ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం వేలల్లో ఖర్చు చేస్తున్నారా? గూగుల్ AIతో ఫ్రీగా నేర్చుకోండి!

Google English Speaking AI Tool Full Details: ఇంగ్లీష్ నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, అది కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం. కొంతమంది అయితే ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వేలకు వేలు ఖర్చు చేసుంటారు. కానీ, ఇప్పుడు గూగుల్ ఏఐ టూల్ తో మీరు ఫ్రీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

Google English Speaking AI Tool Full Details: ఇంగ్లీష్ నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, అది కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం. కొంతమంది అయితే ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వేలకు వేలు ఖర్చు చేసుంటారు. కానీ, ఇప్పుడు గూగుల్ ఏఐ టూల్ తో మీరు ఫ్రీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఎంతో మందికి ఉంటుంది. కానీ, ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే అంత తేలిక కూడా కాదు. కొంత మంది కాంప్రహెన్సివ్ స్పీకింగ్ కాకపోయినా.. డైలీ యూజ్ కోసం ఇంగ్లీష్ లో మాట్లాడటం నేర్చుకోవాలి అనుకుంటారు. అయితే అందుకు అందరికీ కోచింగ్ సెంటర్లు, ఇన్ స్టిట్యూట్ల చుట్టూ తిరగలేరు. అలాంటి వారి కోసం ఇప్పుడు గూగుల్ గొప్ప శుభవార్త చెప్పేసింది. అవును.. మీరు గూగుల్ ఏఐ ఫీచర్ తో చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంతేకాకుండా.. మీ ఇంగ్లీష్ ఒకాబులరీని కూడా పెంచుకోవచ్చు. మరి.. ఆ వివరాలేంటో చూద్దాం.

ఇంగ్లీష్ నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగం కోసం నగరాలు, మెట్రోపాలిటన్ సిటీలకు వెళ్లే వారికి ఇంగ్లీష్ మీద పట్టు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు డైలీ లైఫ్ లో ఇంగ్లీష్ ని ఎక్కువగా వాడరు కాబట్టి. కానీ, ఉద్యోగం రావాలి అంటే మినిమం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. ఎదుటివారు ఏ ప్రశ్న అడిగారు అనేది అర్థమవుతూ ఉంటుంది. కానీ, ఇంగ్లీష్ లో తిరిగి సమాధానం చెప్పాలి అంటే కాస్త తడబడుతూ ఉంటారు. ఒక్కోసారి సరైన పదాలు కూడా దొరకవు. అలాంటి వారికోసం గూగుల్ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తోంది.

గూగుల్ సరికొత్త స్పీకింగ్ ప్రాక్టీస్ ఏఐ టూల్ ని తీసుకొస్తోంది. ఈ టూల్ సాయంతో మీరు ఇంగ్లీష్ మాట్లాడటం సులువుగా నేర్చుకోవచ్చు. ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ టూల్ ఆర్టిఫీషియల్ సాయంతో వర్క్ అవుతుంది. మీరు ఈ గూగుల్ టూల్ ద్వారా ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు తగిన ప్రశ్నలు మాత్రమే కాకుండా.. తగిన ప్రాంప్ట్ ను కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాక్టీస్ లో అనుబంధ ప్రశ్నలు కూడా వస్తాయి. మీరు ఈ టూల్ లో డైరెక్ట్ గా మీ ప్రశ్నను అడగవచ్చు. అలా కాదు అనుకుంటే టైప్ చేసి కూడా మీ ప్రశ్నను చెప్పవచ్చు. మీరు ఏదైతే ఇన్ పుట్ ని ఇస్తున్నారో.. దానికి తగిన విధంగా ప్రశ్నలను గూగుల్ టూల్ డిస్ ప్లే చేస్తుంది.

ఈ టూల్ అయితే ప్రస్తుతానికి టెస్టింగ్ దశలోనే ఉంది. ఈ గూగుల్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఏఐ టూల్ ని యాక్టివేట్ చేసుకోవడానికి.. మీరు గూగుల్ సెర్చ్ ల్యాబ్స్ ప్రోగ్రామ్ లో ఎన్ రోల్ చేసుకోవాలి. మీరు ఎన్ రోల్ చేసుకున్న తర్వాతే ఈ టూల్ ని యాక్టివేట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. మీరు ఎన్ రోల్ చేసుకున్న తర్వాత గూగుల్ యాప్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉండే టాప్ లో ఉండే గూగుల్ ల్యాబ్ సింబల్ ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఏఐ ఎక్స్ పెరిమెంట్ విభాగం ఉంటుంది. అక్కడ మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

Show comments