iDreamPost
android-app
ios-app

ఇకపై ట్రాఫిక్‌ సమస్యల నుంచి విముక్తి.. మార్కెట్‌ లో గాల్లో ఎగిరే కార్లు..ధర ఎంతంటే

  • Published May 21, 2024 | 9:52 AM Updated Updated May 21, 2024 | 9:52 AM

ఇప్పటి వరకు మనం డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు, ఎలక్ట్రిక్‌ కార్లను చూసి ఉంటాం. కానీ, తాజాగా ట్రాఫిక్‌ సమస్యల నుంచి విముక్తి కలిగించడానికి మార్కెట్‌ లో గాల్లో ఎగిరే కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకి వీటి ధర ఎంతంటే..

ఇప్పటి వరకు మనం డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు, ఎలక్ట్రిక్‌ కార్లను చూసి ఉంటాం. కానీ, తాజాగా ట్రాఫిక్‌ సమస్యల నుంచి విముక్తి కలిగించడానికి మార్కెట్‌ లో గాల్లో ఎగిరే కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకి వీటి ధర ఎంతంటే..

  • Published May 21, 2024 | 9:52 AMUpdated May 21, 2024 | 9:52 AM
ఇకపై ట్రాఫిక్‌ సమస్యల నుంచి విముక్తి.. మార్కెట్‌ లో గాల్లో ఎగిరే కార్లు..ధర ఎంతంటే

ప్రస్తుత సాంకేతిక యుగంలో రోజురోజుకి టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మార్కెట్‌ లో కొత్త కొత్త మోడల్స్ ఎలక్ట్రానిక్‌ బైక్స​్‌, కార్లు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఇవి ఎన్ని ఉన్న రోడ్డెక్కితే చాలు విపరీతమైన ట్రాఫిక్‌.. రద్దీ అయిన రోడ్లు,టూవీలర​అలు, కార్లు, బస్సులు ఇతర వాహనాలతో నిండిపోయి ఉంటుంది. ఇక ఈ ట్రాఫిక్‌ లో ఎక్కడకి వెళ్లలన్నా..అరగంట, ఒక్కొక్కసారి గంట సమయం కూడా పట్టడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాంటి సమయంలో.. నేరుగా ఎగిరి వెళ్లిపోతే చాలా బాగున్ను అని చాలామంది మనసులో అనుకుంటారు.

కానీ, నిజంగా అలా గాలిలో ఎగిరిపోయే కార్లు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే థ్రిల్లింగ్‌ గా ఉంటుంది కదా. అవును ఇప్పటి వరకు మనం డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు, ఎలక్ట్రిక్‌ కార్లను చూసి ఉంటాం. కానీ, తాజాగా మార్కెట్‌ లో గాల్లో ఎగిరే కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ప్రస్తుతం నగరాల్లో ట్రాఫిక్ సమస్య అతిపెద్ద సమస్యలుగా మారుతున్నాయి.  ముఖ్యంగా.. ఆఫీసు వేళల్లో,  వర్షం పడితే అంతే సంగతులు. కాగా, కొద్దిపాటి దూరం ప్రయాణించాలన్నా గంటలు గంటలు సమయం పడుతోంది. ఆ సమయంలోనే గాల్లో ఎగిరిపోతే బాగుండు అని అనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఆ కల నిజమైంది. అమెరికాకు చెందిన లిఫ్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును రెడీ చేసింది.

కాగా, జపాన్‌లోని టోక్యో కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సాంకేతిక వస్తు ప్రదర్శనలో ఈ గాల్లో ఎగిరే 16 రెక్కల కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇది చూడటానికి అతిపెద్ద పెద్ద డ్రోన్ లా కనిపిస్తుంది కానీ,  ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి ప్రయాణించవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక ఆ ఫోటోలో పది, పన్నెండు మీటర్ల ఎత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ కనిపిస్తుంటాడు.  అయితే భవిష్యత్తు తరాలు పైలెట్‌ అవసరం లేకుండా గాల్లో సులభంగా ప్రయాణించవచ్చని ఈ హెక్సా (Hexa) కారు నిరూపించింది.  ఇక ఈ కారు వెడల్పు 4.5 మీటర్లు, అలాగే ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీంతోపాటు నేల మీద, నీటిలోనూ ల్యాండింగ్ చేయవచ్చని వెల్లడించింది. ఇది గాల్లోకి ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. సెకన్ల వ్యవధిలోనే ఎటు కావాలంటే అటు తిరిగేలా అమర్చారు.

అయితే మనం దీనిని వీడియో గేమ్ ఆడుకున్నట్టుగా.. ఒక చిన్న జాయ్ స్టిక్ సాయంతో దీనిని ఆపరేట్ చేయవచ్చు. వినడానికే సూపర్‌గా ఉన్నా.. ఈ ఎగిరే Hexa కారు ధర కేవలం రూ. 4.12 కోట్లుగా ఉంటుంది. ఇక దీనిని కొనుగోలు చేయాలంటే.. ఇప్పటికిప్పుడు డెలివరీ కుదరదు. ముందుగా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేయాలి. ఆ తర్వాత రెడీ అయ్యాక మీకు అందజేస్తారు. అయితే ఈ కారులో ఒక్కరు తప్ప ఎక్కువ మంది ప్రయాణించడానికి లేదు. పైగా ఇది రీచార్జబుల్‌ బ్యాటరీలతో నడుస్తుంది. ఇక  ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదని ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఇలా చూసుకుంటే.. ఆఫీసులకు వెళ్లే వాళ్లకి ట్రాఫిక్‌ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని చెప్పవచ్చు. అలాగే భవిష్యత్తులో ఈ ఫ్లయింగ్ కార్లు గాల్లో వినియోగం కచ్చితంగా పెరిగిపోవడం ఖాయం అనిపిస్తుంది. మరి, మార్కెట్‌ లో ఎగిరే కార్లు అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.