Vinay Kola
AI: AI ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యార్థులు AI కోర్సులు నేర్చుకుంటే కచ్చితంగా వారికి మంచి కెరీర్ ఉంటుంది.
AI: AI ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యార్థులు AI కోర్సులు నేర్చుకుంటే కచ్చితంగా వారికి మంచి కెరీర్ ఉంటుంది.
Vinay Kola
రాబోయే 10 ఏళ్లలో టెక్నాలజీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఏఐకి డిమాండ్ బాగా పెరుగుతుంది. అందువల్ల విద్యార్థులు దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే మంచిది. అవి నేర్చుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి టాపిక్స్ ని కోర్సుల్లో చేర్చాలని AICTE సూచించింది. మూడేళ్లకోసారి యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నా కానీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత పాఠ్యాంశాలు లేవని ఏఐసీటీఈ అభిప్రాయపడుతుంది. మ్యాథ్స్ లో విద్యార్థికి పట్టు ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న సిలబస్ లో బేసిక్స్ మాత్రమే ఉన్నాయి. ఇంటర్‌లో చదువుకునే సాధారణ అంశాలు మాత్రమే ప్రస్తుత కోర్సుల్లో ఉంటున్నాయి.
ఇంజినీరింగ్ లో సీఎస్‌ఈ లేదా ఐటీ వంటి సాఫ్ట్ వేర్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కంపెనీల్లో ఉపయోగించే కోడింగ్‌ను మాత్రం అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం బయట పలు కోచింగ్ సెంటర్లలో మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజైన్ థింకింగ్ వంటి సరికొత్త ప్రోగ్రామింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కానీ విద్యార్థులకు ఆల్‌జీబ్రా, అల్గోరిథమ్స్‌పై మంచి పట్టు ఉంటే తప్ప ఈ కోర్సులు నేర్చుకోలేరు. ఇలాంటి అంశాలపై ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యాబోధన సరిగ్గా జరగట్లేదనేది ఏఐసీటీఈ పరిశీలన. ఇంజనీరింగ్‌లో పలు రకాల మైక్రో స్పెషలైజేషన్ కోర్సులని అందిస్తే తప్ప కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు పట్టు సాధించరు.
ఏఐసీటీఈ సూచించిన మార్పులు ప్రకారం ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో మ్యాథ్స్ సబ్జెక్టుని పర్ఫెక్ట్ గా బోధించాలి. కంప్యూటర్ కోడింగ్‌కు సంబంధించిన అల్గోరిథమ్స్, ఆల్‌జీబ్రాతో కూడిన పాఠ్యాంశాలను అప్డేట్ చేసి బోధించాలి. కంప్యూటర్స్ రంగంలో వస్తున్న కొత్త టాపిక్స్ గురించి విద్యార్థులు పట్టు సాధించేలా ప్రాక్టికల్ గా నేర్పించాలి. వాటిపై కాలేజీల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లలో ప్రాక్టికల్స్ పెట్టాలి. ఎథికల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ, రీసెర్చ్ అండ్‌అండర్‌స్టాండింగ్, హ్యూమన్ వాల్యూస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సబ్జెక్టులను కూడా కోర్సుల్లో కచ్చితంగా చేర్చాలి. దీనివల్ల విద్యార్థులకు సామాజిక అవగాహన కాలేజి డేస్ నుంచి అలవాటు అవుతుంది. సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి కోర్సులను మాతృ భాషలో తీసుకురావాలని ఏఐసీటీఈ ప్రయత్నిస్తుంది. అందువల్ల ప్రతి విద్యార్థికి కూడా వీటి గురించి అర్ధం అవుతుంది. ఈ కోర్సులని ప్రాక్టికల్ గా నేర్చుకోవడం వలన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇంటర్ తరువాత విద్యార్థులు కచ్చితంగా ఈ కోర్సులని చెయ్యాలి. అప్పుడే ఇంజినీరింగ్ తరువాత వారికి మంచి కెరీర్ ఉంటుంది.