iDreamPost
android-app
ios-app

ఫోన్‌లో మీరేం చూస్తున్నారో గమనిస్తున్నారు.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇలా చేయండి!

  • Published Apr 22, 2024 | 4:50 PM Updated Updated Apr 22, 2024 | 4:50 PM

మీరు ఫోన్ లో ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అనే వివరాలు అన్నీ ఒక చోట స్టోర్ అవుతున్నాయి. నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అయినా కూడా ఆ డేటా అనేది ఒక చోట స్టోర్ అవుతుంది. అది ఏదో ఒక రోజు స్కామర్ల చేతిలోకి వెళ్లక ముందే జాగ్రత్త పడండి.

మీరు ఫోన్ లో ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అనే వివరాలు అన్నీ ఒక చోట స్టోర్ అవుతున్నాయి. నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అయినా కూడా ఆ డేటా అనేది ఒక చోట స్టోర్ అవుతుంది. అది ఏదో ఒక రోజు స్కామర్ల చేతిలోకి వెళ్లక ముందే జాగ్రత్త పడండి.

ఫోన్‌లో మీరేం చూస్తున్నారో గమనిస్తున్నారు.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇలా చేయండి!

మీ ఫోన్ లో ఏం చేస్తున్నారో? ఏం చూస్తున్నారో అనే విషయాలు మీకు మాత్రమే కాకుండా టెక్నాలజీని తమ గుప్పిట్లో పెట్టుకున్న పెద్ద పెద్ద సంస్థలకు కూడా తెలిసిపోతుంది. మీరు సరిగ్గా గమనిస్తే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ ప్రకటనలు వస్తాయి. యూట్యూబ్ లో కావచ్చు, గూగుల్ క్రోమ్ లాంటి వెబ్ బ్రౌజర్స్ లో కావచ్చు.. మీరు ఎవరితో అయినా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడితే దాని రిలేటెడ్ ప్రకటనలు వస్తుంటాయి. అంటే మీ ఫోన్ మీ వాయిస్ వింటుంది. అలానే మీరు గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్లు వాడుతుంటారు కదా. అయితే మీకు తెలుసా? మీకు తెలియకుండానే మీ యాక్టివిటీస్ రిలేటెడ్ డేటా అనేది వేరే వెబ్ సైట్స్ కి వెళ్ళిపోతుంది.

బ్యాంకింగ్ రిలేటెడ్ లాగిన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్ సేవ్ అని చెప్పి గూగుల్ ఒక ప్రాంప్ట్ ని అలర్ట్ చేస్తుంది. దాన్ని అనేబుల్ చేస్తే మీరు మళ్ళీ లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. అయితే ఈ డేటా గూగుల్ స్టోర్ అయి ఉండడం అంత సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గూగుల్ నుంచి డేటాని స్కామర్స్ దొంగిలించే ఛాన్సెస్ ఉన్నాయని.. లేదా గూగులే బయట వారికి అమ్మేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే రష్యన్ కోర్టు గూగుల్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేస్తుందని భారీ జరిమానా విధించింది. అంటే పర్సనల్ డేటా స్టోర్ చేయడం అనేది నేరం. ఈ లెక్కన మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ లేదా ఇతర వెబ్ బ్రౌజర్స్ లో డేటా స్టోర్ అవ్వడం వల్ల కూడా ప్రమాదమే. ఆ డేటా ఎలా ఎప్పుడు ఏ సమయంలో అయినా స్కామర్ల చేతికి చిక్కచ్చు. కాబట్టి మీరు దీన్నుంచి సురక్షితంగా ఉండాలంటే మీరు వెంటనే ఈ పని చేయాలి.

మీరు గూగుల్ బ్రౌజర్ వాడుతున్నట్లైతే ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి కుడివైపున పైన ఉండే మూడు డాట్స్ పై క్లిక్ చేయండి. బాగా కిందకి స్క్రోల్ చేస్తే సెటింగ్స్ అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేసి బాగా కిందకు వెళ్తే సైట్ సెటింగ్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి లోపలకు వెళ్తే డేటా స్టోర్డ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ సైట్ ఓపెన్ చేశారు? ఏ లింక్ ఓపెన్ చేశారు? అనే డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. కింద భాగంలో డిలీట్ ఆల్ డేటా అని కనబడుతుంది.

దాని మీద క్లిక్ చేస్తే మీ సైట్ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. పైగా మీకు కొంత మెమొరీ స్పేస్ కూడా క్లియర్ అవుతుంది. దీని వల్ల మీ ముఖ్యమైన డేటాతో పాటు వేస్ట్ డేటా కూడా ఎగిరిపోతుంది. కాబట్టి వెంటనే ఈ పని చేయండి. మిగతా వెబ్ బ్రౌజర్లకి కూడా ఇలానే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆప్షన్స్ ప్లేస్ మెంట్ అనేది మారుతుంది. కాబట్టి బ్యాంకు పాస్వర్డ్స్ వంటి ముఖ్యమైన సమాచారం ఏదైనా హ్యాక్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే కనుక వెంటనే డిలీట్ చేయండి. అలానే మీ యాక్టివిటీస్ ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నా ఇలా చేయండి. ఈ కథనం ఉపయోగపడుతుందనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. అలానే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.