపోర్టు కూడా ఉంది. అలానే ఇది 111 చదరపు అడుగుల నుంచి 150 చదరపు అడుగుల వరకు కూలింగ్ స్ప్రెడ్ చేస్తుంది. ఈ ఏసీలో వాయిస్ కమాండ్‌తో పాటు డస్ట్ ఫిల్టర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
ఇదేకాక 2023 మోడల్ ఏసీని తక్కువ ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. చాలా బ్యాంకులు ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఒక్కసారి చెల్లించే బదులు ప్రతినెలా కొద్ది మొత్తం చెల్లిస్తే చాలు.