Swetha
ప్రముఖ ఐటీ సంస్థలు వారి వారి ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రప్పించే క్రమంలో.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ టెక్ సంస్థ డెల్ వారి వర్క్ ఫ్రొం హోమ్ చేసే ఎంప్లాయిస్ ప్రమోషన్స్ విషయంలో కొన్ని ఆంక్షలు విధిస్తూ నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఐటీ సంస్థలు వారి వారి ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రప్పించే క్రమంలో.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ టెక్ సంస్థ డెల్ వారి వర్క్ ఫ్రొం హోమ్ చేసే ఎంప్లాయిస్ ప్రమోషన్స్ విషయంలో కొన్ని ఆంక్షలు విధిస్తూ నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
2020 కోవిడ్ సమయంలో చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికీ కూడా చాలా మంది ఎంప్లాయిస్ ఈ విధానానికి అలవాటు పడి .. ఆఫీసులకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే టీసిఎస్ లాంటి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజ సంస్థలు.. వారి వారి ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రమ్మని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆ నియమాలను ఎవరైనా ఉల్లంగిస్తే.. తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఇక ఇప్పుడు ఈ హెచ్చరికల వంతు డెల్ కంపెనీ వంతైంది. డెల్ కంపెనీ వారి వారి ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రమ్మని ఆదేశాలు జారీ చేసినా కూడా.. కొంతమంది ఇంకా వర్క్ ఫ్రం హోమ్ లోనే ఉండడంతో.. డెల్ సంస్థ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ డెల్ వారి వర్క్ ఫ్రం ఎంప్లాయిస్ ప్రమోషన్స్ పై .. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే వర్క్ చేసుకోదలచిన వారు.. నిరభ్యంతరంగా వర్క్ చేసుకోవచ్చు. కానీ, ఆఫిస్ లో ఉండే ప్రమోషన్స్ మాత్రం వారికీ వర్తించవు అంటూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ సమయం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా.. డెల్ సంస్థ వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటును కొనసాగిస్తూనే ఉంది. అయితే, కొంతకాలంగా అన్ని ఐటీ సంస్థలు వారి వారి ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రమ్మంటూ కఠిన నిబంధనలు చేపట్టిన క్రమంలో .. డెల్ సంస్థ కూడా ఇదే రూల్స్ ను అమలు చేసింది. కానీ, చాలా వరకు ఎంప్లాయిస్ అందరూ ఈ నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి డెల్ సంస్థ వారి ప్రమోషన్స్ విషయంలో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు వారు వెల్లడించారు. మరి ఈసారి టెకీలు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి.
కేవలం ఒక డెల్ సంస్థలోనే కాకుండా.. చాలా మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటుకు అలవాటు పడిపోయారు. దీనితో ఇప్పుడు తిరిగి వారిని ఆఫీసులకు రమ్మంటే.. వారు ఇంకా అదే విధానానికి అలవాటు పడి.. నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ప్రముఖ దిగ్గజ సంస్థలు వారి వారి ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రమ్మనడం వెనుక కూడా.. కారణాలు లేకపోలేదు. వర్క్ ఫ్రం హోమ్ విధానం వలన ఇప్పుడు సైబర్ నేరగాళ్లు.. ఆఫీస్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేరాలకు ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకు.. ఐటీ సంస్థలు ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రమ్మని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మరి, ఇప్పుడైనా వర్క్ ఫ్రం ఎంప్లాయిస్ వారి వారి సంస్థల రూల్స్ ను పాటిస్తారో లేదో చూడాలి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.