nagidream
How To Transfer Photos, Videos From Google Photos To iCloud Photos: ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ కి మారిన తర్వాత ఐక్లౌడ్ లో ఫోటోలు బ్యాకప్ పెట్టుకుంటారు. అయితే అప్పటికే పాత ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న ఫోటోలు గూగుల్ ఫోటోస్ లో బ్యాకప్ అయి ఉంటాయి. వాటిని ఐక్లౌడ్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. అయితే ఒకేఒక్క క్లిక్ తో ఇప్పుడు గూగుల్ ఫోటోస్ లో ఉన్న డేటాను ఐక్లౌడ్ ఫోటోస్ లోకి దిగుమతి చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియోలు అన్నీ గూగుల్ ఫోటోస్ యాప్ లో స్టోర్ అవుతాయి. ఎన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ని మార్చినా గానీ జీమెయిల్ ఐడీతో లాగిన్ అయితే గూగుల్ ఫోటోలు, వీడియోలు చూసుకోవచ్చు. అయితే కొత్తగా యాపిల్ ఫోన్ కి షిఫ్ట్ అయితే కనుక గూగుల్ ఫోటోస్ లో స్టోర్ అయిన ఫోటోలను ఐక్లౌడ్ లో చూడడం అనేది కుదరదు. దాని కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలను ఐఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఐక్లౌడ్ లోకి అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ఇదంతా పెద్ద ప్రక్రియ. అయితే గూగుల్ టేకవుట్ అప్గ్రేడ్ తో యాపిల్ యూజర్లు ఇప్పుడు సులువుగా గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలను, వీడియోలను ఐక్లౌడ్ లోకి ఫోటోస్ లోకి ట్రాన్స్ఫర్ లేదా బ్యాకప్ చేసుకోవచ్చు. గూగుల్, యాపిల్ కంపెనీలు కొత్త టూల్ ని పరిచయం చేశాయి. గూగుల్ ఫోటోస్ నుంచి మీడియా ఫైల్స్ ని ఐక్లౌడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కొత్త టూల్ నైతే తీసుకొచ్చాయి.