iDreamPost
android-app
ios-app

Budget 5G Phone: 11 వేలలోపే 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్ కూడా..!

  • Published Jan 18, 2024 | 4:52 PM Updated Updated Jan 18, 2024 | 4:52 PM

5జీ స్మార్ట్ ఫోన్ కొనాలని ఉండి కూడా.. ధరలు చూసి ఆగిపోతున్న వారికి ఇది బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది.

5జీ స్మార్ట్ ఫోన్ కొనాలని ఉండి కూడా.. ధరలు చూసి ఆగిపోతున్న వారికి ఇది బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది.

  • Published Jan 18, 2024 | 4:52 PMUpdated Jan 18, 2024 | 4:52 PM
Budget 5G Phone: 11 వేలలోపే 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్ కూడా..!

ఇప్పుడు అందరూ 5జీ స్మార్ట్ ఫోన్లను తెగ కొనేస్తున్నారు. అసలు స్మార్ట్ ఫోన్ అంటేనే 5జీ ఫోన్ అనే పరిస్థితికి వచ్చేశారు. అందుకే కంపెనీలు కూడా ఈ క్రేజ్ ని వాడుకుంటూ మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్లలను లాంఛ్ చేస్తూ ఉంటున్నాయి. అయితే అన్నీ ఫీచర్స్ ఉండాలి, 5జీ ఫోన్ అయి ఉండాలి అంటే ధర కూడా అలాగే ఉండాలి. అందుకే చాలా మంది 5జీ ఫోన్ అనగానే ఒకడుగు వెనక్కి వేస్తున్నారు. ఎందుకంటే 5జీ స్మార్ట్ ఫోన్ అంటే కాస్త ధర ఎక్కువ అనే భావనలో ఇప్పటికీ వినియోగదారులు ఉన్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కేవలం రూ.11 వేలలోపే అదిరిపోయే ఫీచర్స్ తో ఒక 5జీ ఫోన్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.

ఈ బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్ ని అందిస్తోంది మోటరోలా కంపెనీ. ఫీచర్ ఫోన్లు అంటే అందరికీ ముందు మోటరోలా అనే గుర్తొస్తుంది. ఆ కంపెనీకి అంతటి డిమాండ్, ఆదరణ ఉండేది. కానీ, 5జీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత వారి మార్కెట్ గణనీయంగా పడిపోయింది. 5జీ స్మార్ట్ ఫోన్స్ విషయంలో మాత్రం వాళ్లు కాస్త వెనుక పడిపోయారు. ఇప్పుటు మళ్లీ ఆ మార్కెట్ లో తమ మార్క్ ని క్రియేట్ చేయడానికి చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. బడ్జెట్ లో బెస్ట్ 5జీ ఫోన్లు అందించేందుకు కష్టపడుతున్నారు. అందులో భాగంగానే భారతదేశంలో అత్యధికంగా ఉండే మిడిల్ క్లాస్ రేంజ్ కి అందుబాటులో ఉండే ధరలో అద్భుతమైన 5జీ ఫోన్ ని తీసుకొచ్చారు.

Best 5G phone under 11k

ఈ మోటో జీ34 5జీ స్మార్ట్ ఫోన్ ఎమ్మార్పీ చూస్తే.. రూ.13,999గా ఉంది. కానీ, ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో రూ.3 వేల తగ్గింపుతో రూ.10,999కే అందిస్తున్నారు. అదే మీరు మీ పాత ఫోన్ ని ఎక్స్ ఛేంజ్ చేసేపనైతే.. సెలక్టివ్ మోడల్స్ పై మీకు అదనంగా రూ.1000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఈ ఫోన్ ని రూ.11 వేలలోపే పొందచ్చు. ఈ మోటరోలా జీ34 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. 6.5 ఇంచెస్ హెచ్ డీ ప్లస్.. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేతో వస్తోంది. 1600*720 పిక్సల్స్ రెజల్యూషన్ తో ఈ ఫోన్ డిస్ ప్లే ఉంటుంది.

Best 5G phone under 11k

ఇక ఈ ఫోన్లో 2.2 హెట్జ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ఆక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14తో ఈ మోటో 5జీ ఫోన్ వస్తోంది. ఇందులో 13 5జీ బ్యాండ్స్ ఉంటాయి. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ వేరియంట్ ఉంటుంది. ఇంక కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ+ 2ఎంపీ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో మీకు డాల్బీ సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ 5జీ స్మార్ట్ ఫోన్ వస్తోంది. కెమెరా డిజైన్ గురించి మాట్లాడుకుంటే చాలా స్లిమ్ గా ఉంటుంది. కేవలం 74.6 ఎంఎం విడ్త్ మాత్రమే ఉంటుంది. బరువు కూడా కేవలం 180 గ్రాములే ఉంటుంది. మరి.. ఈ మోటో 5జీ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet