Dell Technologies: 12,500 మంది ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ డెల్! AI కారణం!

12,500 మంది ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ డెల్! AI కారణం!

Dell Technologies: కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ‘డెల్’ కంపెనీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. డెల్ ఇది ఒక అమెరికన్ టెక్నాలజీ కంపెనీ, కంప్యూటర్ల విక్రయం,ఉత్పత్తులు, ఇతర సర్వీసులు అందిస్తుంది. ఈ దిగ్గజ కంపెనీ చేసిన ఓ కీలక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Dell Technologies: కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ‘డెల్’ కంపెనీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. డెల్ ఇది ఒక అమెరికన్ టెక్నాలజీ కంపెనీ, కంప్యూటర్ల విక్రయం,ఉత్పత్తులు, ఇతర సర్వీసులు అందిస్తుంది. ఈ దిగ్గజ కంపెనీ చేసిన ఓ కీలక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అల్లల్లాడిపోయారు. అమెరికా లాంటి అగ్ర దేశంలో ఆర్థిక వ్యవస్థి కుదేలైంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దిగ్గజ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉద్యోగులకు ఉధ్వాసన పలకాల్సి వచ్చింది. పలు దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించడంతో ఎంతోమంది సాఫ్ట్ వేర్, ఇతర విభాగాల్లో పనిచేసే వారు నిరుద్యోగులుగా మారిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కష్టాలు తీరినా మరోసారి ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేలా లేవనిపిస్తుంది. ఇటీవల దిగ్గజ కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ డెల్ కంపెనీ షాకింగ్ ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో కంప్యూటర్ల తయారీ రంగంలో ఎంతో గొప్ప పేరు సంపాదించింది ‘డెల్’ కంపెనీ. తాజాగా డెల్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. అమ్మకాల విషయంలో పునర్ వ్యవస్థీకరణ ప్రణాలికల్ని అమలు చేయబోతున్నామని.. ఇందు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ కార్యకలాపాల్ని మరింత మెరుగు పర్చుకోవడంలో భాగంగా లెటెస్ట్ టెక్నాలజీని వాడబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కంపెనీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.   గ్లోబల్ సేల్స్ మోడర్నైజేష్ అప్డేట్ పేరిట ఆగస్టు 6న కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటీవ్స్ అయిన బిల్ స్కానెల్, జాన్ బైర్న్ ఎంప్లాయిస్ కి ఈ విషయం ఇ-మెయిల్ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. తమ నిర్ణయానికి గల కారణాలు కూడా అందులో పొందుపర్చినట్లు వార్తలు వస్తున్నాయి.

డెల్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత మంది ఉద్యోగులపై పడుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. దాదాపు 12,500 మందిపై పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. డెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో పది శాతం ఉందని ఆంగ్ల మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. సంస్థలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న మేనేజర్లు, సీనియర్ మేనేజర్లపైనే ఎక్కువగా పడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే డెల్ సంస్థ గత కొంత కాలంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తుంది. 2023 ఫిబ్రవరిలో 1,30,000 మంది ఉద్యోగులు ఉండగా.. ప్రస్తుతం 1,20,000కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. డెల్ కంపెనీలో ప్రతి ఆరే నెలలకు ఒకసారి లేఆఫ్స్ జరగడంపై ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Show comments