iDreamPost
android-app
ios-app

SPAM మెయిల్స్ కి చెక్ పెడుతూ GOOGLE నుంచి కొత్త ఫీచర్!

  • Published Nov 21, 2024 | 5:57 PM Updated Updated Nov 21, 2024 | 5:57 PM

Spam Mails: చాలా మంది కూడా జీమెయిల్ వాడుతూ ఉంటారు. అందులో స్పామ్ మెయిల్స్ అనేవి చాలా మందిని కూడా వేధిస్తూ ఉంటాయి.

Spam Mails: చాలా మంది కూడా జీమెయిల్ వాడుతూ ఉంటారు. అందులో స్పామ్ మెయిల్స్ అనేవి చాలా మందిని కూడా వేధిస్తూ ఉంటాయి.

SPAM మెయిల్స్ కి చెక్ పెడుతూ GOOGLE నుంచి కొత్త ఫీచర్!

జీమెయిల్‌ వాడే వారు చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో స్పామ్‌ మెయిల్స్‌ ఒకటి. జీమెయిల్ వాడే వారికి ఈ సమస్య ఎప్పటినుంచో ఉంటుంది. రోజుకి కుప్పలు కుప్పలుగా స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి. వీటి వలన మన మెయిల్ అంతా కూడా డస్ట్ బిన్ లాగా మారిపోతుంది. కొన్ని వేలల్లో స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి. వీటిని ఎంత డిలీట్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. వీటి వల్ల చాలా మంది కూడా అసలు జీమెయిల్ అకౌంటే వాడరు. అందువల్ల ఎన్నో ముఖ్యమైన మెయిల్స్ ని మిస్ అవుతూ ఉంటారు. అయితే ఇలాంటి స్పామ్ మెయిల్స్ రావడానికి కారణం మనమే. ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా చోట్ల మన మెయిల్‌ ఐడీని ఇచ్చేస్తుంటాం. అందువల్ల కుప్పలుతెప్పలుగా స్పామ్‌ మెయిల్స్‌ వస్తుంటాయి. మనల్ని ఎంతగానో వేధిస్తుంటాయి.ఇలాంటి అవసరం లేని మెయిల్స్‌తోనే మన ఇన్‌బాక్స్‌ మొత్తం నిండిపోతుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే జీమెయిల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. దీని పేరు షీల్డ్ ఈ మెయిల్. ఈ కొత్త ఫీచర్‌ను అతి త్వరలో తీసుకురానుంది గూగుల్‌.ఇక ఈ కొత్త ఫీచర్‌ ఎలా పని చేయనుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు టెంపరరీగా ఒక మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షీల్డ్ ఈ-మెయిల్‌ ఐడీతో యూజర్లు ఏ యాప్ నుంచయినా ఏ సైట్ నుంచయినా అకౌంట్‌లోకి లాగిన్‌ కావొచ్చు. అయితే ఈ ఐడీ కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేస్తుంది. తరువాత మళ్లీ అవసరం అనుకుంటే యూజర్ల కొత్త షీల్డ్‌ ఈమెయిల్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. స్పామ్‌ మెయిల్స్‌తో యూజర్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గూగుల్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే గూగుల్‌ మాత్రం ఇంకా ఈ ఫీచర్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.

ఇక యాపిల్‌ ఇప్పటికే తన యూజర్ల కోసం ఇలాంటి సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. హైడ్‌ మై ఈమెయిల్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ తో టెంపరరీగా మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని యాప్ లో లాగిన్ కావచ్చు. అదే విధంగా షీల్డ్ ఈ మెయిల్ ఫీచర్ గనుక గూగుల్ యూజర్లకు అందుబాటులోకి వస్తే మన మెయిల్ ఐడీని ఎక్కడ పడితే అక్కడ వాడాల్సిన అవసరం ఉండదు. మరి త్వరలో గూగుల్ తీసుకు రానున్న ఈ ఫీచర్ గురించి మీరేమీ అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.