iDreamPost
android-app
ios-app

ఏథర్ ఎంట్రీ లెవల్ స్కూటర్.. ఓలాకి గట్టి షాకే ఇది!

ఏథర్ ఎంట్రీ లెవల్ స్కూటర్.. ఓలాకి గట్టి షాకే ఇది!

ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్స్ నే ఇష్టపడుతున్నారనే విషయం తెలిసిందే. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఈవీలపై మోజు తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే అవి కాస్త ఖరీదు అయ్యాయి కాబట్టి. దాన్ని గమనించిన కంపెనీలు ఎంట్రీ లెవల్లో మోడల్స్ ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఓలా నుంచి బేసిక్ లెవల్లో ఎయిర్ మోడల్ ని రీలజ్ చేశారు. ఆ మోడల్ కు అదిరిపోయే బుకింగ్స్ కూడా లభించాయి. బడ్జెట్ ఈవీగా వినియోగదారుల నుంచి మంచి మార్కులు కొట్టేస్తోంది. అయితే ఇప్పుడు ఆ మార్కెట్ కి గండి కొట్టేందుకు ఏథర్ ఎనర్జీ సిద్ధమైపోయింది.

ఇప్పుడు అందరూ ఎంట్రీ లెవల్, బేసిక్ లెవల్ ఈవీ మోడల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మార్కెట్ ని క్యాచ్ చేయడంలో ఓలా సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఏథర్ ఆ మార్కెట్ పై గురి పెట్టింది. ఏథర్ 450sను తీసుకొచ్చింది. కొత్తగా లాంఛ్ చేసిన ఈ ఏథర్ 450ఎస్ లో 2.9KWH బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. దీని ధర విషయానికి వస్తే.. రూ.1.29 లక్షలుగా చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న మోడల్స్ ని కూడా ఏథర్ అప్ గ్రేడ్ చేసింది. 450ఎక్స్ మోడల్ లో ఇకపై రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు. ఒక మోడల్ సింగిల్ ఛార్జ్ లో 115 కిలో మీటర్ల రేంజ్, రెండో మోడల్ 145 కిలోమీటర్ల రేంజ్ తో వస్తున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.1.37 లక్షలు, రూ.1.44 లక్షలుగా నిర్ణయించారు.

ఇప్పుడు నూతనంగా లాంఛ్ చేసిన ఎంట్రీ లెవల్ మోడల్ తో కలిపి 450 శ్రేణిల 3 వేరియంట్స్ ని తీసుకొచ్చినట్లు అయ్యింది. ఈ విషయాన్ని ఏథర్ ఎనర్జీ కో ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా వెల్లడించారు. 450 ఎంట్రీ లెవల్ మోడల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ధర తక్కువ కదా అని నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని హామీ ఇచ్చారు. ఇందులో ఫీచర్స్ గురించి కూడా వివరించారు. ఇందులో 450ఎస్ లో పార్కింగ్ అసిస్టెంట్, ఆటో ఇడికేటర్ కటాఫ్, ఆటో హోల్డ్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నట్లు వెల్లడించారు. డెలివరీల విషయానికి వస్తే.. దశలవారీగా వినియోగదారులకు అందజేస్తామని చెప్పారు. నిజానికి ఇండియన్ మార్కెట్ లో ఏథర్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ, మిగిలిన స్కూటర్లతో పోలిస్తే కాస్త ఖరీదుగా ఉంటాయని వెనకాడేవాళ్లు. కానీ, ఇప్పుడు ఈ ఎంట్రీ లెవల్ 450ఎస్ మోడల్ తో మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈవీ స్కూటర్ విభాగంలో ఓలా పరుగులకు ఈ ఏథర్ ఎనర్జీ బ్రేకులు వేస్తుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.