iDreamPost
android-app
ios-app

ఐఫోన్‌లో ‘సిరి’ పేరు మార్పు! ఇక నుంచి నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు

  • Published Jun 19, 2024 | 4:25 PM Updated Updated Jun 19, 2024 | 4:25 PM

How To Rename Siri In iPhone: ఐఫోన్ లో సిరితో మాట్లాడుతుంటే చాలా మందికి లవర్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే కొంతమందికి సిరి పేరుని మార్చేసి తమ గర్ల్ ఫ్రెండ్ పేరో, ఇంకేదైనా నచ్చిన పేరో పెట్టుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సిరి పేరు బదులు వేరే పేరు పెట్టుకోవచ్చు.

How To Rename Siri In iPhone: ఐఫోన్ లో సిరితో మాట్లాడుతుంటే చాలా మందికి లవర్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే కొంతమందికి సిరి పేరుని మార్చేసి తమ గర్ల్ ఫ్రెండ్ పేరో, ఇంకేదైనా నచ్చిన పేరో పెట్టుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సిరి పేరు బదులు వేరే పేరు పెట్టుకోవచ్చు.

ఐఫోన్‌లో ‘సిరి’ పేరు మార్పు! ఇక నుంచి నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు

యాపిల్ కంపెనీ ఐఓఎస్ 18లో యాపిల్ ఇంటిలిజెన్స్ పేరుతో సరికొత్త అప్డేట్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ‘సిరి’ని పూర్తిగా ఫ్రెష్ లుక్ లో, సరికొత్త సామర్థ్యాలతో రూపొందించింది. ఈ కొత్త సిరి ఫీచర్ మరింత పవర్ ఫుల్ గా, పర్సనల్ గా ఉంటుంది. యాపిల్ కంపెనీ ఇప్పుడు ఐఓఎస్ 18లో సిరి పేరుని మార్చుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో సిరి బదులుగా మీకు నచ్చిన పేరుని పెట్టుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్ పేరో, బాయ్ ఫ్రెండ్ పేరో, నచ్చిన పర్సన్స్ పేర్లు గానీ, పెంపుడు కుక్కల పేర్లు గానీ ఇలా రకరకాల పేర్లు పెట్టుకునే ఆప్షన్ ఇచ్చింది యాపిల్ కంపెనీ. ఇప్పటికే ఐఓఎస్ 17.. హే సిరి నుంచి హే పదాన్ని తొలగించింది. ఇప్పుడు ఐఓఎస్ 18తో ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. అయితే ఈ పేరుని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం. 

పేరు మార్చాలంటే నేరుగా సిరి సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్చుకోవడం కుదరదు. ఐఓఎస్ 18లోని వోకల్ షార్ట్ కట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ముందు మీరు ఐఓఎస్ 18ని మీ ఫోన్ లో అప్డేట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఐఓఎస్ 18 డెవలపర్ బీటా వెర్షన్ లోనే ఉంది. ఐఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాక్సెసిబిలిటీ ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే వోకల్ షార్ట్ కట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సెటప్ వోకల్ షార్ట్ కట్స్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేసి సిస్టం సెక్షన్ కింద ఉన్న సిరిని ఎంపిక చేసుకోవాలి. అయితే టాప్ లో ఉన్న సిరి రిక్వెస్ట్ ని సెలెక్ట్ చేసుకోకూడదు. సిస్టం సెక్షన్ కింద ఉన్న సిరిని ఎంపిక చేసుకున్నాక కస్టమ్ ఫ్రేస్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ సిరి బదులుగా మీరు వేరే పేరుని ఇచ్చుకోవచ్చు.

How To Rename Siri In iPhone

ఐఫోన్ 16 అని, గిరి అని ఇలా మీకు నచ్చిన పేరు ఏదైనా గానీ ఇచ్చుకోవచ్చు. మీరు ఏ పేరుతో పిలవాలనుకుంటున్నారో ఆ పేరుని కస్టమ్ ఫ్రేస్ లో టైప్ చేయాలి. మీరు టైప్ చేసిన పేరుని మీరు పలకాలి. మీరు పలకడం ద్వారా ఐఫోన్ మీ వాయిస్ ని గుర్తిస్తుంది. మీరు కొత్తగా ఇచ్చిన పేరుని ఐఫోన్ గుర్తుపెట్టుకోవాలంటే మూడుసార్లు పలకాలి. అప్పుడు ఐఫోన్ మీరు ఇచ్చిన పేరుని గుర్తిస్తుంది. అలానే సిరి చేసే పనులన్నీ మీరు పెట్టిన పేరుతో చేస్తుంది. హే సిరి బయట టెంపరేచర్ ఎలా ఉంది అని అడిగినట్టు హే రాంబాబు టెంపరేచర్ ఎలా ఉంది అని అడగవచ్చు. అయితే ఈ పేరు ఐఫోన్ లో మాత్రమే అవుతుందని.. హోమ్ పాడ్ వంటి ఇతర పరికరాలతో సింక్ అవ్వదు. స్క్రీన్ షాట్ తీసుకో, వాల్యూమ్ మార్చు, కంట్రోల్ సెంటర్ ని చూపించు సహా ఎన్నో సిస్టం ఫీచర్స్ ని వోకల్ షార్ట్ కట్స్ తో ఐఫోన్ కి ఆదేశాలు ఇవ్వచ్చు.