Swetha
గూగుల్ మ్యాప్స్ ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు చాలా హెల్ప్ చేస్తూ వచ్చాయి. ఎవరో ఒకరు నిత్యం ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే ఈ క్రమంలో తాజాగా మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు గూగుల్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ వివరాలు చూసేద్దాం.
గూగుల్ మ్యాప్స్ ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు చాలా హెల్ప్ చేస్తూ వచ్చాయి. ఎవరో ఒకరు నిత్యం ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే ఈ క్రమంలో తాజాగా మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు గూగుల్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ వివరాలు చూసేద్దాం.
Swetha
పల్లెలు, పట్టణాలు , నగరాలు ఇలా ప్రతి చోట.. ప్రతి ఒక్కరు గూగుల్ మ్యాప్స్ ను తరచూ ఉపయోగిస్తునే ఉంటారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత.. ఎవరు దేని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం రావడం లేదు. ఒక్కొక్కరి వ్యక్తి గత అవసరాలకే కాకుండా.. ఈ గూగుల్ మ్యాప్స్ ఈ కామర్స్ , ఫుడ్ డెలివెరి వాళ్లకు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే ఎప్పటినుంచో ఎలాంటి అప్ డేట్స్ లేకుండా గూగుల్ మ్యాప్స్ అలానే ఉన్నాయి. ఇంతకాలం గూగుల్ మ్యాప్స్ ను మించినది ఏది లేదు అనేలా ఉన్న.. పరిస్థితి ఇప్పుడు మెల్లగా తగ్గుముఖం పడుతుంది. తాజాగా మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు గూగుల్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.
ఇటీవల.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కూడా గూగుల్ సంస్థ తమ కస్టమర్లను కాపాడే ప్రయత్నం చేస్తుంది. అలాగే తాజాగా మార్కెట్ లో ఓలా మ్యాప్స్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. దీనితో ఇన్నాళ్లు గూగుల్ మ్యాప్స్ లో లేని అప్ డేట్స్ ఒక్కసారిగా ప్రజలను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆరు కొత్త ఫీచర్స్ ను ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. ఎప్పటినుంచో ప్రజలు ఎదురుచూస్తున్న ఫ్లై ఓవర్ ఇండికేషన్ అలెర్ట్ ను ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. అలాగే కార్స్ , హెవీ వెహికల్స్ ను సరైన రోడ్స్ ను గుర్తించి అలర్ట్ చేసేందుకు.. ఇప్పడు గూగుల్ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా కొచ్చి, చెన్నై లలో కస్టమర్స్ కు.. ఇప్పుడు డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ ద్వారానే మెట్రో టికెట్స్ ను కూడా బుక్ చేసుకునే అవకాశాలు కల్పిస్తుంది. పైగా ఇప్పుడు పెరుగుతున్న ఎలెక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని.. మ్యాప్స్ సెర్చ్ లిస్ట్ లో ఎనిమిది వేలకు పైగా ఛార్జింగ్ స్టేషన్స్ వివరాలను కూడా అప్ డేట్ చేసింది. వీటితో పాటు రోడ్ పై జరిగే ఇన్సిడెంట్స్ రిపోర్టింగ్ ను కూడా అప్ డేట్ చేసింది. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడేలా మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా ఇలాంటి అప్ డేట్స్ నిత్యం గూగుల్ మ్యాప్స్ మీదే డిపెండ్ అయ్యే వారికి బాగా ఉపయోగపడతాయని చెప్పి తీరాలి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.