iDreamPost
android-app
ios-app

మీ ఎయిర్‌పాడ్స్ కేస్ మిస్ అయ్యిందా? క్షణాల్లో ఎక్కడుందో కనుక్కోండిలా!

How To Find My Lost Airpods Case: ఎయిర్ పాడ్స్ ఛార్జింగ్ 24 గంటల కంటే ఎక్కువ సమయం పని చేస్తుండడం వల్ల ఎయిర్ పాడ్స్ కేస్ ని మనతో పాటు తీసుకెళ్లే పని ఉండడం లేదు. దీని వల్ల కొన్నిసార్లు ఎయిర్ పాడ్స్ కేస్ ఎక్కడుందో అన్న సంగతి మర్చిపోతుంటాం. అయితే ఈ సింపుల్ స్టెప్స్ తో ఎక్కడో పెట్టి మర్చిపోయిన ఎయిర్ పాడ్స్ కేస్ ని ఎక్కడుందో తెలుసుకోవచ్చు.

How To Find My Lost Airpods Case: ఎయిర్ పాడ్స్ ఛార్జింగ్ 24 గంటల కంటే ఎక్కువ సమయం పని చేస్తుండడం వల్ల ఎయిర్ పాడ్స్ కేస్ ని మనతో పాటు తీసుకెళ్లే పని ఉండడం లేదు. దీని వల్ల కొన్నిసార్లు ఎయిర్ పాడ్స్ కేస్ ఎక్కడుందో అన్న సంగతి మర్చిపోతుంటాం. అయితే ఈ సింపుల్ స్టెప్స్ తో ఎక్కడో పెట్టి మర్చిపోయిన ఎయిర్ పాడ్స్ కేస్ ని ఎక్కడుందో తెలుసుకోవచ్చు.

మీ ఎయిర్‌పాడ్స్ కేస్ మిస్ అయ్యిందా? క్షణాల్లో ఎక్కడుందో కనుక్కోండిలా!

ఎయిర్ పాడ్స్ అనేవి జేబుల్లో, పర్సుల్లో పట్టేంత చిన్నవిగా ఉంటాయి. అందుకే యాపిల్ యూజర్లు ఈ ఇయర్ బడ్స్ ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఛార్జింగ్ ఎక్కువ సేపు నిలబడడం వల్ల ఛార్జింగ్ కేస్ ని క్యారీ చేసే పని ఉండదు. దీని వల్ల ఛార్జింగ్ కేస్ ని ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. ఎయిర్ పాడ్స్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టడానికి ఎయిర్ పాడ్స్ కేస్ ఉండాలి. ఈ కేస్ ఎంత వెతికినా కనబడదు. ఇలాంటి సమయంలో టెక్నాలజీని వాడుకుంటే ఎక్కడుందో ఈజీగా కనుక్కోవచ్చు. మీరు కనుక ఒక ఎయిర్ పాడ్ తో ఎయిర్ పాడ్స్ కేస్ ని ఎక్కడ పెట్టారో మర్చిపోతే కనుక.. ఫైండ్ మై యాప్ ద్వారా లేదా ఐక్లౌడ్ ద్వారా ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఎయిర్ పాడ్స్ మోడల్ ని లొకేట్ చేయడం ద్వారా ఎక్కడున్నాయో గుర్తించవచ్చు. అయితే గుర్తించాలంటే ముందు మీరు ఫైండ్ మై యాప్ లో సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకున్నాకే మీరు మిస్ అయిన మీ ఎయిర్ పాడ్స్ కేస్ ని గుర్తించగలరు.  

Find airpods case in maps

ఫైండ్ మై యాప్:

ఫైండ్ మై యాప్ ఓపెన్ చేసి కింద డివైజెస్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. అందులో మీ ఎయిర్ పాడ్స్ ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీకు ఎయిర్ పాడ్స్ కేస్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, లాస్ట్ నోన్ లొకేషన్ చూడచ్చు. ఒకవేళ ఎయిర్ పాడ్స్ కేస్ మీకు దూరంగా అంటే ఇంట్లోనో, ఆఫీస్ లోనో మర్చిపోయి ఉంటే కనుక.. అది బ్లూటూత్ కి కనెక్ట్ అయి ఉంటే కనుక ఫైండ్ నియర్ బై మీద ట్యాప్ చేయాలి. ప్లే సౌండ్ మీద ట్యాప్ చేస్తే ఎయిర్ పాడ్స్ సౌండ్ చేస్తాయి. అప్పుడు మీరు డైరెక్షన్స్ మీద ట్యాప్ చేస్తే ఎయిర్ పాడ్స్ కేస్ ఎక్కడుందో యాపిల్ మ్యాప్స్ లో చూపిస్తుంది. నో లొకేషన్ ఫౌండ్ అని వస్తే ఎయిర్ పాడ్స్ ని మామూలుగా వెతుక్కోవడమే.       

