Tirupathi Rao
Critical Vulnerabilities Found In Smartphones: స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న వారికి ఇది అతి పెద్ద అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ మూడు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్స్ లో డేంజరెస్ వైరస్ డిటెక్ట్ అయ్యిందంటూ టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Critical Vulnerabilities Found In Smartphones: స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న వారికి ఇది అతి పెద్ద అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ మూడు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్స్ లో డేంజరెస్ వైరస్ డిటెక్ట్ అయ్యిందంటూ టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tirupathi Rao
స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక భాగం అయిపోయాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రలోకి జారుకునే వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అప్ డేట్స్, ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత మెసేజ్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు వంటి అన్ని విషయాలు ఆ స్మార్ట్ ఫోన్లోనే ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వచ్చాక.. మనుషుల జీవన విధానం కూడా ఎంతో మారిపోయింది. అలాగే లైఫ్ కూడా ఈజీ అయిపోయింది. కానీ, అదే సమయంలో స్మార్ట్ ఫోన్ వల్ల అనర్థాలు, నష్టాలు, కష్టాలు కూడా అలాగే పెరిగి పోయాయి. ఒక్క చిన్న పొరపాటు చేసినా కూడా మీ పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఏకంగా మూడు కంపెనీల ఫోన్స్ వాడే వారికి ఈ ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.
స్మార్ట్ ఫోన్స్ అయితే చక్కగా వాడేస్తున్నాం. కానీ, మన వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు భద్రంగా ఉన్నాయా అంటే? కచ్చితంగా ఉన్నాయి అనే చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు హ్యాకర్స్ కూడా కొత్త కొత్త మార్గాల్లో వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు టెక్ నిపుణులు చెబుతున్న వార్త చూస్తే స్మార్ట్ ఫోన్ వాడాలంటే కంగారు పుట్టేస్తుంది. షావోమీ, రెడ్ మీ, పోకో కంపెనీలకు చెందిన డివైజ్ లలో డెడ్లీ వైరస్ ని కనుగొన్నట్లు టెక్ నిపుణులు చెప్తున్నారు. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఐదు రోజులు ఈ ప్రమాదకర వైరస్ ఈ మూడు కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్స్ లో కనిపించిందని చెప్తున్నారు.
ఓవర్ సెక్యూర్డ్ అనే బ్లాగ్ లో ఈ వివరాలను పబ్లిష్ చేశారు. వారు చెప్పిన దాని ప్రకారం షావోమీ, రెడ్ మీ, పోకో డివైజెస్ లో సిస్టమ్ ఫైల్స్ కావచ్చు, వేరే అప్లికేషన్స్ కావచ్చు వాటిలో ప్రమాదకర వైరెస్ డిటెక్ట్ అయ్యిందని వెల్లడించారు. ఈ వైరస్ ఎంత ప్రమాదకం అంటే.. మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యకర్స్ చేతికి అందివ్వగలదని హెచ్చరిస్తున్నారు. ఈ ఇబ్బంది ఎంఐయూఐ, హైపర్ ఓఎస్ వాడుతున్న షావోమీ, రెడ్ మీ, పోకో డివైజెస్ లో కనుగొన్నామన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో షావోమీ కంపెనీ తమ ఎంఐయూఐని హైపర్ ఓఎస్ గా రీబ్రాండ్ చేసింది. అది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది.
ఇప్పుడు ఆ హైపర్ ఓఎస్ లోనే ఇలాంటి సమస్య రావండ యూజర్స్ ని కంగారు పెడుతోంది. గ్యాలరీ, గెట్ యాప్స్, ఎంఐ వీడియో, ఎంఐయూఐ బ్లూటూత్, ఫోన్ సెర్వీసెస్, ప్రింట్ స్పూలర్, సెక్యూరిటీ, సెక్యూరిటీ కోర్ కాంపోనెంట్, సెట్టింగ్స్, షేర్ మీ, సిస్టమ్ ట్రేసింగ్, షావోమీ క్లౌడ్ వంటి వాటిల్లో ఈ వైరస్ ని డిటెక్ట్ చేసినట్లు ఆ బ్లాగ్ లో వెల్లడించారు. అయితే దీనిని ఎంత వరకు నమ్మాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే షావోమీ ఇంకా ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక హెచ్చరికను జారీ చేయలేదు. ఈ మూడు కంపెనీలు త్వరలోనే ఈ వైరస్ డిటెటెక్షన్, సాల్వింగ్ కి సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తారని టెక్ నిపుణులు భావిస్తున్నారు.