iDreamPost
android-app
ios-app

ఇకపై దూరదర్శన్‌లో AI యాంకర్లు! ఇంత అందంగా ఉన్నారేంటిరా బాబు!

  • Published May 25, 2024 | 11:43 AM Updated Updated May 25, 2024 | 11:43 AM

ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ట్రెండ్‌ అనేది ఎక్కువగా నడుస్తుంది. ఇప్పటికే వివిధ రంగాల్లో ఈ ఏఐ టెక్నాలజీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు కొత్తగా టెలివిజన్‌ రంగంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ట్రెండ్‌ అనేది ఎక్కువగా నడుస్తుంది. ఇప్పటికే వివిధ రంగాల్లో ఈ ఏఐ టెక్నాలజీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు కొత్తగా టెలివిజన్‌ రంగంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.

  • Published May 25, 2024 | 11:43 AMUpdated May 25, 2024 | 11:43 AM
ఇకపై  దూరదర్శన్‌లో AI యాంకర్లు! ఇంత అందంగా ఉన్నారేంటిరా బాబు!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది.  ఈ క్రమంలోనే.. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ట్రెండ్‌ అనేది ఎక్కువగా నడుస్తుంది. ఇక . కృత్రిమ మేథస్సులో పిలిచే ఈ  సరికొత్త టెక్నాలజీ.. ఇప్పటికే వివిధ రంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని దీని సృష్టికర్తలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే  తాజాగా ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు కొత్తగా టెలివిజన్‌ రంగంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దశాబ్ద కాలంలో టెలివిజన్‌ రంగం ఏ స్థాయిలో అలరిస్తుందో అందరికీ తెలిసిందే. కాగా, ఒకప్పుడు రేడియో ఒక్కటే ఉంటే చాలు అనుకున్న రోజుల్లో దేశంలో 1959 సెప్టెంబర్‌ 15న తోలిసారి ఈ టీవీ ప్రసారాలు మొదలయ్యాయి. నాటి కాలాం నుంచి 24 గంటలు ప్రసారమయ్యే అనేక రకాల కార్యక్రమాలను మనం చూడగలగుతున్నాం. అయితే ప్రభుత్వ రంగం సంస్థ దూరదర్శన్‌ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. దేశంలో మొట్ట మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే రోబోలను యాంకర్లును ప్రయోగాత్మకం చేయబోతుంది. అయితే ఈ రోబోలను  రైతుల కోసం  ప్రత్యేకంగా ప్రసారమవుతోన్న కిసాన్ కార్యక్రమంలో.. ఇకపై వర్చుయల్‌ యాంకర్లుగా సమాచారం అందజేయనున్నారు. కాగా, అవి ‘ఏఐ క్రిష్‌’, ‘ఏఐ భూమి’ అనే పేర్లు కలిగిన ఏఐ యాంకర్లు కావడం గమన్హారం. ఇక ఈ రోబోలు వ్యవసాయం, రైతాంగానికి సంబంధించిన వార్తలు చదువుతారు. అయితే డీడీ కిసాన్ తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంటున్న సందర్భంగా.. మే 26న వీటిని ఆవిష్కరిస్తారు.

అయితే దేశంలోని రైతులు కోసం మే 26న  శైలితో డీడీ కిసాన్‌ రాబోతోందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా.. ఛానెల్ కొత్తరూపం సంతరించుకోనుందని, అలాగే ఈ ఏఐ యాంకర్లు మొత్తం 50 భాషల్లో 24 గంటల 365 రోజులు అలసిపోకుండా.. వార్తలు చదవగలరని పేర్కొంది. అందుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏఐ యాంకర్ల వార్తలు చదువుతారని చెప్పింది. అయితే ఈ ఏఐ రోబోలు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ పరిశోధనలు, రైతు మార్కెట్ ట్రెండ్, ప్రభుత్వ పథకాలు, వాతావరణ మార్పుల గురించి సమాచారం అందజేస్తాయని వివరించింది.

అంతేకాకుండా.. ఈ ఏఐ రోబోలు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ.. గుజరాత్ నుంచి అరుణాచల్ వరకూ ప్రాంతీయ భాషల్లో వ్యవసాయం, రైతులకు సంబంధించిన సమాచారం అందజేస్తాయి’ అని వ్యవసాయ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. దేశంలోని దూరదర్శన్‌లో కిసాన్ ఛానెల్‌ను 2015లో ప్రారంభించారు. అయితే ఇది రైతుల కోసం ఏర్పాటైన మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఛానెల్. కాగా, ఇది పంటలు, పశువుల పెంపకం, సమగ్ర గ్రామాభివృద్ధిపై గ్రామీణ ప్రాంతాలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి, మొట్ట మొదటిసారి దేశంలోని దూరదర్శన్‌ ఛానెల్‌ లో ఏఐ రోబోలు యాంకర్లుగా ప్రవేశపెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.