iDreamPost

మీ వాట్సాప్‌లో ‘మెటా ఏఐ’ ఫీచర్ లేదా? రావాలంటే ఇలా చేయండి

How To Get Meta AI On WhatsApp: మెటా సంస్థ ఇటీవల మెటా ఏఐ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. కేవలం కొందరికి మాత్రమే వచ్చింది. మరి మీ ఫోన్ లో ఈ ఫీచర్ ని పొందడానికి ఏం చేయాలంటే?

How To Get Meta AI On WhatsApp: మెటా సంస్థ ఇటీవల మెటా ఏఐ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. కేవలం కొందరికి మాత్రమే వచ్చింది. మరి మీ ఫోన్ లో ఈ ఫీచర్ ని పొందడానికి ఏం చేయాలంటే?

మీ వాట్సాప్‌లో ‘మెటా ఏఐ’ ఫీచర్ లేదా? రావాలంటే ఇలా చేయండి

మెటా సంస్థ.. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ యాప్స్ లో ‘మెటా ఏఐ’ పేరుతో ఒక ఏఐ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫీచర్ అన్ని స్మార్ట్ ఫోన్స్ లో అందుబాటులో లేదు. కొంతమందికి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాలో ఈ మెటా ఏఐ ఫీచర్ అనేది కనబడుట లేదు. దీంతో మేము మెటా ఏఐతో చాట్ చేసి దీని గురించి అడుగగా.. మెటా ఏఐ మాకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది. ఆ సలహాలు, సూచనలతో మెటా ఏఐ ఫీచర్ ఫోన్ లో కనిపిస్తుందని మెటా ఏఐ ఫీచర్ తెలిపింది. మీ ఫోన్ లో కూడా మెటా ఏఐ ఫీచర్ కనబడకపోతే గనుక మీరు ఈ సింపుల్ టిప్స్ ని పాటించండి.   

మెటా ఏఐ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి:

మీ దేశంలో మెటా ఏఐ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి. చట్టపరమైన, నియంత్రణ పరిమితుల కారణంగా మెటా ఏఐ ఫీచర్ అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు. మన దేశంలో ఎలాంటి పరిమితులు లేవు. కాబట్టి చెక్ చేయాల్సిన పని లేదు. 

ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్:

మెటా ఏఐ అనేది అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లేదా వెర్షన్స్ కి సపోర్ట్ చేయదు. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ అనేది మెటా ఏఐకి సపోర్ట్ చేసే ఓఎస్ తో మీ ఫోన్ నడుస్తుందో లేదో చెక్ చేయండి. లేదంటే లేటెస్ట్ ఓఎస్ కి అప్డేట్ చేయండి.  

వాట్సాప్ వెర్షన్ ని చెక్ చేయండి:

మీ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ దో కాదో చెక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఐతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్స్ ఐతే యాప్ స్టోర్ నుంచి లేటెస్ట్ వెర్షన్ ని అప్డేట్ చేయండి.   

మెటా ఏఐ ఎనేబుల్ అయ్యిందో లేదో చూడండిలా:

వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్స్ లోకి వెళ్తే.. చాట్స్ పైన మెటా ఏఐ కనబడుతుంది. 

వాట్సాప్ క్యాచి అండ్ డేటాను క్లియర్ చేయండి:

ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ లో వాట్సాప్ ని ఎంచుకుని అందులో స్టోరేజ్ లోకి వెళ్లి క్లియర్ క్యాచి అండ్ క్లియర్ డేటాపై క్లిక్ చేయండి. 

ఫోన్ రీస్టార్ట్ చేయండి:

అప్పటికీ మీ ఫోన్ లో వాట్సాప్ లో మెటా ఏఐ కనిపించకపోతే గనుక ఫోన్ ని రీస్టార్ట్ చేయండి. కనిపించే అవకాశం ఉంటుంది. 

అప్డేట్స్ ని చెక్ చేయండి:

గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లోకి వెళ్లి అప్డేట్స్ కోసం చెక్ చేయండి. 

వాట్సాప్ ని రీ ఇన్స్టాల్ చేయండి:

పైన చెప్పిన స్టెప్స్ ని అనుసరించినా కూడా మీకు వాట్సాప్ లో మెటా ఏఐ ఫీచర్ కనబడకపోతే కనుక మీ వాట్సాప్ ని అన్ ఇన్స్టాల్ చేసి మరలా ఇన్స్టాల్ చేసి చూడండి. 

పైవన్ని స్టెప్స్ ని ఫాలో అయినా కూడా మెటా ఏఐ ఫీచర్ ని పొందలేదంటే మీరు సహాయం కోసం వాట్సాప్ సపోర్ట్ తీసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. వాట్సాప్ మెటా ఏఐ ఫీచర్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కాబట్టి ఇది కొందరి ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మీకు కూడా రావచ్చు. టెస్టింగ్, డెవలప్మెంట్ దశలో ఉన్నందున మెటా ఏఐ అనేది పరిమిత సంఖ్యలో యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది.

అందరికీ ఆందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెటా ఏఐ పని చేస్తుంది. అయితే మెటా సంస్థ టెస్టింగ్ అండ్ ఫీడ్ బ్యాక్ ప్రోగ్రాంని నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనేందుకు కొంతమంది యూజర్స్ ని ఎంపిక చేస్తుంది. మీరు కనుక ఈ మెటా ఏఐ ఫీచర్ ని పొందాలంటే కనుక సైనప్ అవ్వడం ద్వారా వెయిటింగ్ లిస్టులో చేరవచ్చు. అంతా ఓకే అనుకుంటే కనుక కొత్త యూజర్స్ కి వాట్సాప్ మెటా ఏఐ నోటిఫికేషన్ పంపుతుంది. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ కైనా ఇదే ప్రాసెస్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి