ఇన్‌స్టాగ్రామ్‌లో హిడెన్ గేమ్.. ఈ ట్రిక్ ఉపయోగించాల్సిందే!

How To Play Game in Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కంటికి కనిపించే రీల్స్, మెసేజులు మాత్రమే కాదు.. కంటికి కనిపించని గేమ్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇన్‌స్టాగ్రామ్‌లో హిడెన్ గేమ్స్ ఉన్నాయి.. అవి ఆడాలంటే ఏం చేయాలి?

How To Play Game in Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కంటికి కనిపించే రీల్స్, మెసేజులు మాత్రమే కాదు.. కంటికి కనిపించని గేమ్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇన్‌స్టాగ్రామ్‌లో హిడెన్ గేమ్స్ ఉన్నాయి.. అవి ఆడాలంటే ఏం చేయాలి?

ఇన్‌స్టాగ్రామ్‌ అంటే మన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం.. ఎవరైనా రీల్స్ షేర్ చేస్తే చూడడం. ఇంకా వీలైతే తెలిసిన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం. ఇవే కదా మెయిన్ గా చేసేది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌ లో మనకి కనిపించని గేమ్ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అవును ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేకమైన గేమ్ ఉంది. ఆ గేమ్ ఓపెన్ అవ్వాలంటే ఒక ట్రిక్ ప్లే చేయాలి. ఆ గేమ్ ఏంటంటే.. ఒక ఎమోజీ ఉంటుంది. దాని కింద ఒక ప్యాడిల్ ఉంటుంది. దాని సపోర్ట్ తో ఎమోజీని కింద పడిపోకుండా చేయాలి. అలా ఎన్ని సార్లు ప్యాడిల్ ని ఎమోజీ టచ్ అయితే అన్ని పాయింట్స్ వస్తాయి. దీన్ని యూఎస్ కి చెందిన పాట్రిసియా రోజర్స్ అనే వ్యక్తి కనుగొన్నాడు.

ఇదొక పాంగ్ వెర్టికల్ సోలో గేమ్ లేదా బ్రేకవుట్ గేమ్. ప్రతి సక్సెస్ ఫుల్ ఎమోజీ బౌన్స్ కి ఒక పాయింట్ వస్తుంది. ఈ గేమ్ ఆడుతున్న కొద్దీ ఎమోజీ అనేది వేగంగా కదులుతుంటుంది. ఆ సమయంలో ఎమోజీని గాల్లో ఉంచడం అనేది కష్టంగా మారుతుంది. కానీ అలా ఎమోజీని కింద పడకుండా ఎవరైతే ఆపుతారో వారు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఇంతకీ ఈ గేమ్ ని ఎలా ఓపెన్ చేయాలంటే? గేమ్ కోసం మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫ్రెండ్స్ లో ఒకరికి చాట్ బాక్స్ లో ఒక ఎమోజీ పంపించాలి. ఆ తర్వాత ఎమోజీ మీద ట్యాప్ చేస్తే ఈ హిడెన్ గేమ్ ఓపెన్ అయిపోతుంది. ఏ ఎమోజీ పంపినా గానీ ఈ హిడెన్ గేమ్ ఓపెన్ అవుతుంది. ఏ ఎమోజీ పంపితే ఆ ఎమోజీతో ఈ గేమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఉదాహరణకు మీరు లవ్ సింబల్ తో కూడిన ఎమోజీ మీ ఫ్రెండ్స్ కి సెండ్ చేస్తే.. ఆ ఎమోజీ మీద ట్యాప్ చేశారనుకోండి. ఆ లవ్ సింబల్ తో కూడిన ఎమోజీ అనేది మీకు గేమ్ లో కనబడుతుంది.

ఈ హిడెన్ గేమ్ ని చూసి కొంతమంది ఇన్ స్టా యూజర్స్ ప్రెట్టీ కూల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నాకు ఈ గేమ్ వచ్చింది.. ఇన్ స్టా తీసుకొచ్చిన కొత్త అప్డేట్ కావచ్చు ఇది’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. ‘నా దాంట్లో గేమ్ అవుతుంది. సో కూల్’ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. అయితే కొంతమంది మాత్రం ఈ హిడెన్ గేమ్ ని చూడలేకపోతున్నామని అన్నారు. అయితే లేటెస్ట్ వెర్షన్ ని అప్డేట్ చేస్తే వస్తుందని అంటున్నారు. మరి మీరు కూడా ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ ఓపెన్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఎమోజీ పంపి చూడండి. ఆ తర్వాత ఎమోజీ మీద ట్యాప్ చేస్తే మీకు హిడెన్ గేమ్ ఓపెన్ అవుతుంది. హిడెన్ గేమ్ ఓపెన్ అయ్యిందో లేదో కామెంట్ చేయండి.

Show comments