ఐక్లౌడ్ ద్వారా గుర్తించడం:

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లేదా విండోస్ పీసీ వంటి వాటితో కూడా మిస్ అయిన ఎయిర్ పాడ్స్ కేస్ ని కనుగొనవచ్చు. దీని కోసం మీరు స్మార్ట్ ఫోన్ లేదా పీసీలో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఐక్లౌడ్ అకౌంట్ లాగిన్ అవ్వాలి. ఎయిర్ పాడ్స్ ఏ యాపిల్ ఐడీతో లింక్ అయి ఉన్నాయో ఆ యాపిల్ ఐడీతోనే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఆల్ డివైజెస్ మీద క్లిక్ చేయాలి. అందులో ఎయిర్ పాడ్స్ అని కనబడుతుంది. ఇక్కడ మ్యాప్ లో ప్రస్తుత లొకేషన్, లాస్ట్ ఉన్న లొకేషన్ ని చూపిస్తుంది.     

ఒకవేళ ఎయిర్ పాడ్స్ కేస్ లో ఎయిర్ పాడ్స్ లేకపోతే:

ఎయిర్ పాడ్స్ కేస్ లో ఎయిర్ పాడ్స్ ఉండి మర్చిపోతే ఎలా కనుగొనవచ్చో తెలుసుకున్నారు. అయితే ఒకవేళ కేస్ లో ఎయిర్ పాడ్స్ లేకపోతే ఎలా కనుక్కోవాలో తెలుసుకోండి. మీ దగ్గర ఎయిర్ పాడ్స్ ప్రో 2వ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ఉంటే కనుక మిస్ అయిన ఎయిర్ పాడ్స్ కేస్ ని సులువుగా కనుగొనవచ్చు. కేస్ లో ఎయిర్ పాడ్స్ లేకున్నా గుర్తించవచ్చు. ఎందుకంటే ఎయిర్ పాడ్స్ ప్రో 2లో యూ1 చిప్ ఉంది. పాడ్స్ కేస్ లో ఒక స్పీకర్ ఉంటుంది. దీంతో పాడ్స్ కేస్ ని ఈజీగా ట్రాక్ చేయచ్చు. అయితే మిగతా మోడల్స్ కేస్ లో స్పీకర్ లేదు. కాబట్టి కేస్ లో ఒక ఇయర్ బడ్ అయినా ఉండాలి. 

ఎయిర్ పాడ్స్ పెయిర్ అయిన ఐఫోన్, ఐపాడ్ లేదా మ్యాక్ లో ఫైండ్ మై యాప్ ని ఓపెన్ చేయాలి. 

కింద డివైజెస్ ట్యాబ్ లోకి వెళ్లి లిస్టులో ఉన్న మీ ఎయిర్ పాడ్స్ ని ఎంచుకోవాలి. కేస్ లో ఇయర్ బడ్ లేకపోతే కనుక ఎయిర్ పాడ్స్.. అవుట్ సైడ్ ఆఫ్ కేస్’ అని అలర్ట్ చేస్తాయి. ఎయిర్ పాడ్స్ మీద ట్యాప్ చేయాలి. అప్పుడు ఈ యాప్ లో ఎయిర్ పాడ్స్ కేస్, ఎడమ ఇయర్ బడ్, కుడి ఇయర్ బడ్ ఇలా మూడింటి లొకేషన్స్ ని విడివిడిగా చూపిస్తుంది. కేస్ ని సెలెక్ట్ చేసి ఫైండ్ లేదా డైరెక్షన్స్ మీద ట్యాప్ చేసి ఎయిర్ పాడ్స్ కేస్ ని ట్రాక్ చేయవచ్చు. సౌండ్ ని ప్లే చేయడం ద్వారా కూడా కేస్ ని ఈజీగా ట్రాక్ చేయవచ్చు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి